83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన


83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన

83

ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో పూణే పోలీసులు ఆదివాసీ హక్కుల కార్యకర్త 83 ఏళ్ల స్టాన్ స్వామి ఇంట్లో చొరబడి మూడు గంటల పాటు సోదాలు చేసి ఆయన హార్డ్ డిస్క్, ఇంటర్నెట్ మోడెమ్ ఎత్తుకుపోయారు. ఆయన ఈమెయిల్, ఫేస్ బుక్ అకౌంట్ల పాస్ వర్డ్స్ బలవంతంగా చెప్పించుకుని వాటిని సీజ్ చేసారు. ఇది జరుగుతున్నప్పుడు ఆయన న్యాయవాదిని ఇంట్లోకి అనుమతించలేదు.

గత ఏడాది ఆగస్టు 28న వరవరరావు, సుధా భరద్వాజ్ తదితర మేధావుల ఇళ్ళపై దాడులు జరిగిన రోజే ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీకి సమీపాన ఉన్న ఆయన ఇంటిపై కూడా కూడా భీమా కారేగావ్ కేసు దర్యాప్తు పేరుతో దాడి చేసి కేసు నమోదు చేసారు. తప్పుడు లేఖలు పుట్టించి, మరాఠీలో సర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఆనాడు చట్టవ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పది మంది ఇళ్ళపై చేసిన సోదాలు, కోర్టులో భీమాకోరేగావ్ కేసు, ప్రహసనం, సంవత్సరం నుండి బెయిల్ విచారణ సాగతీత అలా ఉండగానే రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రెట్టించిన ఉన్మాదంతో ప్రజల మీద, హక్కుల కార్యకర్తల మీద పడుతుందన్న సంగతి ఊహించిందే. ఉత్తరప్రదేశ్లో జర్నలిస్టుల మీద అమానుష దాడులు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల విజయం ప్రకటించగానే ముస్లింలపై దాడులు చూస్తున్నాం. కనీసం ఫేస్ బుక్ లో అసమ్మతి ప్రకటనను కూడా సహించని గూండా గిరీ పెరిగిపోతున్నది. ఇక ప్రత్యక్ష కార్యాచరణలో ఉన్న ప్రజానాయకుల కోసం దేశంలో అత్యంత క్రూరమైన జైళ్ళు ఎదురుచూస్తున్నాయి. ఈ సోదా భీమా కారేగావ్ కేసు విచారణ భాగంగానేనని చెప్తున్నారు. అంటే మరిన్ని తప్పుడు సాక్ష్యాలు సృష్టించబోతున్నారు.

ఝార్ఖండ్ లో అత్యంత గౌరవనీయ వ్యక్తి స్టాన్ స్వామి. మూడు దశాబ్దాలుగా ఝార్ఖండ్‌ ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన తన ఎన్జీవో బగీచా ద్వారా సేవలు అందిస్తున్నారు. జాదూగూడాలో యురేనియం కార్పోరేషన్‌ చేపడుతున్న టెయిల్‌ పాండ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఝార్ఖండీ అగైన్ట్‌ రేడియేషన్‌ ఉద్యమంలో తొలిసారి స్టాన్‌స్వామి పేరు ప్రముఖంగా వినిపించింది. 1996లో జాదూగూడ ప్రాంతంలో స్టాన్‌ విస్త్రుతంగా పర్యటించారు. ఈ ఉద్యమ ఫలితంగానే యురేనియం రేడియేషన్‌ దుష్ప్రభావాలు, జాదూగూడ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులు దయనీయ పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలిశాయి.

తర్వాత స్టాన్‌స్వామి బొకారో ప్రాంతంలో వలసలకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. ఝర్ఘండ్‌ రాష్ట్రంలో నక్సల్స్‌ పేరుతో అరెస్టైన వాళ్లలో 98శాతం అమాయక ఆదివాసులని, భద్రతా దళాలు, పోలీసులు అమాయకులను నక్సల్స్‌ పేరుతో జైళ్లపాలు చేస్తున్నారని బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. 2017 పతల్‌ఘడీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం ఉద్యమానికి సారధ్యం వహించిన 20 మందిపై దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఎన్ని వేధింపులు ఎదురైనా ఆదివాసుల పక్షం వహించిన స్టాన్ స్వామి పక్షాన ప్రజాస్వామికవాదులు నిలవాల్సిన అవసరం ఉంది. ఫాసిజం ఇంకా ఇంకా క్రూరంగానే ఉంటుంది. మనం గుండె దిటవుతో నిలవాలి. పోరాడాలి.

-విరసం

Keywords : stan swamy, pune police, virasam, adivasi rights activist, maharashtra, bhima koregaon
(2019-08-24 13:04:34)No. of visitors : 333

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
more..


83