తెలంగాణలో పాలకులను ప్రశ్నించడం నేరమా ? హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం


తెలంగాణలో పాలకులను ప్రశ్నించడం నేరమా ? హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో

ʹʹసమాజంలో ప్రశ్నించే గొంతులు ఉండాలి, సమాజానికి మంచి జరగనప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నించడాన్ని.. ఎల్లవేళలా అప్రమత్తం చేసే చైతన్యవంతమైన సాధనంగానే భావించాలి తప్ప.. దానిని తప్పుగా భావించనవసరం లేదుʹʹ ఈ మాటలన్నది తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.

ఆయన ఈ మాటలు మాట్లాడిన‌ రోజే ఆయన మంత్రిగా ఉన్న టీఆరెస్ ప్రభుత్వం ప్రశ్నించిన పాపానికి ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీలు గుర్తు చేసినందుకు ఆ ప్రభుత్వానికి కోపం వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని నేరం మోపింది.

నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లతీఫ్ ఖాన్ టీచర్ గా విద్యార్థులపట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాక ఓ పౌరుడిగా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని భావిస్తాడు. అందుకే ఆయన ʹసివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీʹ అనే సంస్థను ఏర్పాటు చేసి పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాడు. రాష్ట్రంలో పౌరహక్కుల ఉల్లంఘన జరిగినప్పుడల్లా లతీఫ్ ఖాన్ ముందుండి పోరాడతాడు. పౌర హక్కుల ఉద్యమకారుడిగా అందరికీ పరిచయమైన లతీఫ్ ఖాన్ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచాడు. ప్రశ్నలకు ఒణికి పోయే ప్రభుత్వం వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు గర్వపడ్డ కేసీఆర్... సమైక్యాంధ్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు సభలు పెడితే వెళ్ళి అప్పటి ప్రభుత్వాలపై దండయాత్ర చేసిన కేసీఆర్...పౌరహక్కుల సంఘానికి తానే అధ్యక్షుడనై ప్రభుత్వం పోరాడతానని చెప్పిన కేసీఆర్ ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం సహించలేకపోవడం దేనికి నిదర్శనం.

ʹప్రశ్నించడాన్ని ఎల్లవేళలా అప్రమత్తం చేసే చైతన్యవంతమైన సాధనంగానే భావించాలి తప్ప.. దానిని తప్పుగా భావించనవసరం లేదుʹ అని ఉపన్యాసం ఇచ్చిన కేసీఆర్ మంత్రి వర్గ సహచరుడు ఈ విశయంలో కేసీఆర్ ను ప్రశ్నిస్తాడని మనం ఆశి‍ంచవచ్చా ?

Keywords : కేసీఆర్, వైఫల్యం, హామీలు, ప్రశ్నించుట, లతీఫ్ ఖాన్, ప్రధాన ఉపాధ్యాయుడు, నాంపల్లి, సస్పెండ్, KCR, Lateef Khan, Suspend, Nampally School, Head Master
(2019-09-22 00:43:31)No. of visitors : 986

Suggested Posts


0 results

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


తెలంగాణలో