ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్


ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్

ఒడిశా

ఈ నెల 9వ తేదీన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బడేల్ అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా సీపీఐ మావోయిస్టు పార్టీ ఈ నెల 18 వ తేదీన దండకారణ్య‌ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు చత్తీస్ గడ్, మహా రాష్ట్ర , ఒడిశా ల్లోని అనేక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ బ్యానర్లు కట్టారు. కరపత్రాలు పంచారు. ఈ బూటకపు ఎన్కౌంట‌ర్ లో అమరులైన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన కామ్రేడ్ కామేశ్వరి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కామ్రేడ్ సత్తిబాబు, విజయనగరం జిల్లాకు చెందిన కామ్రేడ్ వివేక లక్ష్మి, చత్తీస్ గడ్ కు చెందిన కామ్రేడ్ గీత , ఒడిశా రాష్ట్రం నారాయణపట్నాకు చెందిన కామ్రేడ్ కృష్ణ వడక లకు జోహార్లు అని, అమరుల నెత్తిటి బాకీ తీర్చుకుంటాం అని మావోయిస్టు పార్టీ నినదించింది. విదేశీ కార్పోరేట్ సంస్థలకు మన దేశ‌ ఖనిజ సంపదను దోచి పెట్టేందుకోసం పాలకులు ఆదివాసులను నిరాశ్రయులుగా మారుస్తున్నారని, ఆదివాసుల పక్షాన నిలబడి పోరాడుతున్న మావోయిస్టులను హత్యలు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ మండిపడింది. తమను హత్యలు చేయడం కోసమే రహదారులు నిర్నిస్తున్నారని నిజంగా రహదారులు అవసరమైన అనేక ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారులు లేక అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోవడం లేదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

బంద్ ను జయప్రదం చేయడం కోసం దండకారణ్యంలోని అనేక ప్రాంతాల్లో ఆదివాసులు చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వినట్టు సమాచారం.
అమరో వైపు దండకారణ్య బంద్ ను విఫలం చేయడం కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. బంద్ లో పాల్గోవద్దంటూ స్థానిక వ్యాపారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గ్రామాన్ని జల్లెడపడుతూ ఆదివాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

Keywords : maoists, fake encounter, chattisgarh, odisha, maharashtra
(2019-09-22 12:02:05)



No. of visitors : 401

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


ఒడిశా