ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌


ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌

ఆ

(అమరుల బంధుమిత్రుల సంఘం సభల సందర్భంగా ప్రచురించిన కరపత్రం )

శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం యాభై ఏళ్ల సందర్భంగా..

రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర

సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి

జూలై 18, 2019, గురువారం మధ్యాహ్నం 2.00గంటల నుంచి రాత్రి 9.00 దాకా సభ‌

ఈ ఏడాది అమరుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ దినం జూలై 18న శ్రీకాకుళ ఆదివాసి, రైతాంగ సాయుధ పోరాటం యాభై ఏళ్ల సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. 1967 అక్టోబర్ 31న కోరన్న, మంగన్నల అమరత్వంతో సాయుధ మార్గాన్ని శ్రీకాకుళ పోరాటం స్వీకరించింది. 27 మే 1969న జరిగిన తొలి బూటకపు ఎన్ కౌంటర్లో పంచాది కృష్ణమూర్తి, తామాడ చినబాబు, శృంగారపు నరసింహులు, దున్న గోపాల్రావు, పాపారావు. నిరంజన్రావు, రాంచంద్ర ప్రధాన్ అమ‌రులయ్యారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి ఇవ్వాల్టి దాకా దేశవ్యాప్తంగా విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరులందరినీ స్మరించుకుందాం. అమరులను స్మరించుకోవడమంటే కేవలం గుండె బరువు దించుకోవడం మాత్రమే కాదు. అద్భుతమైన మనుషులను అమానుషంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ రాజ్యహింస వ్యతిరేకతను తెలియజేయడమే. అందుకే అమరుల బంధు మిత్రుల సంఘం ప్రతి ఏటా తన ఆవిర్భావ దినమైన జూలై 18ని రాజ్యహింసకు వ్యతిరేకంగా నిర్వహిస్తోంది. ఈసారి శ్రీకాకుళ పోరాటం యాభై ఏళ్ల స్ఫూర్తితో రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర అనే అంశంపై సభను నిర్వహిస్తున్నాం. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం, అందులోని త్యాగం తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. నక్సల్బరీ పంథాను బలంగా ముందుకు తీసుకెళ్లడంలో శ్రీకాకుళ పోరాటం పాత్ర గణనీయంగా ఉన్నది. అందుకే నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటాలనే మాట భారత దేశ ప్రజా పోరాటాల చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది. ఒక పోరాట మార్గంగా రుజువై శ్రీకాకుళం విముక్తి ప్రాంతంగా మారుతోందనే ఆశను రగిల్చింది. అనేక కారణాల వల్ల శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం అంతులేని నష్టాలతో, రక్త తర్పణతో పూర్తిగా దెబ్బతినిపోయింది. అయినా భారత విప్లవోద్యమానికి శ్రీకాకుళం వేగుచుక్కలా నిలిచింది. శ్రీకాకుళ పోరాటం అందించిన విప్లవ ఉత్తేజం, పోరాట సంస్కృతి, త్యాగాల చాలు లేకుండా ఇవాళ దండకారణ్య విప్లవోద్యమం లేదు. ఆంధ్ర ఒడిషా పోరాటాలు లేవు. గత యాభై ఏళ్లుగా మధ్య, తూర్పు భారతదేశ విప్లవోద్యమాలు, పశ్చిమ కనుమ‌ల ట్రై జంక్షన్ పోరాటాలు లేవు.

