నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !


నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !


తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాఘవులు సార్ ది 40 ఏండ్ల పోరాట చరిత్ర. నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమం ప్రారంభ దశ నుండి పెద్ద అండ రాఘవులు సార్. ఉపాధ్యాయ ఉద్యమనాయకుడు, ఉపాధ్యాయులను ప్రజల కోసం నిలబెట్టడానికి నిరంతరం కృషి చేసిన ఉద్యమశీలి. ఉపాధ్యాయ వృత్తి నుండి రిటైర్ అయిన తర్వాత కూడా తన విప్లవ ప్రవృత్తిని వీడలేదు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రతి ప్రజా ఉద్యమంలో రాఘవులు సార్ పాత్ర ఉన్నదంటే అతిషయోక్తి కాబోదు. కరంట్ కష్టాలతో రైతులు రోడ్లమీదికెక్కి మిలిటెంట్ పోరాటాలు జరిపినప్పుడు సార్ వాళ్ళతో ఉన్నారు. మక్క జొన్నరైతులపోరాటం...తమ‌ సింగూరు జలాలను తమకు ఇవ్వాలన్న పోరాటం...నిజాంషుగర్స్ కంపనీని తిరిగి తెరవాలన్న పోరాటం...ఇలా ప్రతి పోరాటంలో సారున్నారు.
నిజాంషుగర్స్ లేఆఫ్ అనంతరం కర్మగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చే సుకుని నడపాలని డిమాండ్ చేస్తూ ఆయన నాలుగేళ్ల క్రితం ప్రజాసంఘాలతో కలిసి నిజాంషుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఆయనే కన్వీనర్. నిజాంషుగర్స్ కోసం ప్రజాసంఘాలు, జేఏసీ కలిసి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.

ప్రజాస్వామిక తెలంగాణకోసం ఆయన నిరంతరం స్వప్నించారు, అందుకోసమే పోరాడారు. వయసు మీదపడ్డా తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులుగా అలుపెరుగకుండా పని చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిజాబాద్ జిల్లాకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు.
ఈ నిరంతర పోరాట యోధుడు సోమవారంనాడు గుండె పోటుతో అమరుడయ్యాడు. మంగళవారంనాడు ఆయన స్వగ్రామం రుద్రూరులో వేలాది జనం మధ్య అంత్యక్రియలు జరిగాయి.
ఈ సందర్భంగా రాఘవులు సార్ గురించి పలువురు మాట్లాడారు.
ʹʹరాఘవులు సార్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి. అనారోగ్యం ఉద్యమ కార్యాచరణకు ఆటంకం కాదని ఆయన రుజువు చేశారు.
‍ నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం, తెలంగాణ‌
ʹʹమార్క్సిజం, లెనినిజం ఆలోచనా విదానంతో సమాజాన్ని చూసినవాడు రాఘవులు సార్, నిజాయితీతో, నిబద్దతతో ప్రజారాజకీయాలను ఎత్తిపట్టినవాడు పాలకులు ప్రజాఫ్రంట్ పై అనేక నిర్భందాలు పెట్టి, నాయకులను కార్యకర్తలను హత్యలు చేస్తామని బెధిరించినప్పటికీ రాఘవులు సార్ బెదరకుండా నాయకత్వ బాధ్యతలు చేపట్టినవాడుʹʹ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ

ʹʹరాఘవులు సార్ తో తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన అనుభవమున్నది. వయసు మీదపడ్డా ఆయన పోరాట స్పూర్తి మాకు ఆదర్శం పీడిత తాడిత ప్రజలకు రాఘవులు సార్ పెద్ద దిక్కు. సార్ కు నివాళులు అర్పించడం అంటే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడంʹʹ జర్నలిస్టు నాయకుడు జమాల్ పూర్ గణే ష్ అన్నారు

Keywords : telangana praja front, nizamabad, revolution, raghavulu, death
(2019-09-15 16:16:17)No. of visitors : 203

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
War and Peace in the Western Ghats
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.
కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం
more..


నిత్య