పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి


పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి

పోలీసుల

అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స నిమిత్తం ఏపీకి వస్తున్న నర్మద, కిరణ్ అనే ఇద్దరు మావోయిస్టు నాయకులను హైదరాబాద్‌లో మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి పోలీసులు మంగళవారం అదుపులోనికి తీసుకున్నారని వీరిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కిరణ్ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వాడు. అలాగే ఆయన గడ్చిరోలి జిల్లా బాధ్యుడిగా కూడా ఉన్నారు. అతని భార్య నర్మద గత 22 ఏండ్లుగా ఉద్యమంలో కొనసాగుతోంది.

ప్రస్తుతం గడ్చిరోలిలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిద్దరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్ చత్తీస్‌గడ్ మావోయిస్టు ఉద్యమంలో గత 20 ఏండ్లుగా కొనసాగుతున్నట్లు ఒక విలేకరి ద్వారా తెలిసిందని ఆ ప్రకటనలో తెలిపారు. విజయవాడకు చెందిన కిరణ్, గుడివాడకు చెందిన నర్మద అలియాస్ ఆలూరి కృష్ణకుమారి అలియాస్ సుజాతక్క భార్యాభర్తలు. వారు గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స కోసం ఏపీకి వస్తున్నారని.. వారిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారని వార్తలు వచ్చాయన్నారు.

అంతే కాకుండా కిరణ్‌పై గడ్చిరోలి పోలీసులు అనేక కేసులు నమోదు చేసినట్లు తెలిసిందన్నారు.ఏదేమైనా వారి కేసుల విషయం న్యాయస్థానాల్లో తేలుతాయి కాబట్టి వారి ప్రాణాలకు ముప్పు లేకుండా వెంటనే అరెస్టు చూపించి కోర్టులో హాజరుపరచాలని ఆ ప్రకటనలో కోరారు.

మావోయిస్టు పార్టీ నేతల అరెస్టుపై ʹడెక్కన్ కానికల్ʹ ఇలా కథనం ప్రచురించింది.

మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలైన కిరణ్ కుమార్ అలియాస్ దాదా, ఆలూరి కృష్ణకుమారి అలియాస్ సుజాతక్క అలియాస్ సర్మదలను ఇవాళ మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోనికి తీసుకున్నట్లు తమ వెబ్ పేజీలో రిపోర్టు చేసింది. ఇందులో అనేక విషయాలను వెల్లడించింది.

గడ్చిరోలి పోలీసులు వారిద్దరినీ హైదరాబాద్‌లో ఆదివారం నాడే అదుపులోనికి తీసుకొని మహారాష్ట్రలోని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించినట్లు పేర్కొంది. పోలీసులు నర్మద కోసమే వచ్చారు కాని ఆమెతో భర్త కిరణ్‌ను కూడా కనుగొని ఇద్దరినీ అదుపులోనికి తీసుకున్నారని తెలిపింది. వీరిద్దరూ ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యలుగా ఉన్నారు. త్వరలోనే సెంట్రల్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు రాసింది. ఇద్దరిపై చెరో 20 లక్షల రివార్డును గతంలోనే పోలీసులు ప్రకటించారు.

క్రిష్ణకుమారి (60) గుడివాడకు చెందిన వారు కాగా, కిరణ్ కుమార్ (63) విజయవాడకు చెందిన వ్యక్తి. ఇద్దరూ గత మూడు దశాబ్ధాలుగా మావోయిస్టు పార్టీ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించారు. మహారాష్ట్ర, చత్తీస్‌గడ్ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి అనుబంధంగా క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం (కేఏఎంఎస్)కు ఇంచార్జిగా నర్మద పని చేస్తున్నారు.

కిరణ్ మావోయిస్టు పార్టీకి చెందిన మీడియా, ఎడ్యుకేషన్ విభాగాల్లో చురుకుగా పని చేశారు. అంతే కాకుండా ప్రభాత్ అనే మ్యాగజైన్‌కు బాధ్యుడిగా పని చేస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా కృష్ణ కుమారి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుండగా.. కిరణ్ కుమార్ మోకాళ్లు, వెన్ను సంబంధిత వ్యాదులతో బాధపడుతున్నారు. వీరిద్దరూ కలసి గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో వారు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న మహారాష్ట్ర పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నట్లు డెక్కన్ క్రానికల్ వార్తను ప్రచురించింది.

Keywords : kiran kumar, narmada, aluri krishnakumari, maoists, gadchiroli, maharashtra
(2020-07-02 17:44:07)No. of visitors : 1029

Suggested Posts


0 results

Search Engine

కేరళ:పావంగడ్ పట్టణంలో మావోయిస్టుల పోస్టర్లు,బ్యానర్లు... దళిత,గిరిజన,మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు
ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు
జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో
పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు
తమిళనాడు కస్టడీ మరణాలు: 5గురు పోలీసుల అరెస్టు... పటాకులు పేల్చి డ్యాన్సులు చేసిన జనం
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
తూచ్..మేము మందు కనిపెట్టలేదు...కరోనా మందుపై యూ టర్న్ తీసుకున్న పతంజలి
జ్యుడిషియల్ టీం పై పోలీసుల వేధింపులు... పోలీస్ స్టేషన్‌ను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశం
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
143 Bangladesh intellectuals demand the release of Varavara Rao
దేశంలో రోజుకు ఐదు కస్టోడియల్ మరణాలు
బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?
జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా....ఇలాంటి హత్యలు ఎన్నో!
పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాట‌ల‌కంద‌ని హింస‌
మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడిపై సినిమా... మతోన్మాద శక్తుల హెచ్చరికలు
అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !
ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ పంజాబ్ లో ఆందోళనలు...రాష్ట్రపతికి లేఖ‌ !
రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై నాలుగేళ్లు...
A very worrying letter from Gautamʹs partner Sahba. Remember that Maharashtra is the epicenter of the Covid epidemic.
వరవరరావుతో సహా హక్కుల కార్యకర్త‌లందరినీ విడుదల చేయాలి....500 మంది ప్రముఖుల లేఖ !
ప్రైవేటు కంపనీలకు బొగ్గు తవ్వకాలకు అనుమతిపై నిరసనకు పిలుపునిచ్చిన జార్ఖండ్ జన్ అధికార్ మహాసభ
సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ
more..


పోలీసుల