యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!


యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!

నేను అధికారంలోకి వస్తే రామరాజ్యం తెస్తా.. అంటూ తరచూ రాజకీయ నాయకులు చెబుతుంటారు. లక్కీగా యూపీ ముఖ్యమంత్రి అయిన యోగీ ఆదిత్యానాథ్ కూడా తమది రామరాజ్యం అని చెప్పుకుంటాడు. కాని అతడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూపీలో అరాచకం పెరిగిపోయింది. ఒక దళితుడిగా జీవించడం తప్పు.. ఒక మైనార్టీ మతంలో ఉండటం తప్పు.. ఒక స్త్రీగా పుట్టడమే అక్కడ తప్పన్నట్లుగా ఎన్నో నేరాలు ఘోరాలు. ఆ తప్పులను ప్రశ్నించడం కూడా ఒక పెద్ద తప్పే. చివరకు ఎంత వరకు వచ్చిందంటే.. జర్నలిస్టులను కూడా వదిలి పెట్టడం లేదు. తమ పనిని తాము చేస్తుంటే దాడులు చేసి జైళ్లలో తోసేస్తున్నారు. ఇదీ యోగీ మార్క్ రామరాజ్యం తీరు !

గత కొన్ని రోజులుగా యూపీలో జర్నలిస్టుల మీద ఏకంగా ప్రభుత్వమే కాదు కాదు స్వయంగా సీఎం యోగీనే దాడులు చేయిస్తున్నాడు. తనను ప్రశ్నించే గొంతు బయట వినపడకూడదనే కక్షతో అన్యాయంగా కటకటాల వెనక్కు పంపుతున్నాడు. యోగీ ఆదిత్యనాథ్‌తో సన్నిహితంగా ఉన్న ఒక మహిళ చెప్పిన మాటల వీడియోను షేర్ చేశాడన్న నెపంతో ఢిల్లీ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను కటకటాల పాల్జేశాడు. దానిపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి విడుదల చేయమని ఆదేశించిన మరుసటి రోజే మరో దారుణం చోటు చేసుకుంది.

న్యూస్ 24 అనే ఛానల్‌కు చెందిన జర్నలిస్టు అమిత్ మిశ్రా గత రాత్రి షామ్లీ జిల్లాలో జరిగిన ఒక రైలు ప్రమాద వార్తను కవర్ చేయడానికి వెళ్లాడు. అతడిని చూసిన వెంటనే అక్కడ ఉన్న రైల్వే పోలీసులు ఒక్కసారిగా విరుచుకపడ్డారు. శర్మ చేతిలోని కెమేరాను కింద పడేశారు. దానిని తీసుకుందామని కిందకు వంగిన అమిత్‌పై అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ ఇష్టానుసారం కొట్టారు.

అక్కడితో ఆ పోలీసులు అతడిని వదల్లేదు.. పోలీస్ స్టేషన్‌‌కు తీసుకొని వెళ్లి బట్టలు విప్పి చిత్రహింసలు పెట్టారు. నోట్లో మూత్రం పోసి దారుణంగా ప్రవర్తించారు. ఒక మనిషి అన్నవాడు ఇలా కూడా ప్రవర్తిస్తాడా అన్న అనుమానం వచ్చేలా శర్మపై దాడి చేశారు.

విషయం తెలుసుకున్న కొంత మంది జర్నలిస్టులు అక్కడకు వచ్చి జరిగిన దారుణాన్ని చిత్రీకరించారు. పోలీస్ స్టేషన్ ఎదుటే భైటాయించారు. అయినా రాత్రంతా అమిత్ శర్మను స్టేషన్‌లోనే ఉంచి పొద్దన్న విడిచి పెట్టారు.

పోలీసులు తనపై ఇలా అమానుషంగా ప్రవర్తించడానికి కారణం వేరే ఉందని చెప్పారు. షామ్లీ జిల్లా రైల్వే పోలీసులు చేస్తున్న అనధికార దందాలకు సంబంధించిన ఒక వార్తను 10 రోజుల కిందట చిత్రీకరించానని.. అది మనసులో పెట్టుకొనే ఇలా నాపై దాడి చేశారని అమిత్ చెప్పుకొచ్చాడు.

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన.. ఏకంగా సీఎమ్మే జర్నలిస్టులపై దాడులు చేస్తుంటే మేం మాత్రం తక్కువా అన్నట్లు పోలీసులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు.

Keywords : Yogi Adithya Nath, UP, CM, Journalist, Urine, Amith Sharma, News24, Railway Police, Beaten, Stripped
(2019-10-14 10:55:20)No. of visitors : 744

Suggested Posts


0 results

Search Engine

RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
ఐదు దశాబ్దాల వసంతగానం
మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్
more..


యోగీ