కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం


కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం

కోరాపుట్

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బడేల్ అటవీ ప్రాంతంలో ఈ నెల 9న జరిగిన ఎన్ కౌంటర్ పై నిజ నిర్దారణ కోసం ఈరోజు (మే 18 ) వెళ్ళిన నిజనిర్దారణ బృందాన్ని పోలీసు ప్రాయోజిత నక్సల్స్ బాధిత సంఘం అడ్డుకొని దాడికి ప్రయత్నించింది.
బడేల్ అటవీ ప్రాంతంలో జరిగింది ఎన్కౌంటర్ కాదని ఎన్ కౌంటర్ పేరుతో 6 గురు నిరాయుధులైన‌ మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ సంఘటన నిజానిజాలు పరిశీలించేందుకు పౌరహక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ అద్యక్షులు చిట్టిబాబు,ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ నాయకులు శ్రీమన్నారాయణ, విశాఖ జిల్లా కన్వీనర్ రఘురాం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు లు బడేల్ అటవీ ప్రాంతానికి బయలు దేరారు కోరాపుట్ కు 24 కిలోమీటర్ల దూరంలో సునాబేడ వద్ద మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లతో దాదాపు వంద మంది రోడ్డుకు అడ్డుగా నిలబడ్డారు. వారితోపాటు డ్రస్సులో కొందరు , సివిల్ డ్రస్సులో కొందరు పోలీసులు నిలబడి ఉన్నారు. నిజ నిర్దారణ బృందం వెళ్తున్న వాహనాన్ని అడ్డుకొని బృందం సభ్యులను కిందికి దించి వాళ్ళను చుట్టు ముట్టారు. పౌరహక్కుల సంఘం నాయకులతో వాగ్వివాదానికి దిగారు. వారిని రెచ్చగొట్టి దాడి చేయాలన్న ప్లాన్ తో ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. పౌరహక్కుల నాయకులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ...పోలీసుల కనుసైగలతో వారు మరింత రెచ్చిపోయారు.
నిజనిర్దారణకు వెళ్ళడానికి వీలు లేదని, వెనక్కి వెళ్ళిపోవాలని బెధిరించారు. డ్రస్సుల్లో ఉన్న పోలీసులు కూడా పౌరహక్కుల సంఘం నేతలు వెనక్కి వేళ్ళి పోవాలని లేదంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని హెచ్చరించారు. దాదాపు రెండు గంటలపాటు నడి రోడ్డులో ఎండలోనే హక్కుల సంఘం నాయకులను నిలబెట్టి దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అప్పటికి సాయంత్రం అవుతుండటంతో ముందుకు వెళ్ళినా చీకటి అయ్యే లోపు సంఘటనా స్థలానికి చేరుకోలేమనే భావనతో నిజ నిర్దారణ బృందం సభ్యులు వెనక్కి మళ్ళారు.

ఈ నెల 9 వతేదీన మావోయిస్టులున్నారనే సమాచారంతో బడేల్ అటవీ ప్రాంతానికి వెళ్ళిన పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారని, లొంగిపొమ్మని హెచ్చరికలు చేసినా వినకుండా పోలీసులపైకి కాల్పులు జరిపారని ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో 6గురు మావోయిస్టులు చనిపోయారని పోలీసుల కథనం.

మరి నిజంగానే మీరు చెప్పినట్టు అది ఎన్ కౌంటర్ అయితే, ఆ ఎన్ కౌంటర్ లోనే మావోయిస్టులు చనిపోయినట్టయితే...నిజ నిర్దారణ బృందాన్ని సంఘటనా స్థలానికి వెళ్ళనిస్తే మీకే మంచిది కదా ! అంటే మీరు చెప్పే కథ మీద మీకే నమ్మకం లేదా? మీరు, మీ ప్రాయోజిత సంఘం నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్నారంటేనే మీరు చెబుతున్న కథ అబద్దమని అర్దమవుతున్నది. దశాబ్దాలుగా మీరు చెప్పేఎన్ కౌంటర్ కథలు ఒట్టి కట్టు కథలని చంటి పిల్లలకు కూడా అర్దమయిపోయింది. ఇప్పటికైనా మీరు చెప్పే కథల్లో కొత్తదనం కోసం ప్రయత్నించండి.

Keywords : police, koraput, sunabeda, maoists, clc
(2019-10-20 16:52:12)



No. of visitors : 384

Suggested Posts


ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌

ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది.బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు

తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప.

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం

తమిళనాడు తత్తుకూడిలో తుత్తుకుడి స్టెరిలైట్ వేదాంత కంపెనీలో 13 మందిని హత్యచేసి నేడు ప్రధాని సరసన చేరి కంపెనీ యజమాని అనిల్ అగర్వాల్ దేశంలోని 5 పబ్లిక్ రంగ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని అందులో ఎన్ఎండిసీ ఉండాలని ప్రధానిని కోరడం అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొంటూ ఎన్ఎండిసీతో సహా ఏ మైనింగ్ కంపెనీని కూడా ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తు

బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌

ఈ సమ్మె సన్నాహక సన్నాహక సమావేశానికి GLBKS నాయకులు ఐ.కృష్ణ అధ్యక్షత వహించగా వీక్షణం సంపాదకులు ఎన్.వేణు గోపాల్, TUF చైర్ పర్సన్ విమలక్క, పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షులు V. రఘునాథ్, TPF రాష్ర్టఅధ్యక్షులు రవిచంద్ర, IFTU జాతీయ నాయకులు T.శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


కోరాపుట్