మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!


మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!

మానవత్వం

దళితులు, మైనార్టీలపై ఈ మధ్య దాడులు, హత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలకే దళితులను అగ్రకుల ఉన్మాదులు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఖండించకపోగా.. దళిత కార్డు అడ్డం పెట్టుకొని సానుభూతి పొందుతున్నారని ప్రత్యారోపణలు చేస్తున్నారు. అసలు ఇలాంటి ఘటనలు జరిగినపుడు సామాజిక మాధ్యమాల్లో గాని, మీడియాలో గాని స్పందన ఎలా ఉందో ఇండన్ మార్టిన్ తన ఫేస్ బుక్ వాల్‌పై చర్చించారు. అది యధాతథంగా..
----------------------------------------------------------------------
మీకు అట్టపాడి మధు గుర్తున్నాడా? కేరళ వైనాడ్ ఆదివాసీ. పోయిన ఏడాది ఫిబ్రవరిలో చారెడు బియ్యం దొంగతనం చేశాడని చుట్టుపక్కల ఉన్న సవర్ణ యువకులు అతన్ని కొట్టి చంపారు.

మధు మతిస్థిమితం లేని యువకుడు. వయసు 27 ఏళ్లు. ఎక్కడ వుంటాడో, ఎక్కడ తింటాడో కూడా తెలియని స్థితి అతనిది.

చేతులు కట్టేసి కొట్టి చంపుతుంటే అతని కళ్ళల్లో కనబడిన అమాయకత్వం అప్పుడు ఒక సెన్సేషన్. మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. అట్టపాడి మధు విగ్రహం చెక్కతో, మట్టితో చేసి ప్రదర్శించారు. అది కూడా మూడు రోజుల్లోనే. బహుశా ఒక పది వేల కవితలు రాసి ఉంటారని ఒక మళయాళీ సర్వే చెబుతుంది. జాతీయ మీడియా కూడా దాని గురించి చాలా పెద్ద ఎత్తున స్పంధించింది. ఇండియా టుడే లాంటి మీడియా సంస్థలు దీని మీద కవర్ కథనాలు రాశాయి. కేరళ ముఖ్యమంత్రి స్వయంగా స్పందించాడు. మళయాళీ సూపర్ స్టార్లు, మమ్ముట్టి వంటి హీరోలు మధు తన తమ్ముడనీ, పశువులు తన తమ్ముడ్ని చంపేశాయి అనీ ట్వీట్ చేశారు.

బక్కి శీను ఇంకా మీకు పాత కేసు కాదని నమ్ముతాను. ఇంకా దూర ప్రదేశంలో ఏ భయంకరమైన నేరం, రేపూ, బాంబు దాడుల్లో చిన్నపిల్లల చావులూ జరగలేదు కాబట్టి మనలో ఇంకా చాలా మంది దీని గురించి ఆలోచిస్తూనే వుండి ఉంటారు.

శీను వయసు 30. చిన్నప్పుడే బ్రెయిన్ ఫీవర్ వలన తెలివి పూర్తిగా ఏర్పడలేదు. రోజువారీ కూలీ. భార్యా పిల్లలూ ఉన్నారు. మామిడి పళ్ళు దొంగతనం చేశాడు అనేది అతని మీద అభియోగం. తోటలో పట్టుకుని, కొట్టుకుంటూ గ్రామ పంచాయితీ ఆఫీసుకు తీసుకొచ్చి.. అక్కడ మళ్ళీ అలుపొచ్చే వరకూ కొట్టి.. ఒక చిన్న బ్రేక్ తీసుకుని.. బయటకు వెళ్ళి తాగి వచ్చి మరీ అతన్ని చంపేశారు. ఏదో సాధారణంగా కాదు... వృషణాలు చిధ్రం చేసి.. కనుగుడ్లను పెకలించి.. గుదంలో లాఠీలు దోపీ చంపేశారు.

ఇప్పటి వరకూ చదువుతుంటే మీ మనసు వ్యాకుల పడే వుంటుంది. కానీ అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అవుతోంది. బిక్కి శ్రీను ఒక దళితుడు. అతని హత్యలో ప్రధాన కారణం కులం అని ఎవరైనా అనగానే మీలోని ఆ మానవత్వం ఒక్క సారిగా యూ టర్న్ తీసుకుంటుంది. ఫలితంగా ఈ క్రింది డిబేట్లలో ఏదో ఒకటి చెయ్యడానికి మీరు పూనుకుంటారు:

1. ఏదో ఆవేశంలో చంపేస్తారు కానీ కులం అడిగి మరీ చంపుతారా?

