మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!


మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!

మారుతీరావునే

కులం.. కులం.. కులం.. ప్రస్తుతం దేశంలో అగ్రకుల అహంకారమే నడుస్తోంది. వారి అరాచకాలే పెచ్చుమీరిపోతున్నాయ్. మిర్యాలగూడ మారుతీరావు లాంటి వాళ్లు దేశంలోని ప్రతీ ఊరిలో.. ప్రతీ గల్లీలో కనపడుతూనే ఉన్నారు. దళితులను తమ ఇంటివాళ్లుగా చేసుకోవడానికి మనసొప్పక ఏకంగా హత్యలు చేస్తున్నారు. మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయిస్తే.. ఈ గుజరాతీ మారుతీరావు ఏకంగా పోలీసుల ముందే అల్లుడిని తెగనరికాడు.

గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో వర్సమోడీ అనే గ్రామానికి చెందిన హరేష్ సోలంకి ఒక దళితుడు. అహ్మదాబాద్ సమీపంలోని వార్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిళ అనే యువతి రాజ్‌పుత్ కులానికి చెందింది. వీళ్లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఊర్మిళ గర్భవతి కావడంతో రెండు నెలల క్రితం ఆమె పుట్టింటికి వచ్చింది. ఆమెను తీసుకెళ్లాలని హరేష్ అనుకున్నాడు. అయితే వాళ్ల పుట్టింటి వాళ్ల ఇబ్బంది పెడతారేమోనని ముందుగానే ఊహించిన హరేష్ మహిళా సహాయ కేంద్రాన్ని సంప్రదించాడు.

గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ʹఅభయంʹ సహాయ కేంద్రానికి వెళ్లి పూర్తి విషయం వివరించాడు. అక్కడి సిబ్బంది.. సరే మీ భార్యను మేం తీసుకొని వస్తామని చెప్పారు. దానికి హరేష్.. మీరు వెళ్లిగా ఆ గ్రామంలో ఎవరూ కూడా మీకు ఆ ఇంటి అడ్రస్ చెప్పరు.. ఆ ఊరిలో మా మామయ్య దశరథ్ సిన్హా చాలా పలుకుబడిన వ్యక్తి,, కాబట్టి మీతో పాటు నేను వస్తానని చెప్పాడు.

దీంతో హరేష్‌తో పాటు ఒక మహిళా కానిస్టేబుల్, అభయం కౌన్సిలర్ భవిక కలసి అక్కడికి వెళ్లారు.

హరేష్ పోలీసు కారులోనే ఉండగా.. భవిక, కానిస్టేబుల్ కలసి దశరథ్ సిన్హా ఇంటిలోకి వెళ్లి మాట్లాడారు. మరో నెల రోజుల్లో నా కూతురుని పంపుతానని చెప్పడంతో వాళ్లు వెనుదిరిగారు. వారితో కలసి బయటకు వచ్చిన దశరథ్ కారులో హరేష్ ఉండటం చూశాడు.

వెంటనే బిగ్గరగా కేకలు వేస్తూ.. "నా బిడ్డను తీసుకెళ్లింది ఒక హరిజనుడు. అతడు డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. అతన్ని బయటకు లాగి చంపేయండి" అని అనుచరులకు చెప్పాడు. వెంటనే ఎనిమిది మంది వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో కారును చుట్టు ముట్టి హరేష్‌ను విచక్షణా రహితంగా నరికారు.

ఆ సమయంలో పోలీసు కానిస్టేబుల్ ఉన్నా.. తాను నిరాయుధురాలు కావడంతో ఏం చేయలేక పోయింది. భవిక వెంటనే బలగాలు పంపమని పోలీసులకు చెప్పడంతో సాయుధులైన వారు అక్కడికి చేరుకున్నారు. కాని అప్పటికే హరేష్ చనిపోయాడు.

కేవలం ఒక హరిజనుడిని పెండ్లి చేసుకుందనే కోపంతో.. అప్పటికీ కూతురు గర్భవతి అని కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా అల్లుడిని చంపడం గుజరాత్‌లో సంచలనం సృష్టించింది.

Keywords : Maruti Rao, Caste, Gujarat, Dasharath Sinha, Rajputh, Dalith
(2019-09-22 04:39:36)No. of visitors : 2093

Suggested Posts


0 results

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


మారుతీరావునే