మహారాష్ట్ర గవర్నర్ కు వరవరరావు సహచరి హేమలత లేఖ.... సంఘీభావం తెలిపిన మేధావులు


మహారాష్ట్ర గవర్నర్ కు వరవరరావు సహచరి హేమలత లేఖ.... సంఘీభావం తెలిపిన మేధావులు

భీమా కోరే గాంవ్ కేసులో మహారాష్ట్ర లోని పూణే జైల్లో ఉన్న విప్లవ రచయిత వరవరరావు సహా 9 మంది రాజకీయ ఖైదీలు నేల రోజుల కింద ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఓ లేఖ రాశారు. తమపై పెట్టిన కేసు ఎంత అసత్యమో, కేసు దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్రజాస్వామికంగా వ్యవ‌హరిస్తున్న తీరు ఆ లేఖలో వాళ్ళు వివరించారు. ఆ లేఖపై గవర్నర్ నుండి కనీస స్పందన లేని నేపథ్యంలో వరవరరావు సహచరి హేమలత గవర్నర్ విద్యాసాగర్ రావుకు మరో లేఖ రాసింది. తాను రాసిన లేఖకు సంఘీభావంగా 32 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. ఈ లేఖను ఈ రోజు (జూలై 19, 2019) సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో మీడియాకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వరవరరావు సహచరి హేమలత, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు, ప్రముఖ కవి శివారెడ్డి, ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకులు కే.శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి వసంతా కన్నాభిరాన్,ప్రొఫెసర్ పద్మజా షా, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్, సీఆర్పీపీ కోఆర్డినేటర్ భల్లా రవి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం....

మహారాష్ట్ర గవర్నర్
గౌరవనీయులు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి,
భీమా కోరేగాం – ఎల్గార్ పరిషద్ కేసులో అక్రమంగా ఇరికించబడి, ఎనిమిది నెలలుగా మహారాష్ట్రలో పుణెలో యరవాడ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న నా భర్త వరవరరావు గారి విషయంలో మీ పరిధిలో ఉన్న చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన, మానవతాదృష్టి గల చర్యలు తీసుకోవాలని కోరుతూ....
ప్రస్తుతం 79 సంవత్సరాల వయసులో తన రాజకీయ, సామాజిక విశ్వాసాల కొరకు జైలు నిర్బంధం అనుభవిస్తున్న వరవరరావు గారి గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు.

భిన్న రాజకీయాలున్నప్పటికీ మీకు ఆయనతో పరిచయం ఉండి ఉంటుంది. ఎమర్జెన్సీలో మీరు జైలులో ఉన్న సమయంలో ఆయనతో కలిసి ఉండి ఉంటారు. మీరు ఇవాళ ఆయనను నిర్బంధించిన రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ఈ కేసు విషయంలో, కేసులో బెయిల్ ఇవ్వడానికి జరుగుతున్న విపరీతమైన తాత్సారం విషయంలో, జైలు పరిస్థితుల విషయంలో మీ పదవీ అధికారాలకు లోబడి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరడానికి ఈ లేఖ రాస్తున్నాను.

వరవరరావు గారు, ఆయన సహనిందితులు ఎనిమిది మంది మీకు ఒక లేఖ రాశారని నెల రోజుల కింద వార్తాపత్రికలలో చదివి మీ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఇంతకాలం వేచి చూశాను. ప్రచార సాధనాలలో మీ స్పందన ఏదీ రాలేదు. పుణె జైలు పరిస్థితులలో ఎటువంటి మెరుగుదలా జరగలేదు. అందువల్ల నేను మీకు మరొక లేఖ రాయక తప్పడం లేదు.