ఇందుకే శ్రీకాకుళం పోరాటం కేవలం దెబ్బతినిపోయిన పోరాటం మాత్రమే కాదు. అదొక పోరాట పంథా, వందలాది మంది ప్రాణత్యాగలతో ఆ పోరాట మార్గం ప్రజల ఆచరణలోకి వచ్చింది. ఆ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతోంది. త్యాగం వృథాపోదు, త్యాగం లేకుండా విప్లవం రాదు.. అనే నినాదం నిజమైంది. సమాజాన్ని మౌలికంగా మార్చాలంటే కచ్చితమైన రాజకీయ‌ పంథా ఉండాలని, దాన్ని ఆచరించే క్రమంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధం కావాలని విప్లవకారులు నిరూపిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ప్రజాస్వామిక పోరాటాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణమైన అణచివేత ప్రయోగిస్తున్నాయి. కశ్మీర్ దగ్గరి నుంచి పశ్చిమ కనుమల దాకా పోరాట ప్రాంతాలపై లక్షలాది సైన్యం యుద్ధం చేస్తోంది. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ దళితులు, ముస్లింలు, ఆదివాసుల పక్షాన నిలబడ్డ ప్రజాస్వామిక వాదుల పైన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి. అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయడమే కాక దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజాస్వామిక వాదులను, రచయితలను గత ఐదారేళ్లలో ప్రభుత్వం హత్య చేసింది. హిందుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న దళిత, బహుజన ఉద్యమకారులు, జర్నలిస్టులు, కళాకారుల అందరిపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. హత్యాయత్నాలు చేస్తున్నారు. అయినా దేశంలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నారు. అర్చన్ మావోయిస్టులనే ఆరోపణ చేసి ప్రజాస్వామికవాదులను అక్రమంగా జైళ్లలో పెట్టారు. అమరుల కుటుంబానికి కూడా చెందిన ప్రొ. సాయిబాబాకు, ఆయనతోపాటు హేమ్ మిశ్రా, ప్రశాంత రాహి మరిద్దరికి చేయ‌ని నేరానికి యావజ్జీవ శిక్ష విధించారు. సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. అలాగే అమరుల కుటుంబాలకు అండగా ఉంటున్న వరవరరావును, మిగతా రాష్ట్రాల్లో ఇక్కడి ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు సన్నిహిత మిత్రులుగా ఉంటున్న సుధాభరద్వాజ్, ప్రొ. షోమ సేన్, వెర్నన్ గొంజాల్వేజ్, అరుణ్ ఫెరేరా, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, మ హేష్ రౌత్ లను పూణే ఎరవాడ జైల్లో నిర్బంధించారు. ఈ మేధావుల్లో చాలా మంది పోరాట ప్రాంతాల్లో అమరుల కుటుంబాలపై జరుగుతున్న రాజ్యాహింసపై మాట్లాడుతున్నారు.ఇప్పుడు అలాంటి వాళ్లు జైళ్లలో ఉన్నారు. నూతన సమాజ నిర్మాణం కోసం త్యాగం చేసిన వారి అమరత్వాన్ని కీర్తించడం మానవీయమైన విషయం. సమాజాన్ని అమానవీయంగా తయారు చేస్తున్న రాజ్యం అమరవీరుల త్యాగాలను ఎత్తిపట్టిన చేతులకు సంకెళ్లు వేస్తోంది.

ఈ పోరాటాలను ముందుకు తీసికెళ్లడంలో మహిళలు చాలా ముందు భాగాన ఉన్నారు. ముఖ్యంగా విప్ల‌వోద్యమంలో చాలా పెద్ద ఎత్తున క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. విప్లవోద్యమంలోని అన్ని రంగాల్లో నాయకత్వ స్థానానికి ఎదిగారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి ఎందరో మహిళలు గెరిల్లా అమ్మ‌లుగా ఎదిగి ఆదర్శప్రాయమైన పాత్ర పోషించారు. నక్సల్బరీ పోరాటంతో ఈ ఒరవడి మరింత పెరిగింది. ఇటీవల ఎన్ కౌంటర్లలో అమరులవుతున్న మహిళల్లో, బిడ్డ‌ల్ని వదిలి విప్లవోద్యమంలోకి వెళ్లిన తల్లులు ఉన్నారు. అనాటి పంచాది నిర్మల మొదలు నేటి భారతక్క కామేశ్వరిలాంటి తల్లులు వీర గెరిల్లాలుగా మారారు. వీళ్లు చేస్తున్న త్యాగాలు మొత్తంగా మహిళా విముక్తికి దారి చూపిస్తున్నారు.

విప్లవోద్యమం, ఇతర ప్రజాపోరాటాలు అణచివేతను ఎదుర్కొంటూనే ముందుకు పురోగమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొనసాగుతున్న నిర్బంధం ఇంతకు ముందటి నిర్బంధంలాంటిది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న ఆపరేషన్ సమాధాన్లో భాగంగా రాజ్యహింస పెరిగిపోయింది. హిందూ ఫాసిస్టు దుర్మార్గంలో భాగం ఇది. భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీలో భాగమే ఈ అణచివేత. గత ఏడాది జులై 18 తర్వాత విశాఖ ఏజెన్సీలో భూషణం, సిడారి జమదార్ అనే ఆదివాసులు వేటకు వెళ్తే పోలీసులు కాల్చి చంపారు. దాన్ని ఎన్కౌంటర్గా చిత్రించారు. తెలంగాణలో రాజ్ కుమార్ ను, ఏవోలో మీనా, కామేశ్వరి, బిడ్డిక లక్ష్మి, దాసు, గీత, కృష్ణను బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపారు. వీరు కాక అనేకమందిని ఇతర రాష్ట్రాలలో రాజ్యం హత్య చేసింది. ఫాసిస్టు అణచివేత చుట్టుముట్టిన సమయంలో ప్రజాసంఘాలు తమ కర్తవ్యాలను మరింత గట్టిగా నిర్దేశించుకోవాలి. ఈ అవగాహనతో ఈసారి అమరుల బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ దినాన్ని శ్రీకాకుళ పోరాటం 50 ఏళ్ల సందర్భంలో అప్పటి నుంచి కొనసాగుతున్న త్యాగాల పరంపరను గుర్తు చేసుకుంటోంది. అమ‌రులను స్మరించుకోవడం అంటే రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కోవడమే. ఈ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం.
- అమరుల బంధుమిత్రుల సంఘం

Keywords : srikakulam, martyrs, maoists, naxalites, naxalbari
(2019-12-14 10:10:13)No. of visitors : 615

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

Search Engine

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
more..


ఆ