పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష


పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష

పచ్చని

అక్కడ ఎటు చూసిన పచ్చని కొండలు.. వైవిధ్యభరితమైన పర్యావరణంతో పాటు సెలయేర్లు, వాగులు, వంకలు పారుతూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అదే అడవిలో ఎన్నో తరాలుగా ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. పగలంతా అడవికి వెళ్లి తేనె, పనాస, అనాస వంటి పండ్లతో పాటు అనేక అటవీ ఉత్పత్తులను తీసుకొని రావడం.. వారంతంలో సంతలో అమ్ముకొని తమకు అవసరమైన నిత్యావసరాలు కొనుక్కోవడం.

అక్కడి ఆదివాసి గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే వారి జీవనోపాధి. కాలుష్యం కానరాని ప్రాంతంలో కల్మషం లేని జీవనం గడపడం ఎన్నో ఏండ్లుగా వారికి అలవాటైపోయింది. అదే ఒడిషాలోని రాయగడ, చత్తీస్‌గడ్ జల్లాలోని దంతెవాడలో విస్తరించిన బైలాడిల్లా పర్వతశ్రేణులు. ఈ పర్యత శ్రేణుల్లో భాగమైన నియంగిరి కొండల్లో ఇప్పుడు కొన్ని కార్పొరేట్ శక్తులు కేంద్ర ప్రభుత్వం సాయంతో మైనింగ్ చేయడానికి నిర్ణయించాయి. ఆనందంగా సాగిపోతున్న ఆదివాసీల జీవితాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం సాగుతోంది.

ఈ నియంగిరి పర్వతంలో మైనింగ్ చేయడానికి నేషనల్ మినరల్ డెవెలెప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)కు చెందిన ఒక గనిని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు కేటాయించింది. ఆ గని ఎన్ఎండీసీదే అయినా అక్కడి కార్యాకలాపాలు కొనసాగించేది మాత్రం అదానీ గ్రూప్. ఈ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీలు ఎదురు తిరిగారు. మా పచ్చని కొండలను నాశనం చేయవద్దని.. తమ జీవనాన్ని దెబ్బతీయవద్దని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం నుంచి నిరవధిక చేస్తున్నారు.

సంయుక్త్ పంచాయత్ సమితి పేరిట అన్ని గ్రామాల ప్రజలు కలసి ఒక జేఏసీగా ఏర్పడ్డారు. ఆ వేదిక పేరు మీద వీళ్లు అక్రమ మైనింగ్‌పై పోరాటం ప్రారంభించారు. ఆ నియంగిరి పర్వతాన్ని ఆదివాసీలు చాలా సెంటిమెంట్‌గా భావిస్తారు. తమకు జీవనోపాధిని కల్పించే ఆ కొండను తమ దేవతగా చెప్పుకుంటారు. అక్కడ కనుక మైనింగ్ చేసి కొండను నాశనం చేస్తే ఆదివాసీల హృదయాలు బద్దలైపోతాయని స్థానిక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అది వారికి పరమ పవిత్రమైన కొండ అని ఆయన చెప్పారు.

మరోవైపు మైనింగ్ వల్ల ఆ కొండ పరిసరాల్లో ప్రవహించే నదులు, కాలువలు, సెలయేర్లు కలుషితం అవుతాయని.. ఆ నీటిని తాగడం వల్ల ఆదివాసీల ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎన్ఎండీసీ లేదా అదానీ ఎవరు అక్కడ మైనింగ్ చేపట్టినా ఒప్పుకోమని చెబుతున్నారు.

మరోవైపు అదానీ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అక్కడ మైనింగ్‌కు సహకరించాలని కోరుతోంది. దీంతో దంతెవాడ పోలీసులు నిరాహారదీక్ష చేసే ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మావోయిస్టుల ప్రోద్బలం వల్లే ఈ నిరసనలు చేపట్టారని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ చెబుతున్నారు. అసలు ఈ నిరసన దీక్ష కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కాని మేం వారిని బలవంతంగా పంపమంటున్నారు.

కాని ఇటు దీక్ష జరుగుతుండగానే పోలీసులు, ప్రభుత్వం దానిని అణచివేసే చర్యలు జరుగుతున్నాయి. అక్కడ మైనింగ్ చేపట్టాలో వద్దా అనే విషయం గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. కాని గ్రామ సభలను కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తుండటం.. ఆదివాసీల డిమాండ్లను పట్టించుకోకపోవడంతోనే ఈ దీక్ష ప్రారంభమైంది.

ఒడిషాలోని నియంగిరి పర్వతాల్లో 15వేలకు పైగా కోంధ్ తెగ గిరిజనులు దాదాపు 160 గ్రామాల్లో జీవిస్తున్నారు. వీరందరికీ ఆ కొండ ఎంతో పవిత్రంగా చూస్తుంటారు. అదే వారి జీవనాధారంగా భావిస్తుంటారు. 2013లోనే ఆ కొండల్లో మైనింగ్ అనుమతి ఇస్తే నిరసన తెలియజేశారు.

కాని కార్పొరేట్ శక్తులకు తలొగ్గిన ప్రభుత్వం ఆదివాసీలను మావోయిస్టులే రెచ్చగొడుతున్నారంటూ ప్రచారం చేయడం వల్ల ఆదివాసీలను అసలు మనుషులుగానే గుర్తించట్లేదనే విషయం తేటతెల్లమవుతోంది.

Keywords : niyamgiri hills, dantewada, bailadilla, odisha, adiwasi, protest, nmdc, adani group, mining
(2019-08-21 16:19:04)No. of visitors : 307

Suggested Posts


0 results

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


పచ్చని