మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు వరవర రావుతో సహా 9 మంది రాజకీయ ఖైదీల లేఖ‌


మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు వరవర రావుతో సహా 9 మంది రాజకీయ ఖైదీల లేఖ‌

మహా

మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్ గారికి,

మేము సంవత్సర కాలంగా పుణెలోని యరవాడ సెంట్రల్ జైలులో జుడిషియల్ కస్టడీలో నిర్బంధించబడి ఉన్నాము. మాలో ఐదుగురిని పుణెలోని శనివార్ వాడలో జరిగిన ఎల్గార్ పరిషద్ సభ సందర్భపు నేరారోపణపై 2018 జూన్ 6న అరెస్టు చేశారు. మరొక నలుగురిని 2018 ఆగస్ట్ 28న అరెస్టు చేశారు. మామీద 2018 జనవరి 1న భీమాకోరేగాంలో జరిగిన హింసాకాండకు రెచ్చగొట్టే నేరపూరిత కుట్ర చేశామనే ఆరోపణలు, రెండు వర్గాల మధ్య ద్వేషాన్నీ శత్రుత్వాన్నీ రెచ్చగొట్టామనే ఆరోపణలు, రాజద్రోహం, దేశవ్యతిరేకత వగైరా అనేక నేరాలు ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు.

దేశమంటే ప్రజలు అనే అర్థం చెప్పుకునేట్టయితే ఒక దేశపు ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, తమలాగే ఆలోచించడానికి ఇతరులను ప్రభావితం చేయడం దేశ వ్యతిరేక చర్య ఎలా అవుతుంది? ఎల్గార్ పరిషద్ సభలో ఉపన్యాసాలతో, ప్రేరణ కలిగించే పాటలతో, నాటకాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పూనుకొమ్మని శ్రోతలను రెచ్చగొట్టామనడం నిజం కాదు. అందుకు భిన్నంగా, రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్నీ పరిరక్షించడంలో భాగంగా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాడమని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వోటు వేయవద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ పని చేసినందువల్లనే మాపై ఇప్పుడు కల్పిత నేరాలు ఆపాదిస్తున్నారు. అంటే మాకు వ్యతిరేకంగా తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.

బెయిలే సాధారణమనీ, జైలు కాదనీ సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు ఉన్నప్పటికీ మా బెయిల్ దరఖాస్తుల వ్యవహారాన్ని ప్రాసిక్యూషన్ అంతులేకుండా సాగదీస్తున్నది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, దర్యాప్తు అధికారి ఈ మొత్తం కేసును బహిరంగ పత్రికా విచారణలా జరిపినట్టుగానే, మా బెయిల్ విచారణ కూడ ఒక చిన్నపాటి పత్రికా విచారణలా మార్చబడింది.

మావోయిస్టులతో సాగాయని ఆరోపించబడుతున్న ఇమెయిళ్లను ప్రాసిక్యూషన్ స్వేచ్ఛగా పత్రికల్లో ప్రచురిస్తున్నది. కాని అందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను నిందితులకు ఇవ్వడానికి మాత్రం ఏడాదిగా తాత్సారం చేస్తున్నారు. ఈ వాస్తవమే ప్రాసిక్యూషన్ ఉద్దేశాల పట్ల మాలో అనుమానాలు రేకెత్తిస్తున్నది.

ఈ రకంగా రాజకీయ ఖైదీలను జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోయేలా చేస్తున్నారు. ʹఅందరికీ న్యాయంʹ ʹతగిన సమయంలో న్యాయంʹ అనే మౌలిక సూత్రాలను సూటిగా ఉల్లంఘిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ʹసబ్ కా సాథ్ సబ్ కా వికాస్ʹ తన నినాదంగా ప్రకటించింది. కాని గత ప్రభుత్వాల పనితీరును చూస్తేనే ఈ నినాదం వాస్తవంగా అమలు లోకి వస్తుందా అని అనుమానించడానికి ఆస్కారం ఉంది.

ప్రభుత్వం గనుక అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనదలచుకుంటే, అది మొట్టమొదట రాజ్యాంగం పట్ల తన విధేయతను నిరూపించుకోవాలి. ఆ రాజ్యాంగం మీదనే ఆధారపడి పనిచేయాలి. అది జరగాలంటే అది అందరికీ సమన్యాయం అందించాలి. భిన్నాభిప్రాయాలనూ, ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలనూ, విమర్శనాత్మక భావాలనూ అన్నిటినీ తొక్కివేయడం, ప్రత్యర్థులందరినీ దేశద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రించి అరెస్టు చేయడం కచ్చితంగా భావప్రకటనా స్వేచ్ఛ మీద దాడి మాత్రమే.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో, దేశవ్యాప్తంగా ఆవు పేరు మీద మనుషులను కొట్టి చంపడం ప్రారంభమైంది. ఇటువంటి హింస పట్ల ప్రభుత్వం మౌనంగా ఉండడం మాత్రమే కాదు, నాథూరామ్ గాడ్సేను బహిరంగంగా సంస్మరిస్తూ ద్వేషాన్ని, శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్న మతోన్మాద శక్తులను అరికట్టడానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందువల్ల సబ్ కా వికాస్ అనేది స్పష్టంగా బూటకపు నినాదంగా మిగిలిపోతున్నది.

ప్రజాస్వామ్యమంటే రాజ్యాంగ బద్ధతే అయితే దేశంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం సమానంగా ఎందుకు దక్కడం లేదు? కొందరు జైలులో నిర్బంధాలు అనుభవిస్తుండగా మరి కొందరు స్వేచ్ఛగా బైట ఎలా తిరగ గలుగుతున్నారు? భారతదేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పదలచుకుంటే, రాజకీయ ఖైదీలందరినీ తక్షణమే, బేషరతుగా విడుదల చేయడమే మొదటి షరతుగా మేం డిమాండ్ చేస్తున్నాం.
ఇట్లు మీ రాజకీయ ఖైదీలు

1. సుధీర్ ధావ్లే
2. సురేంద్ర గాడ్లింగ్
3. మహేశ్ రౌత్
4. రోనా విల్సన్
5. అరుణ్ ఫరేరా
6. వర్నన్ గోంజాల్వెస్
7. వరవర రావు
8. సుధా భరద్వాజ్
9. షోమా సేన్

Keywords : maharashtra, pune, varavararao, elgar parishad, police, bjp
(2019-08-20 16:10:15)No. of visitors : 455

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


మహా