అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు


అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు

రెండు రోజులుగా ఈ ఖమ్మం సబ్ జైలు దగ్గర పడిగాపులు పడుతున్న ఈ చిన్నారులు అంజలి, సమీరా. అంజలికి 4 ఏండ్లు, సమీరాకు 2 ఏండ్లు. అమ్మ, నాన్నలను వదిలి ఎన్నడూ లేని ఈ చిన్నారులు ఇప్పుడు పది రోజులుగా అమ్మానాన్నలు లేకుండా గడుపుతున్నారు. అమ్మా అంటూ బోరున విలపిస్తున్న ఆ చిన్నారులను ఓదార్చడానికి తల్లీ తండ్రులు అక్కడ లేరు. జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నారంటే వాళ్ళేదో లక్షల కోట్లు ప్రజల సొమ్మును దోచినవాళ్ళు కాదు.... బ్యాంకులను ముంచిన వాళ్ళు కాదు... హత్యలు చేసినవాళ్ళు కాదు... మరెందుకు జైల్లో ఉన్నట్టు ?

వాళ్ళది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు గ్రామం తరతరాలుగా అడవితల్లినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసులు వాళ్ళు. వాళ్ళౌ పేర్లు కణితి రాజు, భద్రమ్మ. పోడు వ్యవసాయం చేయడం ఉన్నదాంట్లో అడవి తల్లి ఒడిలో ఆనందంగా బతకడమే వాళ్ళకు తెలిసింది. అడవి ఆదివాసుల హక్కు అని ఐక్యరాజ్య సమితి చెప్పినా అనేక తీర్పులున్నా...అడవి నుండి ఆదివాసులను విడదీసి ఆ అడవి గర్భాన ఉన్న ఖనిజ సంపదను కార్పోరేట్ల పరం చేయడంకోసం పాలకులు చేస్తున్న కుట్రకు వీళ్ళిద్దరూ ఇవ్వాళ్ళ జైల్లో ఉండడానికి లింక్ ఉంది.

ప్రభుత్వ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారనే అభియోగంతో ఈ నెల 2వతేదీ అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులు గుండాలపాడు గ్రామంపై దాడి చేశారు. ఆ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆదివాసులకు, కొందరు ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు... ఆదివాసులకు గాయాలైనందుకు ఫారెస్ట్ అధికారులపై ఎలాంటి కేసూ పెట్టలేదు కానీ అంజలి, సమీరా తల్లితండ్రులైన‌ కణితి రాజు, భద్రమ్మలతో సహా 12 మంది ఆదివాసులపై కేసులు బనాయించి ఖమ్మం సబ్ జైలుకు పంపించారు.

తల్లిదండ్రులు ఇద్దరూ జైలు పాలు కావడంతో ఇక ఇంట్లో కేవలం 4 ఏళ్ల‌ అంజలి, 2 ఏళ్ల‌ సమీరా మాత్రమే మిగిలారు. తల్లిదండ్రులను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని రెండేళ్ల సమీరా తల్లి కోసం తల్లడిల్లిపోతుంది. చుట్టుప‌క్క‌ల వారు.. ఆ పిల్లల పట్ల జాలితో తీసుకెళ్లి బోజనం పెట్టినప్పటికి ఆ చిన్నారులు ఇద్దరు కూడా తల్లిదండ్రులపై బెంగతో బోజనం కూడా సరిగా చేయడం లేదు. ఎవరు కనిపించినా... తమ అమ్మనాన్నలను చూడాలంటూ రోదిస్తూ అడుగుతున్నారు.

రెండు రోజుల నుండి ఖమ్మం సబ్ జైలు దగ్గర పడిగాపులుపడుతున్నారు. అరెస్టు చేసిన పోలీసులు కానీ , జైలు అధికారులు కానీ ఏ ఒక్కరినీ ఆ చిన్నారుల రోదనలు కదిలించలేకపోయాయి. ఈ విషయంపై ప్రతి రోజూ HMTV వార్తలు ప్రసారం చేయడం, ఆ ఛానల్ ప్రతినిధి నాగేందర్, సీపీఐ ఎం ఎల్ న్యూ డమాక్రసీ నాయకుళు రంగారావు తదితరుల చేసిన ప్రయత్నం వల్ల 9 రోజుల తర్వాత ఆ చిన్నారులిద్దరూ ఇవ్వాళ్ళ తల్లితండ్రులను కలుసుకోగలిగారు. ఆ చిన్నారులు తల్లి తండ్రులను చూసిన వెంటనే పరుగున వెళ్ళి కౌగలించుకోవడం, వాళ్ళిద్దరినీ అక్కునజేర్చుకొని ఆ తల్లితండ్రులు బోరుమనడం అక్కడున్నవాళ్ళందరినీ కంటతడి పెట్టించింది. ఆ దృశ్యాలు టీవీల్లో చూసిన వాళ్ళకు కూడా దుఖం రాక మానదు ఒక్క పాలకులకు తప్ప.

Keywords : adivasi, forest department, khmmam, police, jail
(2019-09-14 21:48:22)No. of visitors : 783

Suggested Posts


0 results

Search Engine

కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
War and Peace in the Western Ghats
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.
కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం
more..


అమ్మ‌