ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు


ʹఊపాʹ చట్టమే మరో ఎమర్జెన్సీ - ఎన్.నారాయణ రావు

ʹఊపాʹ


ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలం జూన్ 25, 1975 నుండి మార్చి 1977, 21 నెలల పాటు కొనసాగింది. రాష్ట్రపతి ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ ను పెట్టుకుని ప్రధాని ఇందిరా అధికరణ 352 ఉపయోగించుకొని, పౌర ప్రజాస్వామిక హక్కులను అణచివేసింది. ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంలోని రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కు, న్యాయ పరిష్కారాలను ఆస్కారం లేకుండా చేసింది. ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని ఇందిరాగాంధీ మాటల్లోనే దేశంలోని అంతర్గత సంక్షోభం, జయ‌ప్రకాష్ నారాయణ్ కొనసాగించిన నవనిర్మాణ్ ఆందోళన ఉద్యమం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పేద ప్రజల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా చెప్పుకొచ్చింది. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాలు, నిరుద్యోగ సమస్యలతో అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా ముందుకు రావడం, అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించడం ఇవన్నీ ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణాలుగా ఉన్నాయి.

1973లో జయప్రకాష్ ఆధ్వర్యంలో గుజరాత్లో వచ్చిన నవ నిర్మాణ ఆందోళన్ అప్పుడు రాజకీయ స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి 19, 1975 ఇందిరాగాంధీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత, జూన్ 12న 1975 అలహాబాద్ హైకోర్టు రిజస్టిస్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. 20 రోజుల్లో సుప్రీంకోర్టుకు అప్పీలుకు అవకాశం ఇచ్చింది. న్యాయస్థానాలు ఇప్పటిలా ప్రభుత్వాల అధీనంలో లేని స్థితిలో ఆనాడు ఇందిరాగాంధీ 1975 మార్చి 25న ఎమర్జెన్సీని ప్రకటించింది.

ప్రకటించిన ఎమర్జెన్సీ 21 నెలలపాటు కొనసాగింది. అప్రకటిత ఎమర్జెన్సీ 40 ఏళ్లుగా నేటికీ కొనసాగుతూ వుంది. ప్రధానంగా ప్రాథమిక హక్కు అధికరణం 19, 21 కూడా అమలు కాలేకపోతున్నాయి. అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొన్నట్లుగా అధికరణం 352 ఉపయోగించకుండానే ప్రాథమిక హక్కుల్ని ఎలా రద్దుచేయగలమనే ఆలోచనకే మరో రూపం ఉపా చట్టం. పోటా చట్టం తర్వాత నవంబర్ 26, 2008 ముంబాయి దాడుల తర్వాత, అన్ లా ఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ 1967ను మళ్లీ అమెండ్ చేయబడింది. ఈ అమెండమెంట్లో ఊపా 180 రోజుల పాటు బెయిల్ రాకుండా ఉంచవచ్చు. ఊపా చట్టం పోలీసులకు విస్తృత‌మైన అధికారాలు ఇచ్చింది. అరెస్టుచేయడానికి, బూటకపు కేసులు నమోదు చేయడానికి ఈ చట్టం ద్వారా అవకాశాలు పొందారు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21లు ఈ చట్టం ద్వారా ఉల్లంఘించబడుతున్నాయి. అందుకే ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం. ఎలాగైతే గ్రేహండ్స్ʹ చట్ట వ్యతిరేక నిర్మాణంగా ప్రకటిస్తున్నామో ఊపా చట్టం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఉపా చట్టాన్ని వెంటనే రద్దుచేయాలి.