2. నేరస్తుడి మనస్తత్వమే నేరపూరితంగా వుంటుంది. వాడు ఎవరినైనా చంపుతాడు. వాడికి కుల/మత తారతమ్యాలు ఉండవు. వాడొక మానసిక వ్యాధిగ్రస్తుడు. వాడు చేసిన నేరాన్ని కులానికి అంటగట్ట కూడదు.

3. ఒక కమ్మ వ్యక్తో.. రెడ్డి వ్యక్తో హత్యకు గురైతే మీరు ఇలానే అది కుల హత్య అని అంటారా? మరి దళితుడు హత్యకు గురైతే అది కులహత్య అని ఎలా అంటారూ?

4. ఎక్కడైనా నేరం జరగగానే దానికి కులం రంగు పూసి లబ్ధి పొందే ముఠాలు చాలా వున్నాయి. వాళ్ళే ఇలా బక్కి శ్రీను హత్యను కులహత్య అంటారు.

5. అసలు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేవరకైనా ఆగకుండా తొందర పడి అది కులహత్య అని ఎలా నిర్ధారిస్తారూ? ఫేస్బుక్ ఫోరెన్సిక్ నిపుణులా మీరూ? అధికార యంత్రాంగం పని లేక కూర్చోవాలా?

6. ట్వింకిల్‌ని చంపింది ముస్లిం హంతకులు. కాబట్టి దాన్ని మతహత్య అన్నట్టే, శ్రీనును చంపింది బీసీలు కాబట్టి దీన్ని కులహత్య అంటున్నారు. ట్వింకిల్ తల్లిదండ్రులు హంతకులకు పది వేల రూపాయలు బాకీ ఎగ్గొట్టారు. అందుకే వాళ్ళు వీళ్ళ పిల్లను చంపారు. అక్కడ సమస్య ʹబాకీʹ.. అంతేగానీ మతం కాదు. అలాగే బిక్కి శ్రీను మామిడి కాయలు దొంగతనం చేశాడు.ఇక్కడ సమస్య దొంగతనం. దొంగతనం చేసిన వాడిని రైతు ఆవేశంలో కొట్టి చంపాడు. అంతే. ఇందులో కులం లేదు.

పైవన్నీ మచ్చుకు కొన్ని వాదాలు. వీటిల్లో ఏదో ఒక కారణం వల్లనే మీడియా, ఫిల్మ్, అధికారులూ, చాలా మంది పెద్ద కులాల స్నేహితులూ కూడా స్పంధించలేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, నేరంలో పీడితుడు ఎవడైనా ఈ సమాజం ఎగేసుకుని వచ్చి మరీ సానుభూతి చూపిస్తుంది. కానీ పీడితుడు దళితుడు అని తెలియడంతోనే ప్లేట్ ఫిరాయిస్తుంది. దళితుడి వాదనకు ఎలాంటి సానుభూతీ, సమర్ధనా దొరకకుండా చెయ్యడానికి మహా మహా మేధావులే శాయశక్తులా శ్రమిస్తారు. నిన్నా మొన్నటి వరకూ పీడితుల పక్షాన నిలబడతాం అన్న స్నేహితులే పక్కకు వెళ్ళి దళితుల్లో దళారీల వలననే ఇన్నేసి నేరాలు జరుగుతున్నాయి అని కూడా వాదాలు నిర్మించడం కనబడుతుంది. కొండొకచో వాళ్లను ఆక్షేపించినందుకు ʹఇందుకేరా మీ బతుకులు ఇలా తగలడ్డాయి, మీరు మారరు, మేం ఎంత మిమ్మల్ని సంస్కరిద్దాం అన్నా మీరు మారరు, వూరవతలి వెధవల్లారా ʹ అని కూడా తిట్టే సందర్భాలు తారసపడతాయి.

ఇక ఈ సంఘటనపై స్పంధించిన ఏ దళిత యాక్టివిస్టు రిపోర్టునైనా తప్పుపట్టే, అనుమానించే పెద్ద కులాల మిత్రులు.. ఇదే సంఘటనపై సానుభూతితో, నిజాయితీతో స్పందించే రాంబాబు తోటా, అరవింద్ లాంటి మిత్రుల రిపోర్టులను మాత్రం అంగీకరింస్తారు. కొందరు మరీ కరుడు కట్టిన కుల తీవ్రవాదులు వీళ్ళు రాసే అనేక విషయాలను అభిమానిస్తూనే ఇలాంటి దళిత సమర్ధక రాతల్ని చూడగానే వీళ్ళను దళిత తొత్తులు అని కూడా అంటారు. ఏది ఏమైనా దళిత హత్యల గురించి మరొక దళితుడు రాస్తే కూడా సహించలేని వాతావరణం ఉంది.

