ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ


ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ

ʹనక్సలైట్ల

నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ యూపీలోని దేవరియా జిల్లాలో ఈ నెల 8న యూపీ, ఏపీ పోలీసులు అక్రమంగా నిర్బంధించిన నలుగురిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్. నారాయణరావు, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శేషయ్యలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అఖిల భారత హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికలో వీరు సభ్యులని.. వీరిపై యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.

అబద్ద ఆరోపణలు చేసి చట్టవిరుద్దంగా అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడి చేయడం వల్ల వీరిని అందరూ అనుమానంగా చూస్తున్నారని.. ఇంటి యజమాని కూడా సామాజిక ఒత్తిడితో ఇంటిని ఖాళీ చేయమని అడుగుతున్నారని.. వీనికి పోలీసుల వైఖరే కారణమని వారు చెప్పారు. ఇప్పటికే ఈ దాడి చట్టానని ఉల్లంఘించి జరిగిందని తెలియజేస్తూ ఒక పిటిషన్‌ను యూపీ డీజీపీ సహా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, బీసీ కమిషన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్, మహిళ కమిషన్, సుప్రీంకోర్టు, అదిలాబాద్ హైకోర్టుకు పంపించామని వారు పేర్కొన్నారు. వీరికి రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులకు రక్షణ కల్పించి.. దోషులపై విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని వారు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే సామాన్యులతో పాటు రాజకీయ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని.. వీటికి వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు, ప్రజలు అండగా నిలబడాలని వారు ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ కూడా తీవ్రంగా ఖండించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు.

పౌర హక్కుల సంఘం పూర్తి ప్రకటన కింద చదవండి

Keywords : UP, Police, AP Police, Devariya, Maoists, Naxlites
(2019-12-15 00:22:18)No. of visitors : 649

Suggested Posts


0 results

Search Engine

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
more..


ʹనక్సలైట్ల