ప్రధాని ఇందిరాగాంధీ సంక్షోభం 1975 ఎమర్జెన్సీ కారణమైతే, సామ్రాజ్యవాద సంక్షోభం వివిధ దేశాలలో, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు బలంగా ఉన్న దేశాలలో క్రూర నిర్బంధ చట్టాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. మన దేశంలో కూడా ప్రజా ఉద్యమాలు కూడా బలంగా కొనసాగే రాష్ట్రాలలో ఉపా చట్టం కంటే ముందుగానే ప్రత్యేక నిర్బంధ చట్టాలు చాలా అమలులో ఉన్నాయి. ఇందులో భాగంగానే 2005లో చత్తీస్ గడ్ ప్రత్యేక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కొనసాగుతున్నది. ఈచట్టం ద్వారా కూడా ఆర్టికల్ 19 ఉల్లంఘన జరుగుతూనే ఉన్నది. దేశంలో ఉన్న పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ లన్నీ, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA)కూడా ఇటువంటి రాజ్యాంగ ఉల్లంఘనకే దారి తీస్తున్నాయి. ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలలో అమలై ప్రాథమిక హక్కులను తీవ్ర స్థాయిలో అణచివేస్తున్నాయి. కాశ్మీర్లో ప్రధానంగా బుర్హాన్ ఎకౌంటర్ తర్వాత అందరినీ అనుమానితులుగానే పరిగణిస్తూ ఈ చట్టం కొనసాగుతున్నది. దీనికి తోడు అస్సాంలో, కాశ్మీర్లో అమలవుతున్న అస్పా (AFSPA) ప్రజల జీవించే హక్కుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ప్రజాస్వామ్యం స్థానంలో ఫాసిజం అమలుకావడం అంటేనే ఎమర్జెన్సీ. పెరుగుతున్న ప్రజాఉద్యమాలకు సమాధానం ఇవ్వలేని ప్రభుత్వాలు అణచివేతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అనేక నిర్బంధ చట్టాలను తీసుకువస్తున్నాయి. దీనికి తోడు ఏ రాష్ట్రంలోనైనా విచ్చలవిడిగా ఎన్కౌంటర్ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్య నాథ్ ప్రాతినిధ్యంలో వందల సంఖ్యంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. యోగి ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా మారిపోతున్నాడు. జార్ఖండ్, ఛత్తీస్గడ్లలో ఆదివాసీలు ఎన్ కౌంటర్ పేరుతో నిత్యం హత్య గావించబడుతున్నారు. కొనసాగుతున్న ప్రభుత్వాలలోని అప్రజాస్వామిక విధానాలను, ప్రజావ్యతిరేక విధానాలను నిరసించినా, ప్రశ్నించినా వారిపై కుట్ర కేసులు, ఊపా చట్టం అమలే సమాధానంగా మేధావులపై భీమాకోరేగాం, ప్రధానమంత్రి హత్య కుట్ర కేసులు నమోదు కాబడ్డాయి. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ సుప్రీంకోర్టులో ప్రశ్నించినా జవాబు లేకుండా పోయింది.

ఒకవైపు నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను బలహీనపరుస్తూనే, మరోవైపు ఇంకా అతి క్రూర నిర్బంధ చట్టాలతో ప్రభుత్వం దాడి కొనసాగిస్తున్నది. నిర్బంధ చట్టాలే కాదు, నిర్బంధ పోలీసు విభాగాలు కూడా ప్రజల్ని భయ పెట్టడానికి, వారి హక్కుల్ని అణచివేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఏపి, తెలంగాణలో గ్రేహౌండ్స్ బలగాలు, మహారాష్ట్రలో c60 బలగాలు క్యూ బ్రాంచీ బలగాలు ఒరిస్సా చత్తీస్గడ్లలో కోబ్రా, డిఆర్జి బలగాలు ప్రజల ప్రాథమిక హక్కుల్ని సైతం అణచివేస్తున్నాయి. దానికి ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ప్రధానంగా ఊపా చట్టం చాలా బాగా ప్రభుత్వానికి ఉపకరిస్తున్నది. ఇప్పటికే మూడింట 2వంతులు ఆదివాసులు ఉపా నిర్బంధ చట్టాన్ని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 67 శాతం ఊపా కేసులో నిర్ణోషులుగా మరియు కేసులు కొట్టివేయబడే స్థితిని మనం చూస్తున్నాం. 2017లో 76 కేసుల్లో 65 కేసులను ఉపా నిందితులు నిర్దోషులగా విడుదల కాబడ్డారు. 2016 ఏడాది చివర్లో జాతీయ నేర విభాగ బ్యూరో లెక్కల్లో 75 శాతం నిర్దోషులుగా విడుదలయ్యారు. దేశంలోని ఇపుడు ఏ నేరం చేయని గౌతమ్నవలాఖ, సురేంద్ర గాడ్లింగ్, సుధా భరద్వాజ్, సోమాసేన్, అరుణ్ ఫరారే, వెర్నాన్ గొంజల్వాస్, ఆనంద్ తేల్తుంబ్డె, వరవరరావు, సాయిబాబా, ప్రశాంతి రాహి, హేమ్ మిశ్రాలతో పాటు అనేకమంది ఆదివాసీలు ఈ కేసులో ఇరుక్కుంటున్నారు. ప్రజా ఉద్యమకారుల అందరిపై ఉపా కత్తి వేలాడుతూనే ఉంది. 1975 ఎమర్జెన్సీ ఎంతటి దారుణమో నేటి ఉపా చట్టమే ఇంతటి ఎమర్జెన్సీని నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. ఊపా చట్టాన్ని రద్దుచేసి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన అధికారణం 19, 21లను ఖచ్చితంగా అమలుచేస్తేనే ప్రజాస్వామ్యం కొనసాగుతుందని భావిస్తున్నాం.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారందరూ అనుమానితులుగా, కుట్రకారులుగా, దేశద్రోహులుగా పరిగణించే స్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది. ఇది ప్రభుత్వంలోని అప్రజాస్వామికతకు చిహ్నం. ఏ ప్రభుత్వమైనా సామ్రాజ్యవాద‌ విధేయుడుగా ఉండకపోతే దేశంలో అధికారం కోల్పోవలసి వస్తుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించినా మావోయిస్టు ముద్రను ఎదుర్కోవల్సి వస్తుంది. దానికి రాహుల్, దిగ్విజయ్, ప్రకాష్ రాజ్ ఎవరూ మినహాయింపు కాదు. ప్రభుత్వం పెడుతున్న ఉపా కేసుల్లో తాము నేరస్తులము కాదని తామే నిరూపించుకోవాల్సివస్తుంది. దానికి ఏళ్ళకు ఏళ్లు కాలం తీసుకునే లాగా ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రభుత్వం కుట్రపూరితంగానే బెయిల్ రాకుండా చేయడం, చివరకు జైల్లోనే మరణించేలా చేయడమే ఊపా కేసు లక్ష్యంగా మారుతుంది. ఆ స్థితిలోకి నేడు ప్రొ. సాయిబాబా, వరవరరావులను నెడుతున్నవి. ఈ ఎమర్జెన్సీ స్థితిలో ప్రజాస్వామికవాదులందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
‍ - ఎన్.నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం, తెలంగాణ‌

