కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?


కూతురు పెండ్లికి వెళ్ళడం కోసం ఓ తండ్రికి ఇన్ని ఆంక్షలు పెట్టిన వీళ్ళు కమ్యూనిస్టులా ?

కూతురు

అమీ ...ఈ యువతి కేరళలో విద్యార్థి సంఘం నాయకురాలు. ప్రజల వైపు నిలబడ్డ కార్యకర్త. తల్లి షైనా, తండ్రి రూపేష్ లు ఇద్దరూ మావోయిస్టు పార్టీ కార్యకర్తలు. తల్లి, తండ్రులిద్దరినీ సీపీఎం ప్రభుత్వం అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసింది. తల్లి ఈ మధ్యనే బెయిల్ పై బైటికి రాగా తండ్రి ఇంకా జైల్లోనే మగ్గుతున్నాడు.
అమీ తనతోపాటు విద్యార్థి ఉద్యమంలో పని చేస్తున్న తన స్నేహితుడు అర్కాదీప్ ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అందుకోస‍ం ఈ నెల 18 న సహజీవన ప్రకటన‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తన తల్లి తండ్రులు ఉంటే బావుంటుందని ప్రతి ఒక్కరూ అనుకున్నట్టే అమీ కూడా ఆశ‌పడింది. తల్లి సరే ఇంటి దగ్గరే ఉంది మరి తండ్రి జైల్లో ఉన్నాడు. తండ్రికి కూడా తన కూతురు జీవితంలో అతి ముఖ్యమైన ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నాడు. అందుకోసం తాత్కాలిక బెయిల్ కోసం అప్లై చేశారు. కానీ సీపీఎం ప్రభుత్వం తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంది. కూతురు సహజీవన ప్రకటనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తండ్రిని రానివ్వకూడదని సీపీఎం ప్రభుత్వం పట్టుబట్టింది. ఇక తన కూతురు సహజీవన ప్రకట్న కార్యక్రమానికి తనను వెళ్ళనివ్వరనే విషయం అర్దమైన రూపేష్ కూతురు అమీకి ఓ ఉత్తరం రాశాడు. ప్రజల పై ప్రజా కార్యకర్తలపై ఈ పాలకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వివరించాడు. తానూ తన సహచరి ఉద్యమంలో కలిసి పని చేసిన కాలాన్ని ఙాపకం చేసుకున్నాడు. కన్న కూతురు తన ఇష్టపడ్డ వ్యక్తితో కలిసి జీవించడం కోసం నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణాన తనను అక్కడ ఉండకుండా అడ్డుకుంటున్న రాజ్య స్వభావం గురించి తన ఉత్తరంలో అద్భుతంగా రాశాడు రూపేష్.

ఆ ఉత్తరం కేరళలోని అనేక‌ పత్రికల్లో అచ్చయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యింది. మేదవులు, ప్రజాస్వామికవాదులు సీపీఎం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. పార్లమెంటరీ రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేగింది. దాంతో సీపీఎం ప్రభుత్వం షేక్ అయ్యింది. ఇంత చర్చ జరుగుతుందని ఊహించని సీపీఎం ప్రభుత్వ‍ం వెంటనే దిగి వచ్చింది. రూపేష్ కు బెయిల్ మంజూరు అయ్యింది.

బెయిల్ మంజూరు కాగానే కథ సుఖాంతం అయ్యిందనుకోవద్దు. బెయిల్ ఇస్తూ పెట్టిన ష‌రతులు చూస్తే రాజ్యం దుర్మార్గం అర్దమవుతుంది.
బెయిల్ 7 గంటలు మాత్రమే వర్తిస్తుంది

ఆ సహజీవన ప్రకటన కార్యక్రమంలో రక్త సంభందీకులు తప్ప మరెవరూ ఉండకూడదు.
పోలీసుల సమక్షంలోనే కార్యక్రమం జరగాలి
రిజిస్ట్రార్ అక్కడికే రావాలి.
కార్యక్రమం అయిపోయేదాక అక్కడి నుండి ఎవ్వరూ బైటికి వెళ్ళకూడదు.
కార్యక్రమం జరుగుతున్న సమయంలో బైటి నుండి ఎవ్వరూ అక్కడికి రాకూడదు.
తండ్రి (రూపేష్) మీడియాతో మాట్లాడకూడదు.
ఇన్ని ఆంక్షల మధ్య వందలాది మంది సాయుధ‌ పోలీసులు రూపేష్ ను ఇంటికి తీసుక వచ్చారు. అమీ, అర్కా కుటుంభాలకు చెందిన 17 మంది మధ్య రిజిస్ట్రార్ వీళ్ళిద్దరి సాహచర్యాన్ని రిజిస్టర్ చేశాడు.

అయితే ఎవ్వరూ బైటి వారు రావద్దనే ఆంక్షలను ఓ వ్యక్తి ధిక్కరించాడు. నన్ను అరెస్టు చేస్తారా చేసుకోండి అని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి వినయ్ విశ్వం... అమీ , ఆర్క ల సహజీవన కార్యక్రమానికి వచ్చాడు.

కామ్రేడ్ కుప్పు స్వామి, అజిత, జలీల్ లాంటి ఎంతో మంది అద్భుత ప్రజా కార్యకర్తలను, నాయకులను పట్టుకొని కాల్చి చంపిన కేరళ సీపీఎం ప్రభుత్వం , అనేక మంది ప్రజా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి జైళ్ళకు పంపిన సీపీఎం ప్రభుత్వం. అమీ పట్ల, ఆమె తండ్రి పట్ల ఇంతకన్నా మంచిగా వ్యవహరిస్తుందని ఏలా అనుకోగలం.

Keywords : kerala, maoists, ami, shaina, cpm, cpi
(2019-06-17 00:07:04)



No. of visitors : 839

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Maoist supporters call martyr meet in Wayanad; Kerala government yet to give nod

Putting the CPM-led LDF Government, which has been under severe criticism for the encounter killing of two CPI (Maoist) leaders at Nilambur recently, in the dock, the supporters of CPI (Maoist) have openly called a public ʹmartyr meetʹ in Wayanad on December 14 to commemorate the death of three Maoist leaders - Kuppu Devaraj, Ajitha and Latha alias Meera

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
more..


కూతురు