ʹకార్డిసెప్స్ʹ అనే ప్రమాదకర ఫంగస్ కన్నా మనిషి మెదడులోకి ఎక్కుతున్న మరో ప్రమాదకర ఫంగస్


ʹకార్డిసెప్స్ʹ అనే ప్రమాదకర ఫంగస్ కన్నా మనిషి మెదడులోకి ఎక్కుతున్న మరో ప్రమాదకర ఫంగస్

ʹకార్డిసెప్స్ʹ

"కార్డిసెప్స్" అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా?. నిజంగా వినలేదా..!?

అయితే ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పుడైనా దాని గురించి తెలుసుకోండి..!

బహుశా మీరు దాన్ని గురించి తెలుసుకుంటే మీ జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారో, అది ఎటువైపు పయనిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ...!

"కార్డిసెప్స్" అనేది ఒక భయంకరమైన ఫంగస్.
చీమలు ఇతర క్రిమికీటకాదుల శరీరాల్లో ఉండే ఒక పరాన్న జీవి అది. "కార్డిసెప్స్"ఒకవేళ చీమకు సోకితే చీమ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది.ఆ ఫంగస్ చీమల కేంద్ర నాడీ వ్యవస్థలో మొదట స్థావరం ఏర్పటుచేసుకొని అక్కడ్నుంచి తన పని మొదలు పెడుతుంది.

చీమ చేసే పనుల్నీ, అది తీసుకునే నిర్ణయాల్నీ ఈ ఫంగసే నిర్ణయిస్తుంది. ఈ విషయాలేమి తెలియని చీమ ఎప్పటిలాగే తన పని తాను చేస్తుకుంటున్నాననే భ్రమలో ఉంటుంది. కానీ ఈ ఫంగస్ మెల్లి మెల్లిగా తను పెరగడానికి అనుకూలంగా ఉండే ప్రదేశానికి ఆ చీమను దారి మళ్లిస్తుంది. అలా చేరగానే చీమ తానంతట తాను ఒక కొమ్మను తన కోరలతో గట్టిగా పట్టుకుని ఆగిపోతుంది. అలా జరిగిన మరుక్షణం ఆ ఫంగస్ చీమను చంపేసి ఆ చీమ శరీరాన్ని తన అభివృద్దికి ఉపయోగించుకుంటుంది.

అంత చిన్న చీమ శరీరంలో చేరిన ఈ ఫంగస్, తను స్వచ్చందంగా చేస్తున్నానని చీమని భ్రమింపచేసి మైండ్ కంట్రోల్ చేసిందంటే వినడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉంది కదూ... కానీ అది నిజం..!

అదేమో కానీ లక్షలకొద్ది బ్యాక్టీరియాల‌కు అలవాలమైన మానవ శరీరాన్ని మనకు మనమే నడుస్తున్నామా లేక ఎవరో మన జీవితాన్ని నిర్ణయించేసి తెలివిగా నడిపించేస్తున్నారా? అనేది ఎప్పుడైనా అలోచించారా? వింటుంటే కాస్తా ఆశ్చర్యకరంగా ఉంది కదూ..!

అవునూ, నిజమే.. మనలో చాలా మంది శరీరాల్లోకి కూడా ఒక ఫంగస్ చేరింది. దానిపేరే "మతం".
అది మెల్లిగా మనలోని చాలా మంది శరీరాల్లోకి చేరిపోయి..వారి ఆలోచలనూ.... అభిప్రాయలనూ... అంతిమంగా జీవితాలనూ కంట్రోల్ చేస్తుంది. బహుశా చాలామందికి ఆ ఫంగస్ తమ శరీరంలోకి చేరిపోయిందని కూడా తెలియకపోవచ్చు.!

ఎవరికి వారే తాము స్వచ్చందంగా దీనివైపు పోతున్నామనుకుంటారు కానీ వాళ్లు ఈ "ఫంగస్" వల్ల ఇలా చేస్తున్నామని గ్రహించలేకపోతున్నారు. చివరకు ఆ ఫంగస్ వీళ్లను కంట్రోల్ చేసి ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటారు.!

వాస్తవానికి "కార్డిసెప్స్" అనే ఫంగస్ కేవలం చీమలు తదితర‌ క్రిమికీటకాలకే చేరుతుంది కానీ ఈ "మతం" అనే ఫంగస్ కి అడ్డూ అదుపు ఉండదూ..దీనికి ప్రాంతాలు అంటూ ఉండవూ..ఎక్కడికైనా య‌దేచ్చగా వెళ్లగలదు...దీని విస్తరణ కూడా చాలా వేగంగా ఉంటుంది. ఒక వేళ ఈ ఫంగస్ ను నాశనం చేస్తున్నారని దానికి తెలిసిపోయిందనుకో అది వెంటనే అలర్ట్ అయి తను అప్పటికే సోకిన శరీరాలను మెల్కొల్పి వారిని రెచ్చగొట్టి గొడవలను, అల్లర్లను, ఒక్కొసారి మారణహోమాలను కూడా సృస్టిస్తుంది. అంత ప్రమాధకరమైనది అది.

అందుకే ఈ ఫంగస్ మనుషుల నాడీమండలాన్ని సోకక‌ముందే నాశనం చేయాలి. లేదంటే అది మొత్తం శరీరం అంతా ఆవరించి మనిషినే నాశనం చేస్తుంది. ఇప్పటికే లక్షలాది మందిని అది తన అదుపులోకి తీసుకొని వాళ్లను కంట్రోల్ చేస్తోంది. చాలా వరకు కొన్ని దేశాలను సహితం ఈ ఫంగసే నడిపిస్తోంది...!

ఇప్పటికే ఆలస్యం అయిపోయింది...వెంటనే ఈ "ఫంగస్" ని నాశనం చేయకపొతే మొత్తం మానవ జాతే దాని కంట్రోల్లోకి వెళ్లే ప్రమాధం ఉంది...
సో...బీ అలర్ట్........

- ఎస్,ఏ డేవిడ్
రీసర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ

Keywords : religion, ant, fungus,
(2019-09-22 03:16:27)No. of visitors : 262

Suggested Posts


0 results

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


ʹకార్డిసెప్స్ʹ