తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం


తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం

తెలంగాణ

నీళ్లు- నిధులు - నియామకాలు... మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఇదే ప్రధాన డిమాండ్. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుల్లో ఒకడైన కేసీఆర్ ఇదే నినాదాన్ని యువతకు పదే పదే చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ నినాదాన్ని తమ భుజంపై వేసుకొని తెలంగాణ ఊరూరా తిరిగారు. ఉద్యమాల్లో పాల్గొన్నారు.

ఇక తెలంగాణ సాకారమై మొన్నటికి ఐదేండ్లు. నీళ్లు - నిధులు - నియామకాలు ప్లకార్డులపై నినాదాలుగానే మిగిలినయ్ కాని సాకారం కాలేదు. ఆనాడు ఉద్యమాల్లో పాల్గొన్న నిరుద్యోగులు ఈనాటికీ ఉద్యోగాల కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగులు ఎంతగా పెరిగారంటే.. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ళ గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుగ్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ తో ముగిసిన త్రైమాసిక గణాంకాల ప్రకారం 22 రాష్ట్రాలలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచిందని జాతీయ గణాంక కార్యాలయానికి చెందిన సర్వే పేర్కొంది.ఏడు ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 22 రాష్ట్రాలలో 12.4 శాతంతో పట్టణ తెలంగాణ ప్రాంతం ఆరో స్థానంలో నిలిచింది.

ఉత్తర ప్రదేశ్ 15.8, ఒడిషా14.2 ఉత్తరాఖండ్ 13.6, జమ్ముకశ్మీర్ 13.5, బీహార్ 13.4 శాతంతో తెలంగాణ కంటే నిరు ద్యోగంలో ముందున్నాయి. ఈ గణాంకాలు తెలంగాణలో కేవలం 15- 29 ఏళ్ళ మధ్య ఉన్న యువతకు సంబంధించినవే కావడం మరింత ఆందోళనకరం.

ఈ వయో పరిధిలో ఉన్న నిరుద్యోగ యువతను లెక్కిస్తే 22 రాష్ట్రాలలో తెలంగాణ 32.5 శాతంతో దేశం మొత్తం మీద ఐదో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశమే. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య 23.7 శాతంగా ఉంది. బీహార్, జమ్ముకశ్మీర్, కేరళ, ఒడిషాల తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది.

కాగా, 2017-18 లో తెలంగాణ వ్యాప్తంగా 7.6 శాతం నిరుద్యోగం ఉందని నివేదిక పేర్కొంది. 22 రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ సంఖ్య 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 14 వ స్థానంలో ఉంది. గత కొన్నాళ్లుగా తెలంగాణలో కొత్తగా ప్రభుత్వ నోటిఫికేషన్లు కానీ.. ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన కానీ జరుగలేదు.

గత ఐదేండ్లుగా నియామకాల కోసం నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ఎన్ని పోరాటాలు చేసినా తెలంగాణ ప్రభుత్వం అణచివేత ధోరణికే మొగ్గు చూపింది కాని ఏనాడూ ఉద్యోగ కల్పనపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం రంగంలో కాకపోయినా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వస్తాయనుకుంటే.. కేవలం సాఫ్ట్‌వేర్ రంగంలో తప్ప ఇతర కీలక రంగాల్లో ఉద్యోగ కల్పన జరగలేదు. దీంతో తెలంగాణలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది. ఇది భవిష్యత్‌లో మరింత ఆందోళనకరంగా మారబోతోందని నివేదికలు చెప్పడం ఒక ప్రమాద ఘంటికను మోగించడమే.

Keywords : తెలంగాణ, నిరుద్యోగం, గరిష్టం, నీళ్లు, నిధులు, నియామకాలు, Telangana, Unemployement Rate, KCR
(2019-10-15 04:17:46)No. of visitors : 1682

Suggested Posts


0 results

Search Engine

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
more..


తెలంగాణ