ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!


ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!

ఏపీ

జగన్ గారూ,

ఆ 23 మంది గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మీ పుణ్యాన మా హక్కుల్ని కాలరాచిన వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సి వస్తోంది. మాట్లాడితే 23 అంటారు. మీరు గెలిచారు సరే. ఆ 23 మంది కూడా పాపం మీ లాగే డబ్బు ఖర్చు పెట్టుకొని, ఓట్ల కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళూ మీ జాతి వాళ్ళే. మీ పద్ధతిలో గెలిచారు కనకనే అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు. కానీ మిమ్మల్ని, మీ వాళ్ళను కోరుకున్నట్లుగా, 23 నియోజకవర్గాల్లో ఓటు వేసిన వారిలో మెజారిటీ ప్రజలు వాళ్ళ కోసం బటన్ నొక్కారు. మీ జాతి వాళ్ళనే మీరు పురుగుల్లా చూస్తున్నారే. రా, చూసుకుందాం అంటారు. మేం లేస్తే మీరు పారిపోతారు అంటారు. మెజారిటీ బలం ఇందుకేనా? అసెంబ్లీలో మైనార్టీని లెక్క చెయ్యని మీరు ఇక నోరు లేని, ముఖం లేని జనాన్ని ఏం చూస్తారు? అందుకే, మూడు రోజులుగా మీ ఇంటికాడ ఆందోళన చేస్తున్న జనం మీ కళ్ళకు ఆనలేదు.

మేం లేస్తే మీరు పారిపోతారు అంటున్నారు. పారిపోకపోతే తరుముతున్నారు. పులివెందుల గ్రామాల లాగానే, రాష్ట్రంలో చాలా గ్రామాలున్నాయి. జనం ఎవరో ఒకరి పంచనో చెరకపోతే బతకలేరు. పించన్ కావాలన్నా, వాచ్ మెన్ పని కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఏ నాయకున్నో ఆశ్రయించక తప్పదు. ఎవరి దగ్గర పని జరుగుతుందో వాళ్ళ దగ్గరికే పోతారు. మీ వాళ్ళూ అంతేగా! ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీలోకి చేరిపోతారు. అట్లా ఆశయించిన మామూలు జనాన్ని తరుముతున్నారే! మీరు సాధించిన మెజారిటీ అవతలి పార్టీ అశ్రితుల్ని తరమడానికి, వాళ్ళు పొందుతున్న అతి స్వల్ప ప్రయోజనాలను లాక్కోడానికి పనికొస్తోంది. మీరేమో అసెంబ్లీలో, మీ తమ్ముళ్లేమో ఊర్లల్లో.. రాజన్న రాజ్యాన్ని బాగా నెలకొల్పుతున్నారు. విషాదమేమిటంటే గెలిచినా, ఓడినా గొప్పోళ్ళు మీరు మీరుగానే ఉంటారు. బుద్ధిలేక, గత్యంతరం లేక మీ పంచన చేరినవాళ్ళు చస్తారు. మీరిట్లాగే అరుస్తుంటే చంద్రబాబు అసెంబ్లీ నుండి వాకౌట్ అంటాడు. మీలాగే ఊళ్లు పట్టుకొని తిరుగుతాడు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటాడు. ఏమైనా మీమీ డెమాక్రసీలకు జరిగే డామేజ్ పెద్దగా ఉండదు. జనం మాత్రం బతుకు తెరువులు, బతుకులు కోల్పోతారు.

మీ కాన్వాయ్ అంబులెన్స్‌కు దారి ఇవ్వడమే మాకెంత మురిపెమో. ఒక అత్యవసర పౌరధర్మం సి.యం. అంతటివాడు పాటించాడు చూడండి అని చెప్పుకుంటున్నారు. తమను తాము ఎంతో అల్పజీవులం అనుకునే ప్రజలు పాపం. నిజమే. నెలకింత పించన్ దానం చేసే గోప్పోల్లకు దాన్ని మహాప్రసాదంగా అందుకొనే ప్రజలు కనిపిస్తారా? అసెంబ్లీలో మిమ్మల్ని చూసి భయమేసింది. ʹఅయితే ఏంటిʹ అని తలెగరేసే మీ నాయన కన్నా ఇంకా భయంకరంగా కనపడుతున్నారు మీరు. ఇలాంటి తలపొగరు జనాన్ని ఏం చేస్తుందా అని భయం.

చంద్రబాబు తక్కువ చేసాడా అంటారు. లేదు. అక్కడ ఆయన మీమీద గుడ్లురిమి చూసిందానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జనం మీద జులుం చేసాడు. మెజారిటీ బలం ఉందని ఎవర్నీ మాట్లాడనివ్వలేదు. జనాన్ని కనీసం ఏడవనివ్వలేదు. తమ గోడు వేల్లబోసుకోనీకి ధర్నా చేయడానిక్కూడా లేదన్నాడు. పోలీస్ స్టేషన్ కు పోయి మాకు ఫలానా సమస్య ఉంది, మేం ఏడవచ్చా అండీ అని పర్మిషన్ తీసుకోవాలని ఆర్డర్ వేసాడు. ఇప్పుడు వయసు కన్నా గౌరవమివ్వమని ఏడ్చే స్థితికొచ్చాడు. ఇప్పుడు మీది ఇంకా పెద్ద మెజారిటీ. అంటే ఇంకా ఎక్కువ అధికారం. కాబట్టి ఇది చంద్రబాబు మీదో, ప్రతిపక్షం మీదో సానుభూతి కాదు. అంతకంతకూ విశృంఖలమవుతున్న ʹఅధికారంʹ గురించి ఆందోళన.

ఇట్లు

మాటిమాటికీ ప్రజాస్వామ్యం గుర్తుచేసే మూర్ఖులు
అభివృద్ధి నిరోధకులు
అర్బన్ నక్సలైట్లు

- పి. వరలక్ష్మీ, విరసం.
(ఫేస్‌బుక్ పోస్టు)

Keywords : YS Jagan, AP CM, Chandrababu, Assembly, Urban Maoists
(2019-12-14 02:10:52)No. of visitors : 3001

Suggested Posts


0 results

Search Engine

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
more..


ఏపీ