తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి


తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి

తనకు

పిల్లలు తమ సొంత ఆస్తి అని భావించి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే తల్లిదండ్రులు మనకు అడుగడుగునా కనపడుతుంటారు. తమ భావాలను వారిపై రుద్ది.. ఎదురు తిరిగితే హింసించడం పరిపాటిగా మారింది. మేం కన్నాం కాబట్టి మా మాట వినాలి.. మేం పెంచాం కాబట్టి మేం చెప్పినట్లు చేయాలనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. చివరకు ఇది పిల్లలను చంపుకునేవరు వెళ్లింది.

తనకు ఇష్టంలేని పెండ్లి చేసుకుందనే కోపంతో గర్భంతో ఉన్న కూతురుని చంపేశాడు ఒక తండ్రి. ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఉండే రాజ్‌కుమార్‌కు మీనాక్షి అనే కూతురు ఉంది. ఆమెకు పెండ్లి చేయాలనుకొని రెండు సంబంధాలు చూశాడు. అయితే తాను బ్రిజేష్ అనే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. తండ్రి వ్యతిరేకించడంతో బ్రిజేష్‌తో కలసి మధ్యప్రదేశ్‌లోని సాత్నా అనే ఊరికి వెళ్లిపోయింది.

ఆ జంట అక్కడే పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు మీనాక్షి గర్భం దాల్చింది. ఈ విషయం తండ్రి రాజ్‌కుమార్‌కు తెలిసి కూతురుకి బట్టలు పెడతా ఇంటికి రమ్మన్నాడు. తండ్రి మారాడనుకొని ఇంటికి వెళ్లింది. కూతురు ముందు కావాలనే డబ్బులు పడేసి తీయమని కోరాడు. ఆమె డబ్బులు తీయడానికి కిందకు వంగగానే కత్తితో దారుణంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కూతురుని హత్య చేసిన అనంతరం రాజ్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు తర్వాత అదుపులోనికి తీసుకున్నారు.

కూతరు ఇంట్లోంటి వెళ్లిపోయి తన పరువు తీసిందనే కోపంతోనే ఈ హత్య చేశాడని స్థానికులు అంటున్నారు. కాని గర్భవతి అని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Keywords : daughter, honor killing, mumbai, ghatkooppar, murder, meenakshi, rajkumar
(2019-08-22 04:08:30)No. of visitors : 493

Suggested Posts


0 results

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


తనకు