భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు


భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు

భావ

యోగి ఆదిత్యనాథ్‌ గత ఏడాది కాలంగా తనతో వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుతున్నారని, రాజకీయ నేతగా మారిన సన్యాసి తన జీవితాంతం తనతో ఉండేందుకు సిద్ధ పడతారా ? అంటూ ఓ మహిళ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారన్న అభియోగంతో జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ కనోజియాను ఢిల్లీలో శనివారం నాడు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మహిళ వీడియోను ప్రసారం చేసినందుకు ʹనేషనల్‌ లైవ్‌ʹ అనే టీవీ ఛానల్‌ ఎడిటర్‌ను కూడా కొన్ని గంటల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కనోజియాపై భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్, సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఐపీఎస్‌ 500 సెక్షన్‌ ప్రకారం అది ʹనాన్‌కాగ్నిజబుల్‌ʹ నేరం. అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థం. ఈ సెక్షన్‌ కింద పోలీసులు ఎవరిని నేరుగా అరెస్ట్‌ చేయడానికి వీల్లేదు. ఎవరైనా కచ్చితమైన ఫిర్యాదు ఇచ్చిన పక్షంలోనే స్పందించాలి. ఈ కేసులో పరువు పోయే అవకాశం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కనుక, ఆయన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేసినప్పుడు మాత్రమే చట్ట నిబంధన ప్రకారం పోలీసులు స్పందించాలి.
కానీ ఆదిత్యానాథ్ ఫిర్యాదు లేకుండానే పోలీసులు కేసు నమోదు చేసి జర్నలిస్టును అరెస్టు చేశారు. అంటే పోలీసులు స్పష్టంగా చట్టాన్ని ఉల్లంఘించారు. ఇక సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్‌ ఎవరి మీద దాఖలు చేయాలంటే మొత్తం ʹకంప్యూటర్‌ వ్యవస్థ స్తంభించడంʹకు కారకుడైన వారిపైన. ఇక్కడ జర్నలిస్ట్‌ ప్రశాంత్‌ ఒకామీ వీడియో క్లిప్పింగ్‌ను ట్వీట్‌ ద్వారా షేర్‌ చేశారు. ఆయన ట్వీట్‌ ద్వారా మొత్తం కంప్యూటర్‌ వ్యవస్తే ఎలా స్తంభించిపోతుంది? ఇలా పోలీసులు అత్యుత్సాహంతో అన్యాయంగా భారతీయ పౌరులను అరెస్ట్‌ చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గత మేనెలలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్‌ చేసి పెట్టినందుకు అరెస్టయిన బీజేపీ కార్యకర్తను కోర్టు జోక్యం చేసుకొని వదిలేసింది. కోణార్క్‌ దేవాలయంపై బూతు బొమ్మలున్నాయంటూ వ్యాఖ్యానించి అరెస్టయిన కేంద్ర రక్షణ శాఖ విశ్లేషకుడిని కూడా కోర్టు విడుదల చేసింది. ఇలాంటి కేసులు కోర్టుల్లో నిలవవని తెలిసినా పోలీసులు ఎందుకు నమోదు చేస్తున్నారు ? ఎందుకు అరెస్టులు చేస్తున్నారు ? ఎందుకంటే భయపెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, పాలకులకు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తకుండా చేయడం ఇదీ పోలీసుల అసలు లక్ష్యం. అందుకనే భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి 180 దేశాల్లో భారత్‌కు 138వ స్థానం లభించింది.

Keywords : journalists, uttar pradesh, yogi adityanth, police, arrest
(2019-10-21 17:57:33)



No. of visitors : 284

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


భావ