జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు.


జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు.

జై


జైశ్రీరాం నినాదం ఇప్పుడు జాతీయవాదానికి సరిసమానమయ్యింది. దేశభక్తికి నిదర్శనమయ్యింది. ఇది పైకి చూడడానికే. నిజానికి జాతీయవాదం, దేశభక్తి అనే నినాదాల మాటున మూక హత్యలు, దాడులు చేసే వాళ్ళకు జైశ్రీరాం అనే నినాదం ఒక పదునైన ఆయుధం. అదే ఆయుధంతో జార్ఖండ్ లో 22 ఏండ్ల‌ తాబ్రేజ్ అన్సారీని కొట్టి... కొట్టి, హింసించి... హింసించి చంపేశారు. వందలాది మంది గుమికూడి..దొంగతనం నేరం మోపి... ఒక్కడ్ని కట్టేసి... నేను దొంగను కాదు అని మొత్తుకుంటున్నా...కన్నీళ్ళతో ఆ మూక కాళ్ళు తడిపినా కరగని ఆ బండ హృదయాలు అన్సారీని అతి క్రూరంగా కొట్టి చంపేశారు. అన్సారీని హింసలు పెడుతున్నప్పుడు ఆ శాడిస్టు మూక జైశ్రీరాం అనే నినాదాలు ఇవ్వడమే కాక నినాదాలు ఇవ్వాలని అన్సారీని కూడా బలవంతం చేసింది. అన్సారీ నిరాకరించడంతో రెచ్చిపోయిన ఆ మూక మరింతగా హింసించి అన్సారీని చంపేసింది.

ఇక వెస్ట్ బెంగాల్ లో ఇదే కథ రిపీట్ అయ్యింది. అయితే ఇక్కడ ఎలాంటి ఆరోపణ చేయకుండానే దాడి చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం... దక్షిణ 24 పరగణాలోని కానింగ్ నుండి హుబ్లీకి ట్రైన్ లో వెళ్తున్న 26 ఏండ్ల హఫీజ్ మహ్మద్ షారూఖ్ హల్దర్ అనే యువకుడిపై ఓ మూక డాడి చేసి దారుణంగా కొట్టింది. హఫీజ్ ప్రయాణిస్తున్న ట్రైనులో కొందరు జై శ్రీరాం నినాదాలిస్తూ ఇతన్ని చూసి వెక్కిరించడం ప్రారంభించారు. చివరకు శృతి మించి హఫీజ్ ను కూడా జై శ్రీరాం అనే నినాదాలివ్వాలని బలవంతం చేశారు. అతను నినాదాలివ్వడానికి తిరస్కరించడంతో వాళ్ళంతా హఫీజ్ చుట్టూ చేరి పిడికిళ్ళతో మొహం మీద గుద్దడం, కాళ్ళతో తన్నడం చేశారు. అంత దారుణంగా వాళ్ళు హఫీజ్ ను కొడుతూ ఉంటే ఆ పెట్టెలో ఉన్నవాళ్ళు భయంతో ఒక్కరు కూడా అడ్డుకోలేదు. ఇంతలో పార్క్ సర్కస్ స్టేషన్ రావడంతో హఫీజ్ ను బలవంతంగా ట్రైనులో నుండి బైటికి తోసేశారు.
వెంటనే హఫీజ్ హల్దర్ ను రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతనికి చిన్న గాయాలే తగిలాయని పెద్దవి కాదని పోలీసులు తెలిపారు. హఫీజ్ హల్దర్ తనపై జరిగిన దాడి సంఘటనను బాలీగంజ్ రైల్వే పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.

Keywords : jarkhand, west bengal, jai sreeram, rss, bjp, narendra modi, bhajarang dal, VHP
(2019-07-16 10:50:31)No. of visitors : 210

Suggested Posts


ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌

ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యపై మతోన్మాదులు సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. పర్సనల్ మెసేజ్ లు పెట్టి బెదిరిస్తున్నారు. రేప్ చేస్తామని, హత్య చేస్తామని హిందుత్వవాదులు హూంకరిస్తున్నారు.

ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?

ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు.

ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ?

మరణవార్త చెప్పిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్‌ ఫోన్‌ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్‌లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్‌కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ ...

తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !

యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు....

51 University VCs Attend RSS Workshop on Making Education More Indian

Over 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital....

సావర్కర్ పుట్టినరోజున స్కూలు పిల్లలకు కత్తులు పంచిన హిందూ మహాసభ‌ !

ʹరాజకీయాలను హిందూమయం చేయడం హిందువులను సాయుధలను చేయడం సావర్కర్ కల మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం ద్వారా సావర్కర్ కల లోని మొదటి భాగాన్నిమోడీ పూర్తి చేశాడు. రేండోది మేము చేస్తున్నాంʹʹ

Search Engine

ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ
TISS క్యాంపస్ మూసివేత పై మండి పడుతున్న విద్యార్థులు...రేపు పౌరహక్కుల సంఘం మీడియా సమావేశం
తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
more..


జై