వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు


వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు

వరవరరావు

విప్లవ రచయిత వరవరరావుపై పోలీసులు మరో కేసు బనాయించారు. పది నెలలుగా పూణే ఎరవాడ జైలులో ఉన్న వరవరరావును కర్నాటక పోలీసులు కస్టడీ తీసుకొని కర్నాటక తిసుకెళ్ళారు. 2005 లో కర్నాటకలోని తునుకూరు జిల్లా తిరుమాని పోలీసు స్టేషన్ పరిధిలో 6గురు పోలీసులతొ సహా 8 మంది మావోయిస్టుల దాడిలో చనిపోయారనేది కేసు. కోర్టు ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులని విడుదల చేసింది. అయితే ఇంత కాలానికి ఆ కేసును తిరగదోడిన పోలీసులు హైకోర్టుకు అప్పీలు చేశారు. పైగా ఆ కేసులో వరవరరావును ఇరికించారు. విచారణ పేరుతో ఆయనను కర్నాటక పోలీసులు ఈ రోజు పూణే జైలు నుండి తీసుకవెళ్ళారు.

ఎక్కడెక్కడో..ఎప్పుడో జరిగిన కేసులన్నింటిలో వరవరరావును ఇరికించి ఆ 80 ఏండ్ల వృద్దుడిని జైల్లో నుండి బైటికి రాకుండా చేసేందుకు చేయాల్సిన కుట్రలన్నీ పాలకులు చేస్తున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ అనే తేడా లేదు. మహా రాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. విప్లవ రచయితల సంఘం ఏబయ్యో ఏడులో అడుగు పెడుతున్న సందర్భాన ఆ సంఘం వ్యవస్తాపక సభ్యుడైన వరవరరావును రాజ్యం జైల్లో మగ్గేట్టుగా అక్రమ కేసులు బనాయిస్తున్నది. దీనిపై విప్లవ రచయితల సంఘం మీడియా ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం.

వరవరరావుపై కర్ణాటకలో మరోకేసు ఇది ప్రభుత్వ నీతిమాలిన చర్య

ఇప్పటికే భీమా కోరేగాం కేసులో వరవరరావు పది నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. ఆయనపైనా, దేశవ్యాప్తంగా ప్రజల పక్షాన నిజాయితీగా, నిర్భయంగా పోరాడుతున్న మేధావులపైనా భీమాకోరేగాం అల్లర్ల కేసుతో పాటు ప్రధానమంత్రి హత్యకు కుట్ర చేసారనే తప్పుడు ఆరోపణలు చేసి పూణే ఎరవాడ జైల్లో బంధించి ఏడాదిగా బెయిల్‌ విచారణను కూడా సాగదీస్తూ వస్తున్నారు. నిందితులకు బెయిల్‌ ఇవ్వాలా వద్దా తేల్చడానికి కూడా ఇంత తాత్సారం చేస్తున్న న్యాయస్థానాల వెనక ప్రభుత్వ కుట్రపూరిత జోక్యం ఉందని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఈలోగా జనవరిలో వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్‌పై వాళ్లకు ఏ మాత్రం సంబంధంలేని 2016 నాటి కేసు నొకటి బైటికి తీసి అందులో ఇరికించారు. ఇప్పుడు మళ్లీ వరవరరావును మరోకేసు విచారణ నిమిత్తిం కర్ణాటక పోలీసులు పూణే ఎరవాడ జైలు నుండి తమ కస్టడీలోకి తీసుకొని కర్ణాటక తరలిస్తున్నారు. ఇది మావోయిస్టుల దాడికి సంబంధించిన 2005 నాటి కేసు. ఆ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక పావగడ ప్రాంతం తిరుమాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు చేసిన దాడిలో ఆరుగురు జవాన్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కేసులో నిందితులందరూ ఎప్పుడో విడుదలైపోయారు. ఇన్నేళ్ల తర్వాత దీనిని తవ్వితీసి ఇందులో ప్రధాన కుట్రదారుడు వరవరరావు అని ఇప్పుడాయనను విచారించబోతున్నారు. రేపు విరసం ఆవిర్భావ దినం. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, విరసం యాభయ్యవ ఏట అడుగుపెడుతున్న రోజున ఆయన రాజ్యం కరకు తుపాకీల నీడన, న్యాయం ముసుగేసుకున్న అన్యాయస్థానంలో నిలుచొని జనన్యాయం మాట్లాడతారు. ఇది వరుసగా ఆయనమీద నమోదు చేసిన మూడో కేసు. ఆయన తొణకకుండా అలానే ఉంటారు. విరసం అలానే కొనసాగుతుంది.

ఈ మూడూ తప్పుడు కేసులని పోలీసులకు తెలుసు. కానీ ఆయనకు బెయిల్‌ వచ్చినా బైటికి రానివ్వకుండా చేయడానికి కుట్రపూరితంగా ఆయనపై కేసులు నమోదు చేసుకుంటూపోతున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఏ ఆధారం లేకుండా ఇలా మేధావుల మీద, సామాజిక కార్యకర్తల మీద కేసులు పెట్టి, బెయిల్‌ ఇవ్వకుండా, ఏళ్ల తరబడి వాళ్లను జైలుపాలు చేసే అధికారం పోలీసులకు ఉండడం, న్యాయవ్యవస్థ మిన్నకుండా ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇది అలవాటుగా మారి గిట్టనివాళ్లందరి మీదా కక్ష తీర్చుకునే అవకాశం ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. బిజెపి ప్రభుత్వం నోరెత్తినవాళ్లందరినీ జైలుపాలు చేస్తూపోతోంది. భీమాకోరేగాం తదనంతర పరిణామాలు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో చీకటి కోణంగా మిగిలిపోనున్నాయి. మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, ప్రభుత్వ నీతి మాలిన చర్యలకు ఖండిస్తూ న్యాయం పక్షాన గట్టిగా మాట్లాడదాం. ప్రభుత్వ దమనకాండకు ఖండిద్దాం.
-విరసం

Keywords : varavararao, maoists, karnataka, maharashtra, virasam, police
(2019-09-22 04:15:47)No. of visitors : 355

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


వరవరరావు