పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం


పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం

పుణె

వరవరరావు తదితరులపై పూణే కోర్టు లో సాగుతున్న కేసు...బెయిల్ విచారణ పై సీనియర్ జర్నలిస్టు, వీక్షణం మాస పత్రిక సంపాదకులు ఎన్. వేణు గోపాల్ రాసిన ఆర్టికల్

మిత్రులారా, ఇవాళ పుణె కోర్టు వాయిదాకు నేను వెళ్లలేకపోయాను గాని భీమా కోరేగామ్ హింసాకాండ – ఎల్గార్ పరిషద్ కేసు గురించి తీవ్రమైన కోపంతో, విచారంతో ఈ నివేదిక మీతో పంచుకుంటున్నాను.

ఇవాళ సుధా భరద్వాజ్, షోమా సేన్ లను తప్ప మిగిలిన మిత్రులనెవరినీ కోర్టుకు తీసుకు రాలేదు. గతంలో మే 18న జరిగిన కోర్టు వాయిదాకూ ఇవాళ్టికీ మధ్య విచిత్రమైన పరిణామాలెన్నో జరిగాయి. జూన్ 2018 నుంచి ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ సెషన్స్ జడ్జి కె డి వడనే మే 20 నుంచి జూన్ 2 వరకూ సెలవు మీద వెళ్లారు. అప్పటికే మన మిత్రుల బెయిల్ దరఖాస్తుల మీద మన న్యాయవాదుల వాదనలు, ప్రాసిక్యూషన్ ప్రతివాదనలు అన్నీ ఆయన విని ఉన్నారు. మే చివరి వారంలో బెయిల్ మీద ఆయన తీర్పు చెపుతారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆ సమయంలో ఆయన సెలవు మీద వెళ్లడంతో ఆయన తిరిగి రాగానే తీర్పు చెపుతారని ఆశించారు. కాని ఆయన సెలవు నుంచి తిరిగి రాకముందే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జి ఆర్ ఎం పాండే ఇప్పుడు కొత్త జడ్జిగా విచారణ సాగిస్తున్నారు. అంటే బెయిల్ దరఖాస్తుల మీద విచారణ మళ్ళీ కొత్తగా ఈ జడ్జి ముందు మొత్తం మొదలవుతుందన్నమాట! ఇంతకుముందరి జడ్జి ముందర నాలుగు నెలలపాటు జరిగిన వాదనలన్నీ వదిలేసి, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలన్నమాట!!

ఇంతకు ముందు మన మిత్రులు తమ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాల్లో దొరికాయని చెపుతున్న ఆధారాల ప్రతులను (క్లోన్డ్ కాపీస్ అంటారు) తమకు ఇవ్వాలని కోర్టును అడిగారు. దాని మీద వాద ప్రతివాదాలు సాగాయి. నిజానికి నిందితుల మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ ఆరోపణలకు మూలమైన ఆధారాలేమిటో చూడడం, ఆ ప్రతుల్ని పొందడం నిందితుల హక్కు. కాని ప్రాసిక్యూషన్ మొదట అవి ఇస్తానని, తర్వాత ఇవ్వనని, అవి ఇవ్వడం దేశ భద్రతకూ సమగ్రతకూ భంగకరమని మాట మార్చింది. ఈ వాదనలన్నీ అయ్యాక చివరికి మే 18న తీర్పు ఇస్తూ అప్పటి జడ్జి ఆ ఆధారాలు మన మిత్రులకు ఇవ్వవలసిందే అని తీర్పు చెప్పారు. ఆ ఆధారాలు ఇమ్మని పోలీసు దర్యాప్తు అధికారికి, ఫారెన్సిక్ సైన్సెస్ లాబరేటరీ నిపుణుడి ముందు అవి తీసుకొమ్మని నిందితులకు, నిందితుల న్యాయవాదులకు నోటీసులు ఇమ్మని కోర్టు అసిస్టెంట్ సూపరింటెండెంట్ (నాజర్ అంటారు) ను ఆదేశించారు. ఆ పని మే 27న జరగవలసింది. కాని ఆరోజు ఆ జడ్జి సెలవు మీద ఉండడంతో అది ఇవాళ్టికి, జూన్ 4 కు వాయిదా పడింది. కాని ఇవాళ నాజర్ తనకు మరింత సమయం కావాలని అడిగాడట, జడ్జి వెంటనే మూడు వారాలు సమయం ఇచ్చాడట. అలా మరుసటి వాయిదా జూన్ 27 కు పడింది. అన్నీ సక్రమంగా జరిగితే ఆ రోజు ఆ ఆధారాల కాపీలు ఇస్తే, ఆ తర్వాత బెయిల్ వాదనలు మొదలవుతాయన్న మాట!!!

అప్పటికి సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, షోమా సేన్, మహేష్ రౌత్ జైలులో 12 నెలల 21 రోజులు గడిపి ఉంటారు.

సుధా భరద్వాజ్, వర్ణన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా లు జైలులో 8 నెలల రెండు రోజులు గడిపి ఉంటారు.

వరవర రావు జైలులో 7 నెలల పది రోజులు గడిపి ఉంటారు.

ఎటువంటి విచారణ లేకుండా

బెయిల్ రాకుండా

అబద్ధపు ఆరోపణలతో

కేవలం చట్టవ్యతిరేకమైన, క్రూరమైన, అమానుషమైన తాత్సారం వల్ల...

చట్టబద్ధ పాలనా, నువ్వెక్కడ?

ʹబెయిలే నియమం, జైలు మినహాయింపుʹ అనే సుప్రసిద్ధ సహజ న్యాయ సూత్రం, భారత న్యాయశాస్త్రపు ప్రాతిపదిక ఎక్కడ?

Keywords : bhimakoregav, elgar parishat, varavararao, pune court, police
(2020-07-01 13:53:15)No. of visitors : 573

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


పుణె