మామిడి పండు కోసుకోవడమే నేరమయ్యింది...దళితుణ్ణి కొట్టి చంపిన అగ్రకులోన్మాదులు


మామిడి పండు కోసుకోవడమే నేరమయ్యింది...దళితుణ్ణి కొట్టి చంపిన అగ్రకులోన్మాదులు

చెట్టు నుంచి రాలిపడిన ఓ మామిడి పండు తీసుకున్నందుకు ఓ దళితుడి ప్రాణాలు తీసింది. అతనిపై దొంగతనం నేరం మోపి అగ్రకుల ఉన్మాదులు కొట్టి చంపి ఉరి వేశారు.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో బిక్కి శ్రీనివాస్ అనే దళితుడు అగ్రకులాలకు చెందిన ఓ మామిడి తోటలో నేలపై రాలిన మామిడి పండు తిన్నందుకు అతన్ని పట్టుకొని కర్రంలతో కొట్టి చంపేసి పంచాయితీ ఆఫీస్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే శ్రీనివాస్ భౌతికకాయాన్ని పరిశీలించినవారు చెబుతున్న దాని ప్రకారం అతని ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతింది. మొహమంతా రక్తసిక్తమయ్యింది.ప్రవేత్ పార్ట్స్ పై కూడా గాయాలున్నాయి. భౌతికకాయాన్ని చూస్తే కొట్టి చంపారన్నది ఎవ్వరికైనా తెలుస్తుందని కుటుంభ సబ్యులు చెబుతున్నారు.

శ్రీనివాస్ పంచాయితీ ఆఫీస్ లో ఉరి వేసుకొని చనిపోయాడని అగ్రకుల ఉన్మాదులు ప్రచారం చేశారు. విషయం తెలిసిన శ్రీనివాస్ కుటుంభసబ్యులు పరిగెత్తుకొని వచ్చారు. శ్రీనివాస్ భౌతికకాయా
మామిడి పండు తిన్నందుకు దళితుడి హత్య...మాట్లాడుతున్న కుటుంభ సబ్యులు న్ని కిందికి దింపి చూస్తే ఒళ్ళంతా గాయాలున్నాయి. ఆ వార్త తెలిసి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు వేయిమందికి పైగా దళితులు సింగంపల్లికి చేరుకున్నారు. శ్రీనివాస్ ది హత్యే అని అతన్ని చంపిన వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయితీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు.

ఈ దేశంలో దళితుల హత్యలు... అణిచివేతలు... దళితులపై అగ్రకులాల దుర్మార్గాలు శ్రీనివాస్ హత్య తొ మొదలు కాలేదు...వేల ఏళ్ళుగా సాగుతున్న ఈ అగ్రకుల దుర్మార్గాలను ఏ చట్టాలు కూడా ఆపలేకపోతున్నాయి. ఒకవైపు అబ్యుదయ ముసుగేసుకున్న అగ్రకుల మనుషులు ఇంకా కులమెక్కడుందని ధీర్ఘాలు తీస్తుంటారు. మరో వైపు దళితులైనందుకు దేశంలో ఏదో మూల ప్రతి రోజు దళితులపై దాడులు..హత్యలు సాగుతూనే ఉంటాయి. దళితులను తన్నడం...కొట్టడం...తిట్టడం..చివరకు హత్యలు చేయడం అగ్రకులోన్మాదులు తమ హక్కుగా భావిస్తూంటే..చట్టాలు అగ్రకులోన్మాదులను ఏమీ చేయలేవనే నమ్మకాన్ని పాలకులు కల్పిస్తున్నారు. ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చదల్చుకున్న వాళ్ళు ఈ దేశాన్ని దళితుల పట్ల మరింత ప్రమాదకరంగా మార్చేయదల్చుకున్నారు.

ఒక్క దళితులపట్లనే కాదు..బహుజనులు, మైనార్టీలు, స్త్రీలు, ఆదివాసులు, దళితులు ఈ అగ్రకులాలకు భానిసలుగా పడిఉండాలనే కోరిక వారి దాడుల్లో, అణిచివేతల్లో కనిపిస్తోంది. మధ్య యుగాల అనాగరిక హింసాయుత కాలంనాటికి ఈ దేశం మళ్ళకుండా ఉండాలంటే అణిచివేయబడుతున్న , హింసకు గురవుతున్న, వివక్షకు గురవుతున్న అన్ని కులాలు, మతాలు, వర్గాలు ఏకమయ్యి మత, కుల ఉన్మాదాన్ని ధ్వంసం చేయడం ఒక్కటే మార్గం. లేదంటే బిక్కి శ్రీనివాస్ లాంటివాళ్ళను ఎంతమందిని ఈ దేశం కోల్పోవాల్సి వస్తుందో ?

Keywords : dalit, east godavari, mango, murder
(2019-10-23 09:57:20)No. of visitors : 378

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


మామిడి