తామే పాలించాలి, తామే సంస్కరించాలి, తామే వివక్ష చెయ్యాలి, తామే ప్రేమనూ దయనూ చూపించాలి, తామే సిద్దాంతాలను చెయ్యాలి, తామే ఆ సిద్దాంతాలు తప్పు అని నిరూపించాలి. ఇదీ ఇప్పటి పెద్దకులాల మేధావుల మానసిక స్థితి. సమస్య ఏమిటీ? అట్టపాడి మధు హత్య కేసులో కలిసి వచ్చిన సమాజం బక్కి శ్రీను విషయంలో ఎందుకు పది భాగాలై కలహించుకుంటుందీ?

ఇవే సందేహాలు ప్రణయ్ హత్య విషయంలో కూడా వచ్చాయి. నాకు తెలిసి కారణం ఇది:

దళితులు ఇతర పీడిత వర్గాలూ/కులాల కన్నా బలమైన సిద్దాంత చర్చ చేసే స్థితికి వచ్చారు. మిగతా పీడిత సమూహాలకన్నా ఆత్మగౌరవ హక్కును డిమాండ్ చేసే ప్రక్రియలో ముందున్నారు. రచనా వ్యాసాంగాలూ, కళా, రాజకీయం, చదువూ వంటి రంగాల్లో వీరి ఉనికి మిగతా వారికి కంటగింపైంది. నేరం జరిగినప్పుడు, జరగక మునుపు దళితుడి బిహేవియర్ మిగతా పీడితుల లాగా దయనీయంగా ఉండటం లేదు. ఈ పీడించే కుల మృగాల అహాన్ని గాయపరిచేదిగా వుంటుంది. కేవలం సానుభూతీ, సహాయం కోరుకోకుండా ఎదురు దాడి వాదనలు చేసే విధంగా ఉంది వీళ్ల ప్రవర్తన. అందుకే వీరి మీద నేరాలు చెయ్యాలనే కసి పెరుగుతుంది. నేరం జరిగాక కూడా జరిగే చర్చల్లో మరింత కసి పెంచుకుంటున్నారు. చంపబడ్డ వ్యక్తిని ఉద్దేశించి కూడా కథలూ, నిందలూ ప్రచారం చెయ్యడానికి పూనుకుంటున్నారు. నేనేగనక అయితే ఇంకా నాలుగు ముక్కలు ఎక్కువే నరికే వాడిని లం** అని బూతులు తిడుతూ ఇంకా ఆరని తమ క్రౌర్యాన్ని ప్రదర్శించుకుంటున్నారు.

ఇంకా హాస్యాస్పదం ఏమంటే.... ఫేస్‌బుక్కులో స్నేహితులుగా పరిచయమైన పై కులాల మనుషులు, ఫేస్‌బుక్ చర్చల్లోనే ʹఒట్టి ఫేస్బుక్కు చర్చలు చేసే వెధవల్లారాʹ అని దళిత ఫేస్బుక్ మిత్రులను దూషించడం. అసలు పరిచయమే ఇక్కడ అయినప్పుడు సదరు పరిచయ వేదికనే తిరస్కరించడం నిజంగా వీళ్ళ కార్యాచరణా ప్రణాళికా ప్రేమకు నిదర్శనమా లేక ఇక్కడ దళితుల గొంతులు వినలేని కంపరమా?

ఏమో.... ఎక్కడ సమాజ పురోగతి సిద్దాంతం కూడా పీడించే వాడి చేతిలోని వాకింగ్ స్టిక్ అవుతుందో అక్కడ ఉద్యమం, వాయిస్ రెండూ చక్కగా కత్తిరించిన క్రోటన్ మొక్కలు అవుతాయి.
- ఇండస్ మార్టిన్

Keywords : Bikki Srinu, Dalit, Mangoes, Murdered, Andhrapradesh, బిక్కి శ్రీను, హత్య, మామిడికాయలు
(2019-06-17 14:58:33)No. of visitors : 284

Suggested Posts


0 results

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న చిన్నారి.. రీవెరిఫికేషన్ లో పాసయ్యింది !
more..


మానవత్వం