కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !


కోటీశ్వరుల పెళ్లి... 40 టన్నుల చెత్త‌ !

కోటీశ్వరుల

ఉత్తరాఖండ్లోని ఔలీ అనే చిన్న పట్టణంలో జరిగిన ఓ ధనవంతుల కుటుంభానికి చెందిన‌ రెండు పెళ్లిళ్లు దాదాపు 40క్వింటాళ్ల చెత్తను మిగిల్చాయి.
ఇప్పుడీ చెత్తను ఊడ్చి పారేయడం మున్సిపల్ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్ద సవాల్‌గా మారింది.

దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ గుప్తా కుటుంబాలకు చెందిన రెండు పెళ్లిళ్లు జూన్ 18-20, 20-22 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతంలో జరిగాయి.అజయ్ గుప్తా కుమారుడు సూర్యాకాంత్, అతుల్ గుప్తా కుమారుడు శశాంక్ పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు, ఈ పెళ్లిళ్లపై కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు.భారీ ఖర్చులతో జరిపే పెళ్లిళ్లు పర్యావరణానికి ప్రతికూలమని అందులో పేర్కొన్నారు. అయితే కోర్టు ఇందులో జోక్యం చేసుకోకపోవడంతో యథావిధిగా ఆ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి.

కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు, యోగా గురు బాబా రాందేవ్, ఇతర రంగాలకు చెందిన మరికొంతమంది అతిథులు వివాహ వేడుకకు హాజరయ్యారు.పెళ్లిళ్లకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా చాపర్స్ ఏర్పాటు చేశారు.దాదాపుగా అక్కడి అన్ని హోటల్స్, రిసార్టులను పెళ్లికి వచ్చే అతిథులకోసం బుక్ చేశారు. పెళ్లిళ్ల కోసం స్విట్జర్లాండ్ నుంచి పువ్వులు తెప్పించారు. మొత్తం మీద అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిగాయి. అయితే పెళ్లి తర్వాత క్వింటాళ్ల కొద్ది చెత్త మిగలడంతో.. అక్కడి మున్సిపల్ అధికారులు దాన్ని క్లీన్ చేయించడానికి తంటాలు పడుతున్నారు. స్థానిక మున్సిపల్ అధికారి అనిల్, తన 20మంది టీమ్‌తో కలిసి ఇప్పుడీ చెత్తను ఊడ్చి పారేసే పనిలో నిమగ్నమయ్యారు. భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేసుకునే సంపన్న వర్గాలు.. తద్వారా ఏర్పడే చెత్త.. పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Keywords : uttarakhand, Marriage, wastage, civic body
(2019-11-18 00:59:09)No. of visitors : 182

Suggested Posts


0 results

Search Engine

Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
ఫీజుల పెంపును నిరసిస్తూ.. కేంద్ర మంత్రిని నిర్బంధించిన జేఎన్‌యూ విద్యార్థులు..!
పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని సమరోత్సాహంతో ట్యాంక్ బండ్ పైకి దూసుకొచ్చిన‌ కార్మికులు
చలో ట్యాంక్ బండ్ లో మావోయిస్టులున్నారన్న సీపీ... ఉక్కుపాదం మోపడం కోసమే ఈ ఆరోపణలన్న‌ ఆర్టీసీ జేఏసీ
వేలాది పోలీసు బలగాల నిర్బంధాల మధ్య‌ చలో టాంక్ బండ్ విజయవంతం
ఆర్టీసీ సమ్మెకు రాజకీయ ఖైదీల మద్దతు.. జైళ్లో నిరసన.. చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేయండి..!
భగత్ సింగ్ పిస్టల్ – అనేకానేక స్మృతులు
జర్నలిస్టులు, దళిత, మానవహక్కుల కార్యకర్తల వాట్సప్ ఖాతాలు హ్యాక్
దొర ప్రతాపమంత మజ్దూర్ల మీదనే!
తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
more..


కోటీశ్వరుల