డాక్టర్ పాయల్ ఆత్మహత్యకు కులోన్మాద హింసే కారణం - నిర్ధారించిన‌ కాలేజీ యాజమాన్యం


డాక్టర్ పాయల్ ఆత్మహత్యకు కులోన్మాద హింసే కారణం - నిర్ధారించిన‌ కాలేజీ యాజమాన్యం

డాక్టర్

కులోన్మాదం హింసలకు బలైన ముంబయ్ కి చెందిన డా.పాయల్‌ తాడ్వీ సీనియర్ల వేధింపులను తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని కాలేజీ యాజమాన్యం నిర్ధారించింది. పాయల్‌ కుటుంబం, సహ విద్యార్థులు, సిబ్బంది సహా 30 మందికి పైగా వ్యక్తులను విచారించిన అనంతరం కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ విషయాన్ని తేల్చింది.

సంవత్సరం పాటు ఆమె కులాన్ని హేళన చేస్తూ ముగ్గురు సీనియర్లు అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే పాల్పడిన వేదింపులతో ఆమె డిప్రెషన్ కు గురయ్యారు.... ముఖ్యంగా ఈ వేధింపులపై తొమ్మిది రోజుల క్రితం కాలేజీ యాజమాన్యానికి పాయల్‌ భర్త, మరో ఆసుపత్రిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నసల్మాన్‌ మెడికల్‌ కాలేజీలోని గైనకాలజీ విభాగం అధిపతికి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి మరింత కక్షగట్టిన ఆ ముగ్గురు అగ్రకులోన్మాదులు తమ వేధింపుల స్వరాన్ని మరింత పెంచారు. దీంతో సీనియర్ల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంచనా వేశారు.

మే13న ఫిర్యాదు చేసిన తర్వాత మూడు రోజులు పాయల్‌తో నిందితులు మాట్లాడలేదు. తరువాత ఫైళ్లను మొహంపై విసిరి కొట్టి అవమానించారు. అక్కడితో వారికి ప్రకోపం చల్లారలేదు. పనిచేయడం రాదంటూ అందరిముందూ దూషించారు. అంతేకాదు ఎట్టిపరిస్థితుల్లోనూ మూడవ సంవత్సరం కోర్సు పూర్తి కానివ్వమని బెదిరించారు. ముఖ్యంగా ఆమె హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని చనిపోయిన రోజు కూడా ఆసుపత్రి థియేటర్‌ వద్ద తీవ్రమైన వేధింపులకు పాల్పడ్డారని తేలింది. ఇతర సిబ్బంది, రోగుల ముందే ఆమెను దూషించారు. దీంతో పాయల్‌ ఏడ్చుకుంటూ వెళ్లిపోవడం తాము చూశామని కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే.. వారి కెరియర్‌ పాడవుతుందని భావించిన పాయల్‌కు..అసలు జీవితమే లేకుండా చేశారని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష, వేధింపులతో ఆమెకు ఏడ్వని రోజు లేదని సల్మాన్‌ వాపోయారు. గైనకాలజీ హెడ్‌ నిందితులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

కాగా కులం పేరుతో దూషించడంతో బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న డా. పాయల్‌ తాడ్వి (26) ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు మహిళా డాక్టర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. స్థానిక తాడ్వీ సీనియర్లయిన ముగ్గురు మహిళా డాక్టర్లు కులం పేరుతో వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్‌ నిరోధ​క చట్టం, ఐటీ యాక్ట్‌, సెక్షన్‌ 360 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద నిందితులు అంకితా ఖండేల్వాల్, హేమ అహుజా, భక్తి మహెరే అనే ముగ్గురు మహిళా డాక్టర్లు అరెస్ట్‌ చేసి, మే 31వరకు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు పాయల్‌ ఆత్మహత్యపై ఉద్యమం రగులుకుంది.. మెడికోలే కాక దోషులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేసవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

Keywords : mumbai, medico, suicide, cast, upper cast, adivasi
(2019-06-16 20:44:45)



No. of visitors : 266

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
more..


డాక్టర్