మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్


మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్

మళ్ల

(వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన ఈ సంపాదకీయ వ్యాఖ్య (తెలంగాణ) వీక్షణం జూలై 2019 సంచికలో ప్రచురించబడినది)

తెలంగాణొచ్చి ఐదేండ్లయింది గద. అంటె శాన రోజులే గద. ఒక సర్కారు దిగిపోయి రెండో సర్కారు గుడ ఎక్కింది గద. ఎన్నేండ్లు కొట్లాడి తెచ్చుకుంటిమి! ఎంత మంది బిడ్డలు రాలిపోతె ఒచ్చింది! ఏదైన ఎదురుచూడంగ ఎదురుచూడంగ ఒస్తె ఆశ ఎక్కువుంటది గద. తెలంగాణొస్తే ఏమొచ్చింది ఎవరికొచ్చింది అని ఎవరైన అమాయకంగ అడుగొచ్చు. అంతకు ముందు ఎట్లుండె, ఇప్పుడెట్లున్నది అని లెక్కలేసుకోవచ్చు. వాండ్ల బతుకుల్ల ఏమి మారకపోయిన, వాండ్ల ఊళ్ల ఏమి కనబడకపోయిన గుడ ఎవనికో ఒకనికి ఎక్కడ్నో ఒక కాడ వచ్చే ఉంటదిలే, ఏదో ఒక ఊళ్లె మంచి జరిగే ఉంటదిలే, జనానికి ఒరిగే ఉంటదిలే అని సంబుర పడొచ్చు. మారె, అస్సలేమి రాలే, పెనం మీంచి పొయిల బడ్డట్టయింది, పురాగ అన్నాలమై పోయింది, గొర్లను దినెటోడు బోయి బర్లను దినెటోడు ఒచ్చినట్టయింది అని కొట్టిపారేసి నిరాశగ నాలిక చప్పరిచ్చెటోల్లు గుడ ఉండొచ్చు. ఇగ పెద్ద దొర భక్తులూ చిన్న దొర భక్తులూ శానశాన ఒచ్చినయని పెగ్గెలు గుడ చెపుతుండొచ్చు. నీళ్లు దెచ్చినం, పెండ్లిండ్లు జేసినం, ముసలోల్లకు ముద్ద బెట్టినం, పంటకు పెట్టుబడి బెట్టినం, ఢిల్లిల చక్రం దిప్పెడిదుండె, కీసల దప్పిపోయింది అని చాంతాడంత పురాణం జెప్పొచ్చు. అవన్ని నివద్దె. గాని వాటి ఎనుకా ముందు జూడాలె గద. ఇది జేసినం, అది జేసినం అని టుపాకి ఎంకట్రాముని తీర్గ ఒర్రితె గాదు, ఆ పెగ్గెల ఎనుక ఏమున్నది జూడాలె. చెర్ల బియ్యం బోసి తూముల మంటబెట్న మారాజ అంటే ఇనుటానికి బాగనే ఉంటది గాని చెర్ల ఎన్ని బియ్యం బోసిండు, తూముల మంట బెడితె ఉడుకుతాందా లేద, ఉడికినా ఊరి జనానికి మెతుకు మెతుకన్న ఒస్తదా లేదా అని ఇశారించాలె గద. అట్లనే పెద్ద దొర, చిన్న దొర, భక్తులు చెప్పేటియన్ని తిర్లమర్లేసి జూస్తె అసలు సంగతి తెలుస్తది. ఇంతకు ఏమన్న ఒచ్చిందా లేదా అని ఎట్ల జూడాలె? తెలంగాణ ఎందుకు రావాల్నని కొట్లాడినమో అవి ఒచ్చినయా లేదా అని చూడాలె. ఆంధ్రోడు ఎల్లి పోవాలె అని ఎందుకన్నమో అవి జరిగినయా లేదా చూడాలె. జనానికి కావల్సినవి అందినయా లేదా అని చూడాలె. తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేకపాయె, నీళ్లొస్తె మాకేమొస్తది. కొలువులు గావాలె. అవి గావాల్నంటె మస్తుగ మిల్లులు గట్టాలె. కొత్త మిల్లుల సంగతి వదిలిపెట్టు, మూసినయే దెరిపియ్యక పాయె, ఉన్నయి మూయబట్టె. ఇగ పైసలంటే మస్తు పైసలు మిత్తికి దెస్తాండట గద. తెచ్చి ఏం జేస్తాండో తెల్వదు. ఆ అసళ్లు, మిత్తులు ఎవలు గట్టాలె. మా ఊళ్ల కాటిపాపల తాత నోట్లెనుంచి బంగారు గుండ్లు దీసెటోడు. మరెందుకు బిచ్చమడుగుతానవే అంటె, ʹనా సొమ్ము సొక్కమైతే ఇంకాడనో ఉందుʹ అనెటోడు. తెలంగాణ కత గట్లనే ఆయెనా. ఆయినెవలో, నాకు పేరు నోరు దిరగది గని, సాములోరట, గదేదో తూర్పు దేశం నుంచొచ్చి ఐద్రాబాదల జాగ గావాల్నన్నడట. ఐద్రబాదల శాన పిరమాయె. మస్తు పైస గావాలె గద. అయిన, నాకు తెల్వకడుగుత. సాములోరు భూమి పుట్టిచ్చలేడా, పైస పుట్టిచ్చలేడా? గాయినెకు రూపాయికో రెండు రూపాలకో ఎకరం చొప్పున రెండెకరాలు ఇచ్చిండట గద దొర. వారెవ్వా, ఇప్పుడు ఎరుకైంది నాకు. తెలంగాణొస్తే ఏమొచ్చిందా? పెద్దోళ్లకు రూపాయికి ఎకరం ఒచ్చింది మారాజ. పనిపాటలోళ్లకు ఉన్న భూమి ఊడగుంజుకున్నరు మారాజ.
- ఎన్.వేణుగోపాల్

Keywords : telangana, kcr, ktr, trs, lands
(2020-01-17 01:09:39)No. of visitors : 613

Suggested Posts


మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్

గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది....

GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)

జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి....

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు ‍- ఎన్.వేణుగోపాల్

హైదరాబాద్‌లోని మియాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్‌ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి.....

క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్

కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్‌ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది.

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్

దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం.

ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు....

పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల?

ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె....

అరాచక రాజ్యంలో భక్తి ముసుగులో అరాచక మూక‌

మత విశ్వాసాల కోసం వందల మందిని, వేలమందిని ఊచకోత సాగించవచ్చునని చూపినవారు దేశాధినేతలుగా ఉండగలిగినప్పుడు ఆ మత విశ్వాసాల కోసమే చట్టాన్ని ధిక్కరించవచ్చునని, సమాజంలో బీభత్సం సృష్టించవచ్చునని భక్తులు అనుకోవడం సహజమే.

ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్

ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి.

Search Engine

ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
Cotton University Students Hoist Black Flags, Express Solidarity with JNU
JNU: బాధితులపై బీజేపీ నేతల చవకబారు వ్యాఖ్యలు
more..


మళ్ల