యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ


యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ

యోగీ

ఉత్తర ప్రదేశ్‌లోని దేవరియా జిల్లా నుంచి నక్సలైట్లతో సంబంధం వున్నదని చెప్పి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2019 జులై 8 ఉదయం ఎత్తుకెళ్లిన నలుగురిలో ఒకరైన కృపా శంకర్ (అఖిల భారత హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక కన్వీనింగ్ కమిటీ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ సభ్యులు, ఉత్తర ప్రదేశ్ నుండి వెలువడే విరుద్ధ్ వార్తా పత్రిక సంపాదకులు) మీడియాకు ఇచ్చిన ప్రకటన సంక్షిప్త సారాంశం.

మమ్మల్ని ఎత్తుకెళ్లిన సంఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ఏటిఎస్ చెబుతున్న వివరాలు వాస్తవ విరుద్ధంగా వున్నాయి. హిందుత్వ ఫాసిస్ట్ దాడి వ్యతిరేక వేదిక కన్వీనింగ్ కమిటీ మరియు ఆ కమిటీ ఆల్ ఇండియా కౌన్సిల్‌లో సభ్యుడిగా వున్న నేను జులై 5, 6, 7 తారీఖుల్లో జరిగిన కమిటీ సమావేశాలలో పాల్గొనడానికి పాట్నా వెళ్ళాను. జులై 7 సాయంత్రం సమావేశం పూర్తయిన తరువాత పాట్నా నుంచి బయలుదేరి దేవరియాలో వున్న మా ఇంటికి దాదాపు రాత్రి పది గంటల సమయంలో చేరుకున్నాను. మేము దేవరియాలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాము. నా జీవన సహచరి బిందా ఒక ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. నేను రావడం ఆలస్యం అవుతుందని ఇంటి ఓనర్ దగ్గర గేటు తాళం చెవి తీసుకుంది.

తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో మేము నిద్రపోతున్న సమయంలో గేటు కొడుతున్న శబ్దం వినపడింది. తాళం చెవి మా దగ్గర ఉంది కాబట్టి ఇంటి ఓనర్ చుట్టాలు ఎవరైనా వచ్చారేమోనని మేమే గేటు తీయడానికి వెళ్లాము. గేటు తెరుస్తూనే దాదాపు 30 మంది ఏ టి ఎస్, ఏ పి ఎస్ ఐ బి మరియు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఇంటిలోకి చొచ్చుకొని వచ్చారు. వారిలో కొంతమంది పోలీసు యూనిఫాంలో ఉంటే మరికొంతమంది సివిల్ దుస్తుల్లో ఉన్నారు. ఎవరని అడిగితే లక్నో ఏ టి ఎస్ టీం కి చెందినవాళ్ళమని చెప్పారు. మమ్మల్ని ఎత్తుకెళ్లడంలో యు పి ఏటిఎస్ టీంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఐబి కి కూడా ముఖ్య పాత్ర ఉన్నది. ఏపి ఎస్ఐబి వాళ్ళు కూడా ఏటిఎస్ వాళ్ళతో కలిసి వచ్చారు.

ʹనక్సలైట్లతో మీకు సంబంధం ఉన్నదనే సమాచారం అందింది అందుకని మీ ఇంటిని సర్చ్ చేస్తున్నాముʹ అని ఏటిఎస్ అడిషనల్ ఎస్పి అన్నాడు. ఇంటిని నలుమూలలా క్షుణ్ణంగా సోదా చేశారు. మా మొబైల్, ల్యాప్ టాప్, కార్డ్ రీడర్, పెన్ డ్రైవ్, డోంగల్, కొన్ని పుస్తకాలు, మరన్నో కాయితాలను స్వాధీనం చేసుకొన్నారు.

తెల్లవారు ఝామున నాలుగు గంట్లకు నాతోనూ, నా జీవన సహచరి బిందాతోనూ వ్యవహరించిన తీరును నేను అపహరించడమే అంటాను. ఎలాంటి వారంట్ లేకుండా మా ఇంటిని సోదా చేసారు. రాజ్యాంగం ప్రకారం వున్న వ్యక్తిగత ప్రాధమిక హక్కులను హరించివేశారు.

