దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు


దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు

ఈ కాలంలో కూడా కులం ఎక్కడుంది..? కుల వివక్ష ఎక్కడుందని చాలా మంది మాట్లాడుతుంటరు. కాని రోజు దేశంలో ఎక్కడో ఒక చోట పరువు హత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. అగ్రకుల అమ్మాయిని ఒక దళితుడు పెండ్లి చేసుకుంటే.. ఆ అమ్మాయి తండ్రి ఒక ఎమ్మెల్యే.. అందులో బీజేపీ ఎమ్మెల్యే అయితే ఆ జంట ఎంత భయాందోళనకు గురవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడా జంట తమను కాపాడమని పోలీసులను వేడుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బిథారీ చేన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా. తను అజితేష్ అనే దళితుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో చెబితే తమను విడదీస్తారని భావించి ఆ జంట పారిపోయి వివాహం చేసుకున్నారు. ఇక ఆనాటి నుంచి అమ్మాయి తండ్రి వీరిపై వేధింపులు ప్రారంభించాడు. తన అనుచరులైన గూండాలను వారి వద్దకు పంపి బెదిరింపులకు దిగుతున్నాడు. ఆ జంట ఎక్కడకు వెళ్లినా ఈ గూండాలు వారిని వెంబడీస్తూనే ఉన్నారు. ఏక్షణంలో ఏం చేస్తారోనని ఆ జంట భయపడుతోంది.

పోలీసులకు మొరపెట్టుకున్న తమకు రక్షణ లేదని భావించిన ఈ జంట సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో సాక్షి మాట్లాడుతూ.. నాన్నా నేను అజిత్‌ను ఇష్టపూర్వకంగా పెండ్లి చేసుకున్నాను.. నేను ఎవరి ఒత్తిడికి లొంగలేదు. కాని మీరెందుకు ఇది అర్థం చేసుకోకుండా రోజూ గూండాలను మా దగ్గరకు పంపి బెదిరిస్తున్నారు..? వాళ్లకు మేం దొరికితే తప్పకుండా చంపేస్తారు. నాన్నా నన్ను చంపొద్దు.. దయచేసి మాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నానని వేడుకున్నారు. అజిత్ కూడా వీడియోలో మాట్లాడుతూ.. నేను దళితుడిననే మా వెంట పడుతున్నారు. ఇవాళ మా వెంట ఆ ఎమ్మెల్యే గూండాలు పడ్డారు. తృటిలో వారి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు.

తక్కువ కులం వాడిని ప్రేమించిందనే ఆ ఎమ్మెల్యే కోపం. తన కూతురు ఏమైపోయినా పర్యాలేదు.. నా పరువు పోయింది కనుక వారిని చంపాల్సిందేనని ఆ ఎమ్మెల్యే పగపట్టాడు. అసలే అధికార బీజేపీ పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు మాత్రం ఆ జంటను రక్షిస్తాయా..? ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాలో..!

Keywords : BJP, MLA, UP, Daughter, Sakshi Mishra, Ajitesh, Dalith, Couple
(2019-09-22 06:09:11)No. of visitors : 1509

Suggested Posts


0 results

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


దళిత