పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?


పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

పదహారంటె

వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన తెలంగాణ సంపాదకీయ వ్యాఖ్య... వీక్షణం జూన్ 2019 సంచికలో ప్రచురించబడినది

తాడిని దన్నెటోడుంటె వాని తలను దన్నెటోడుంటడు, ఢిల్లికి రాజయిన తల్లికి కొడుకె, కూట్లె రాయి దీయలేనోడు ఏట్లె రాయి దీస్తడట, మంచోడు మంచోడంటె మంచం ఇరగ్గొట్టిండట, తొండి మొండి దేవుడు జూస్తడు...ఇట్ల జెప్పుకుంట బోతె శాన శాత్రాలున్నయి. ఎంతటోడైన ఎప్పుడో ఒగప్పుడు బొక్క బోర్ల పడ్తడు అని జెప్పెటియి. ఎవ్వడైన ఎగిరెగిరి పడొద్దు అని జెప్పెటియి.

ఇగ మన తెలంగాణల్నయితె తుపాకి ఎంకట్రాముడి ముచ్చట్లె ఉండె. చెరువుల వడ్లు బోసి తూముల మంట బెట్టిన కథలు. ఇప్పుడు తెలంగాణ మారాజుల కత గంతె ఆయెనా. నా అంత మొనగాడు లేడు, నాదే రాజ్జెం అని మస్తు సీట్లు దెచ్చుకున్నాక గుడ ఆడోణ్ని ఈడోణ్ని గొని దొడ్లె గట్టేసుకునె. పత్రికలన్నిటి నోరు మూసె. ఇగ మాట్లాడెటోడు లేడు, ఇగ ఎదురు లేదు అని పెగ్గెలు గొట్టె.

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె.

సారు కారు సర్కారు పదహారు అని కూత బడితె, పదహారుల సగం తెగ్గొట్టి చేతుల బెట్టిరి. అదే మరి ఢిల్లికి రాజయిన తల్లికి కొడుకె, పల్లెకు కొడుకె. కాళోజి తాత జెప్పినట్టు ఎమ్మెల్లెవంటె, ఎంపివంటె, మంత్రివంటె వోటుకు పుట్టినవు బిడ్డా. ఢిల్లికి రాజువయిన వోటు దెబ్బకు పడిపోక తప్పది.

ఇంతకు ఇంత గాచారమెట్లొచ్చెనో జియ్యర్ స్వామి ఏమన్న జెప్పెనా? మల్లొక్క యాగం జేస్తె తెలుస్తదా? మారె, జియ్యర్ స్వాములు బొయ్యర్ స్వాములు జెప్పేది గాదిది, యాగాలు జేసి నెయ్యి పాలు పారబోస్తే తెలిసేది గాదిది. గిది జనం దెబ్బ. జనానికి కోపమొస్తె పెద్దపెద్దోళ్లె, వాండ్లను పుట్టిచ్చినోళ్లె మంట్లె గలిసిపోయిండ్రు. ఇంక ఇది మొత్తం దెబ్బ గుడ గాదు, ఇది బయాన. గంతె. మొత్తం లెక్కలు తర్వాత జూస్కుందాం.

ఈ దెబ్బ ఎందుకో ఎరికెనా? పుట్టిన తెలంగాణ గడ్డను మరిచినందుకు, తెలంగాణ జనాల కొట్లాటను మరిచినందుకు, జనాలు ఎందుకు కొట్లాడిండ్రో మర్చినందుకు, తెలంగాణ అర్గీజ్ ఒద్దన్నోల్లను దగ్గరికి పిల్చి, తొడమీద కూకోబెట్టుకున్నందుకు, కొలువుల కోసమే తెలంగాణ అని కొట్లాటల దిగిన పడుసు పోరలకు కొలువులు ఇయ్యకుండ ఉసురు పోసుకుంటున్నందుకు, ఎన్నడు లేనిది తెలంగాణల కులాల చిచ్చు బెడుతున్నందుకు, వీపు మీద గొట్టినా మానె కడుపు మీద కొట్టకయ్యా అని పాతరోజుల్ల అంటుంటిమి, ఇప్పుడు వీపు మీద కొట్టుడే గాదు, కడుపుల తన్నుడే గాదు, నోరు గుడ తెరవొద్దు, అయ్యో అని ఏడ్వద్దు అని మూతి మీద గూడ గుద్దుడు మొదలైంది గద.

గందుకు జనానికి కోపమొచ్చింది. ఒక్క పీకుడు పీకిండ్రు. అరె నాలుగు నెల్ల కింద కొట్టలేదు గాని ఇప్పుడు గొడ్తరా అంటరు గావచ్చు. అరె దేనికైనా కాలం రావాలె. కాలంబు రాగానె కాటేసి తీరాలె అని కాళోజీ అన్లేదా? శిశుపాలుని కత ఎరికె గద. తొంబై తొమ్మిది తప్పులైనంక పాపం బండింది.

నీల్లు పొయి మీద బెట్టంగనె మస్లుతయా? లోపల్లోపల మసిలి మసిలి జెప్పున ఆవిరి గొడ్తది గద. గట్లనె, అదును కోసం ఎదురుజూస్తాండ్రు జనం. ఇత్తనాలు జల్లుటానికి రోయిణి ఎప్పుడు బోతదా, మొగులు ఎప్పుడు బడ్తదా, చినుకు ఎప్పుడు గొడ్తదా అని ఎదురు చూసినట్టు ఎప్పటెప్పటి కోపమో ఇప్పుడు తీర్చుకున్నరు. మారె, పెనం మీది నుంచి పొయిల బడ్డట్టు ఢిల్లి బుడ్డర్ ఖాన్ లకు గుద్దింది గుడ బాగలేదనుకో, కని ఏం జేస్తం. దొరవారి మీద కోపంల బందిపోటు దొంగ మంచోడనిపిచ్చె. దిక్కు లేకపాయె.

- ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, kcr, ktr, n.venugopal
(2021-12-03 23:06:23)No. of visitors : 1322

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు

అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


పదహారంటె