మమ్మల్ని అపహరించి దేవరియా పోలీస్ లైన్‌కి తీసుకువచ్చారు. కొంచెం సేపట్లోనే దేవరియాలోని మజ్దూర్ కిసాన్ ఏకతా మంచ్‌కి చెందిన బ్రిజేష్, అతని జీవన సహచరి, సావిత్రి బాయి ఫూలే సంఘర్ష్ సమితిలో వున్న ప్రభాను కూడా అపహరించి పోలీస్ లైన్‌కు తీసుకు వచ్చారు. మాకు జరిగినట్లే వారికి కూడా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అక్కడే ఒక టెక్నికల్ టీం మా నలుగురి డిజిటల్ ఉపకరణాలు మొబైల్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లను పరీక్షించడంలో నిమగ్నమైంది.

ప్రశ్నించడంలో భాగంగా క్రితం రోజు భోపాల్‌లో అరెస్టు అయిన మనీష్, అమితలతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అని అడిగారు. మనీష్‌తో గోరఖ్‌పూర్‌లో చదువుతున్నప్పటినుంచి పరిచయం ఉన్నదని చెప్పాను. అతను ఒక మంచి వ్యక్తి, సామాజిక కార్యకర్త. అమిత అతని భార్య.

ప్రశ్నించడం పూర్తి అయ్యాక జులై 8 రాత్రి పదిన్నరకు ʹమీ దగ్గర ఏమీ ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి ఇప్పుటికి మిమ్మల్నివదిలేస్తున్నాము. 12వ తారీఖు పొద్దున్న పది గంటలకు లక్నో ఏటీఎస్ హెడ్‌క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలిʹ అని చెప్పి మమ్మల్ని పంపించివేశారు.

కాన్పూర్ నుంచి కూడా ఇద్దరినీ ఎత్తుకెళ్లారని తెలిసింది. వారిలో ఒకరు దినేష్, మరొకరి పేరు తెలియదు.

ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులు యూనిఫాంలోనూ, సివిల్ దుస్తుల్లోనూ సాయుధంగా వచ్చి, తెల్లవారు ఝామున మమ్మల్ని అపహరించడాన్ని చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యంకానీ, చట్టాలు కానీ పనిచేయడం లేదని తెలుస్తోంది. ఇలా అపహరించడం అంటే రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన మా ప్రాధమిక హక్కులను బహిరంగంగా అపహరించివేయడమే. ఇలా ఏటిఎస్ మమ్మల్ని అపహరించడమనేది మా వ్యక్తిగత హక్కులను హరించివేసే ఒక నేరపూరిత చర్య.

ఇలా జరగడం వల్ల చుట్టు పక్కల వున్న వారు మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు. సామాజిక ఒత్తిడి వల్ల ఇంటి ఓనర్ మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. మేము ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాము. బస్తీలో, బంధువులలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

యుపి ఏటిఎస్, ఏపి సిఐబి, పోలీసు యంత్రాంగం చేసిన ఈ పిరికి పంద చర్యకు వ్యతిరేకంగా ఒక పిటీషన్‌ను డిజిపితో సహా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, బి‌సి కమిషన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్, మహిళా కమిషన్, సుప్రీం కోర్ట్, అలహాబాద్ హైకోర్ట్ కు పంపించాము. మా రాజ్యాంగ పరమైన హక్కులకు రక్షణ కల్పించాలనీ, దోషులపై విచారణ జరపాలనీ, మాకు న్యాయం కలిగించాలని కోరాము. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో సహా రాజకీయ కార్యకర్తలపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు, ప్రజలందరూ దృఢంగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

కృపాశంకర్, కన్వీనింగ్ కమిటీ మెంబర్, మొబైల్ నం. 75718 26749

Keywords : uttara pradesh, maoists, arrest, police
(2019-09-15 14:50:57)No. of visitors : 416

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

గూండాలను అరెస్టు చేసినందుకు యోగీ సర్కార్ ఆమెను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఝలక్‌ ఇచ్చిన‌ పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్ ను యోగీ సర్కార్ అడవుల్లోకి బదీలీ చేసింది.. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది....

నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?

మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన....

Search Engine

కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
పేదోళ్లుగా పుట్టడమే కాదు.. చావడం కూడా నేరమే..!
ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
War and Peace in the Western Ghats
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.
కుల రహిత - మత రహిత అస్తిత్వం కోసం
more..


యోగీ