బీజేపీ,కాంగ్రెస్ సేమ్ టూ సేమ్... గోరక్ష‌కుల మూక దాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్ పై చార్జ్ షీట్


బీజేపీ,కాంగ్రెస్ సేమ్ టూ సేమ్... గోరక్ష‌కుల మూక దాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్ పై చార్జ్ షీట్

బీజేపీ,కాంగ్రెస్

2017 ఏప్రిల్‌ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్‌, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్‌ ప్రాణాలు విడిచారు. అతనితోపాటు దారికి గురైన అతని కొడుకు గాయాలతో బతికి పోయాడు. బీజేపీ ప్రభుత్వం హత్యకు గురైన పెహ్లూ ఖాన్, అతని కొడుకుపై కేసు నమోదు చేసింది.

ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బాధితులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసును ఎత్తి వేసి పెహ్లూ ఖాన్ హంతకులను శిక్షిస్తుందని ఆ కుటుంభం భావించింది. అయితే బీజేపీ కన్నా తామేమీ తక్కువ తినలేదని మరో సారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. చనిపోయిన పెహ్లూ ఖాన్ పై, అతని కొడుకుపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. ʹగత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగింది. ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్‌ వేశారు. కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తాంʹ అని తెలిపారు. పెహ్లూ ఖాన్‌ కొడుకు ఇర్షాద్‌ (25) మాట్లాడుతూ..ʹగో రక్షకుల దాడిలో మా నాన్నను కోల్పోయాం. ఇప్పుడు మామీదే స్మగ్లర్లుగా చార్జ్‌షీట్‌ వేశారు. కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో ఈ కేసును సమీక్షించి.. మాపై కేసును ఎత్తివేస్తారని భావించాం. ప్రభుత్వం మారడంతో న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ అలా జరగడం లేదుʹ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Keywords : rajasthan, pehlu khan, gow rakshak, attack, murder
(2020-08-09 21:21:36)



No. of visitors : 393

Suggested Posts


సీఎం ఆదేశాలతో...బహిర్భూమికి వెళ్ళిన మహిళల ఫోటోలు తీశారు.. అడ్డుకున్నందుకు కొట్టి చంపారు.

స్త్రీలు బహిర్భూమికి వెళ్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేవాళ్ళను ఏమంటారు. పోకిరీలు... జులాయీలు... ఈవ్ టీజర్లు.... అలా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటివాళ్ళను ఏమనాలి ? బ్లాక్ మెయిలర్స్ అనే కదా అంటారు. అలా ఫోటోలు తీసేవాళ్ళను అడ్డుకుంటే అలా అడ్డుకున్నవాళ్ళను కొట్టి చంపేవాళ్ళను ఏమంటారు ? హంతకులనే కదా ! కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ....

గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి

గోరక్షక ముసుగులో ఉన్న మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్‌లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌....

Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks

The family of a Muslim man, whose dismembered body was found on the railway tracks near Govindgarh in Alwar district of Rajasthan on Friday, has claimed that he was thrashed and shot dead by a crowd of cow vigilantes when he was transporting four cows to his native village Ghatmika in Bharatpur....

పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!

ఆవులను అక్రమ రవాణా చేశాడన్న నెపంతో రాజస్తాన్ లో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తిని మతోన్మాద‌ మూక కొట్టి చంపిన కేసును రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా కోర్టు ఈ రోజు కొట్టివేసింది. నిందితులైన ఆరుగురిని నిర్దోషులని కోర్టు ప్రకటించింది.

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఓ ముస్లిం వ్యక్తిపై దారుణంగా దాడి చేశారు మతోన్మాదులు. రాజస్థాన్ లోని షికార్ జిల్లా సదర్ పోలీసు స్టేషన్ పరిథిలో గఫార్ అహ్మద్ అనే ఆటో నడుపుకొని జీవించే 53 ఏళ్ళ వ్యక్తి తన ఆటోలో పాసింజర్లను గమ్య స్థానాల్లో దింపి

Search Engine

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా.కు జోహార్లు !
వరవరరావు,సాయిబాబాలను విడుదల చేయాలంటూ 520 మంది రచయితల లేఖ‌ !
విలాస జీవితం ఎవరిది....డీజీపీకి మావోయిస్టుల సవాల్
more..


బీజేపీ,కాంగ్రెస్