శ్రీకాకుళ పోరాటానికి 50 ఏళ్ళు...విప్లవాన్నినినదించిన బొడ్డపాడు


శ్రీకాకుళ పోరాటానికి 50 ఏళ్ళు...విప్లవాన్నినినదించిన బొడ్డపాడు

శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి 50 వసంతాలు నిండిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక మందిరం వద్ద సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. ఉత్తేజపూరితంగా సాగిన ఈ సభకు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. సభకు ముందు బొడ్డపాడులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండా రెపరెపలతో... అమరులకు జోహార్లర్పిస్తూ.. ర్యాలీ విప్లవాన్ని నినదించింది

ర్యాలీ అనంతరం అమరుల‌ స్మారక మందిరం ఆవరణలో అరుణ పతాకాన్నిసీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటి సభ్యులు రామకృష్ణ‌ భార్య శిరీష ఆవిష్కరించారు.ఆ తర్వాత అమరుల బంధు మిత్రుల కమిటీ నాయకుడు దాసరి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విప్లవ రచయితల సంఘం నాయకుడు కళ్యాణ్ రావు, ప్రొఫెసర్ సుబ్బారావు, సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్రనాయ కులు జోగి కోదండరావు, పౌరహక్కుల సంఘం నాయ కులు పత్తిరి దానేసు,అమరుల బంధు మిత్రుల కమిటీ రాష్ట్రకార్యదర్శి పద్మకుమారి, ఎస్.వీరాస్వామి, పుచ్చ దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళ్యాణ్ రావు మాట్లాడుతూ పేద వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని నాటి నక్సల్బరీ నుంచి నేటి దండకారణ్యం వరకు అనేక పోరాటాలు రుజువు చేస్తున్నాయని కళ్యాణ రావు అన్నారు. నక్సల్బరీ సాయుధ పోరు శ్రీకాకుళం నుంచి జగిత్యాల, దండకారణ్యం, నల్లమల అడవుల నుంచి నేడు దేశ మంతా పాకిందన్నారు. విప్లవ కవి సుబ్బారావు రాసిన ʹఎందాక నేస్తం అంద రం కలిశాక ముందుకే పోతాంʹ పాట దేశం లోని అన్ని భాషల్లోకి అనువాదం అయిందంటే పార్టీ దేశమంతా ఉన్నట్టే కదా అన్నారు. ప్రభుత్వ మార్పిడి రాజకీయాలు వేరు, ప్రజా రాజకీయాలు వేరన్నారు. ప్రభుత్వాలను పెట్టబడిదారులు తమ స్వార్థం కోసం మార్చుతుం టారని విమర్శించారు. ప్రజా రాజకీయాలు అంటే పోరాట రాజకీయాలని అవి దోపిడీ పీడనలు ఉన్నంత వరకు ఉంటాయని చెప్పారు. జనమే సమాధానం చెబుతారు.. నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న విప్లవ పోరాటాలను అణచివేయడానికి బీజేపీ ప్రభుత్వం ʹసమాధాన్ʹ అనే ఆపరేషన్ ను 2017లో ప్రారంభించారని 2022 నాటికి మొత్తం విప్లవోద్యమాన్ని తుడిచిపెట్టాలన్నది దాని ఉద్దేశమన్నారు. చరిత్రలో విప్లవోద్యమాలను నిర్మూ లించడం ఎవరి తరం కాలేదని చెప్పారు. దోపిడీ చేసే హక్కు నరేంద్ర మోదీకి ఉంటే దోపిడీ వ్యవస్థను కూల్చే హక్కు మావోయిస్టులకు ఉందన్నారు. నీ ʹసమా ధాన్ʹకు ప్రజలే సమాధానం చెబుతారని అమరుల త్యాగం వృధాగా పోదన్నారు. ఎన్నికల ద్వారా రాజ్యాధికారం పొందలేరని సీపీఐ, సీపీఎంలు ఇప్పటికైనా ఈ విష యాన్ని గుర్తించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఒక్కసీటు కూడా దక్కకపోవడం చెంపదెబ్బ వంటిదని అన్నారు.

ప్రొఫసర్ సుబ్బారావు మాట్లాడుతూ నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధపోరాట గత స్మృతులను నెమరు వేసుకు న్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్య దర్శి పద్మకుమారి మాట్లాడుతూ శ్రీకాకుళ ఉద్యమం లో పంచాది నిర్మల వంటి ఎంతో మంది మహిళలు పాల్గొని నేటి మహిళాలోకానికి ఆదర్శమయ్యారని, ఇప్పుడు కూడా మావోయిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర ఎక్కువగానే ఉందన్నారు. అమరుల బంధు మిత్రుల కమిటీ రాష్ట్ర నాయకులు జోగి కోదండరావు మాట్లాడుతూ సరిగ్గా ఇదే రోజున 1969 మే 27న నిరాయుధులైన పంచాది కృష్ణమూర్తి, తామాడ చిన బాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాలరావు, రామ చంద్ర ప్రదానో, నిరంజన్, శృంగవరపు నరి సింహులును పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరించారన్నారు. ఇదే జిల్లాలో మొట్టమొదటి ఎన్కౌంటర్ అని చెప్పారు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు విప్లవకారుల పై బూటకపు ఎన్కౌంటర్ల పరం పర కొనసాగుతూనే ఉందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సాయుధరైతాంగ పోరాటంలో అమరు లైన వీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్ర మంలో పి.డి.ఎం నాయకులు ఎస్.వీరాస్వామి, పుచ్చ దుర్యోధన, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, నీలం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ప్రజాకళామండలి కళాకారులు ఆట పాట, విప్లవ పాటలు సభికులను ఉత్తేజ పరిచాయి

Keywords : srikakulam, revolution, kalyan rao,
(2019-09-21 22:10:01)No. of visitors : 374

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


శ్రీకాకుళ