Keywords : varavararao, gn saibaba, clc, pune, nagpur, jail, UAPA
(2019-09-15 00:16:04)No. of visitors : 258

Suggested Posts


ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

గడ్చిరోలి,తూతుకుడి మారణకాండ కు వ్యతిరేకంగా 9న సభ‌

ఆదివాసులను,ఉద్యమకారులను పేసా చట్టం,అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని ఉద్యమిస్తున్న వారిని మహారాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది.బహుళజాతి కంపెనీలతో మిలాఖత్ అయ్యి వేదాంత స్టెరిలైట్ కంపెనీ స్థాపించి రెండు దశాబ్దాలుగా అక్కడి ప్రజల జీవించే హక్కును

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ప్రభుత్వ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే కుట్రను ఎదుర్కుందాం...పౌరహక్కుల సంఘ‍ం

తమిళనాడు తత్తుకూడిలో తుత్తుకుడి స్టెరిలైట్ వేదాంత కంపెనీలో 13 మందిని హత్యచేసి నేడు ప్రధాని సరసన చేరి కంపెనీ యజమాని అనిల్ అగర్వాల్ దేశంలోని 5 పబ్లిక్ రంగ మైనింగ్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని అందులో ఎన్ఎండిసీ ఉండాలని ప్రధానిని కోరడం అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక చర్యగా పేర్కొంటూ ఎన్ఎండిసీతో సహా ఏ మైనింగ్ కంపెనీని కూడా ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తు

అడవి బిడ్డలను అరిగోస పెడ్తున్నరు

తల్లిని విడిచి తాము ఉండలేమని , తమను మళ్ళీ అడవిలోనే వదిలివేయాలని అధికార్ల కాళ్ళా వేళ్ళా పడ్డారు ఆదివాసులు. బోరున విలపించారు కొందరు... తమను తమ అడవితల్లి దగ్గరికి చేర్చేదాంక అన్నం ముట్టబోమని ఏ ఒక్కరూ అన్నం తిన లేదు. ʹమాకు మీ ఇళ్ళొద్దు...మీ భూములొద్దు మా ఊరికి పంపించండిʹ అంటూ ఆ అడవి బిడ్డల రోదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది పాలకులకు తప్ప.

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం

కోరాపుట్ కు 24 కిలోమీటర్ల దూరంలో సునాబేడ వద్ద మావోయిస్టు వ్యతిరేక బ్యానర్లతో దాదాపు వంద మంది రోడ్డుకు అడ్డుగా నిలబడ్డారు. వారితోపాటు డ్రస్సులో కొందరు , సివిల్ డ్రస్సులో కొందరు పోలీసులు నిలబడి ఉన్నారు.

Search Engine

కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
War and Peace in the Western Ghats
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.
కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం
more..


ʹఊపాʹ