యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం


యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం

యోగీ

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను యూపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుపై యోగీ ఆదిత్యానాథ్‌పై తీవ్ర నిరసన వెల్లువెత్తింది. అంతే కాకుండా కనోజియా భార్య జగీష అరారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను యూపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని.. వెంటనే ఆయనను విడుదలకు ఆదేశించాలంటూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ఇవాళ (జూన్ 11) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయకుండా జర్నలిస్టుకు 11 రోజుల రిమాండ్ విధించడంపై యోగీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనేమైనా హంతకుడా అంటూ యూపీ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. వెంటనే అతడిని విడుదల చేయాలని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జర్నలిస్టులపై ప్రభుత్వాలు నిర్భంధం విధించడం సరికాదని కోర్టు హెచ్చరించింది.

యోగి ఆదిత్యానాథ్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారనే ఆరోపణలపై శనివారం నుంచి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తన భర్త కనోజియాను అరెస్ట్‌ చేసే క్రమంలో సరైన పద్ధతులను పోలీసులు పాటించలేదని, ఆయన అరెస్ట్‌ అక్రమమని జగీష అరారా పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ గత ఏడాది కాలంగా తనతో వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుతున్నారని, రాజకీయ నేతగా మారిన సన్యాసి తన జీవితాంతం తనతో ఉండేందుకు సిద్ధ పడతారా ? అంటూ ఓ మహిళ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారన్న అభియోగంతో కనోజియాను అరెస్ట్‌ చేశారు.

ప్రధానంగా మహిళల అభిప్రాయాలను ప్రసారం చేసే ʹనేషనల్‌ లైవ్‌ʹ అనే టీవీ ఛానల్‌ ఎడిటర్‌ను కూడా కొన్ని గంటల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు మహిళ వీడియో క్లిప్పును ప్రసారం చేసినందుకే ఛానల్‌ ఎడిటర్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు.

Keywords : Supreme Court, Prashant kanojia, UP Government, Yogi Adityanath
(2019-06-17 12:22:48)No. of visitors : 596

Suggested Posts


0 results

Search Engine

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
మరొకసారి విద్వేష ప్రభుత్వం...కర్తవ్యం ఏమిటి ?
ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న చిన్నారి.. రీవెరిఫికేషన్ లో పాసయ్యింది !
more..


యోగీ