వరవరరావు గారితో సహా ఆ తొమ్మిది మందినీ ఆ కేసులో అక్రమంగా ఇరికించారనీ, భీమా కోరేగాం హింసాకాండకు నిజమైన బాధ్యులను తప్పించడానికే ఈ కుట్ర కేసు బనాయించారనీ ఎంతోమంది భావిస్తున్నారు. వరవరరావు గారి విషయంలోనైతే ఇటువంటి అబద్ధపు కేసులు కొత్త కాదు. 1973లో మొదటిసారి ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన నాటి నుంచి గత నలబై ఆరు సంవత్సరాలలో ఆయాను 25 కేసులలో ఇరికించి, హత్య, హత్యాయత్నం, బాంబుల పంపిణీ, బెదిరింపు, ఆయుధ సేకరణ, ప్రభుత్వోద్యోగుల విధినిర్వహణను అడ్డుకోవడం వగైరా ఎన్నో తీవ్రమైన నేరాలు ఆరోపించారు.

కాని ఆ 25 కేసులలో ఏ ఒక్క కేసులోనూ ఏ ఒక్క ఆరోపణనూ పోలీసులు రుజువు చేయలేకపోయారు. అన్ని కేసుల నుంచీ వరవరరావుగారిని నిర్దోషిగా న్యాయస్థానాలు విడుదల చేశాయి. ఆ విధంగానే ప్రస్తుత అబద్ధపు కేసును కూడ న్యాయస్థానాలు కొట్టివేస్తాయని మేం నమ్ముతున్నాం.

అయితే అప్పుడు అన్ని కేసులలోనూ నిర్దోషిగా రుజువైనప్పటికీ విచారణలో ఉన్న ఖైదీగా ఆయన మొత్తం ఏడు సంవత్సరాలు జైళ్లలో గడపవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడ ఈ అబద్ధపు కేసులో విచారణలో ఉన్న ఖైదీగా ఆయన ఇప్పటికే గృహనిర్బంధంలో రెండున్నర నెలలు, జైలులో ఎనిమిది నెలలకు పైగా గడిపారు. అప్పటికీ ఇప్పటికీ ఆయన వయసు పెరిగింది, ఆరోగ్యం క్షీణించింది.

కేసు విచారణ ఎలా ఉన్నప్పటికీ, భారత న్యాయశాస్త్రం ప్రకారం నిందితులు తప్పించుకుపోతారనీ, విచారణకు సహకరించరనీ అనుమానం ఉన్నప్పుడు మినహా, మిగిలిన అన్ని సందర్భాలలో బెయిల్ ఇవ్వడం తప్పనిసరి. కాని పుణె న్యాయస్థానంలో బెయిల్ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా తాత్సారం జరుగుతున్నదని మాకు అనిపిస్తున్నది.

ఇక జైలు పరిస్థితులలో వరవరరావు గారికి, సహనిందితులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. వారికి జైల్ మాన్యువల్ నిర్దేశించినట్టుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జైళ్లలో ఉన్నట్టుగా ఎటువంటి మానవీయ సౌకర్యాలు అందడం లేదు. వరవరరావు గారికైతే గతంలో జైలు జీవితంలో ఉన్నట్టుగా తెలుగు పుస్తకాలు, పత్రికలు చదువుకునే అవకాశాలు, రాసుకునే అవకాశాలు, వృద్ధాప్యం వల్ల నేల మీద కూచోలేని, పడుకోలేని స్థితిలో కుర్చీ, మంచం వంటి వసతులు, జైలు ములాఖాత్ లో సమీప బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలు కల్పించడం లేదు.

ఈ చర్యలు చూస్తుంటే, విచారణ పూర్తి కాకముందే కఠిన శిక్ష విధిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలోని జైళ్లలో విచారణలో ఉన్న ఖైదీల పట్ల చట్టబద్ధ, న్యాయబద్ధ, మానవీయ ప్రవర్తన అమలవుతున్నదా లేదా చూడవలసిన బాధ్యత రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తానికీ బాధ్యులుగా మీపై ఉంటుందని సవినయంగా గుర్తు చేయదలచాను.

రాజ్యాంగ ఆదర్శాల పట్ల, జైళ్లను సంస్కరణాలయాలుగా తీర్చిదిద్దాలనే చట్టబద్ధ ఆదేశాల పట్ల గౌరవంతో, మానవతా దృష్టితో ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో ఈ కింది విషయాలు చర్చించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
1. వరవరరావు గారి వయసు దృష్ట్యా, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
2. అరవై సంవత్సరాలకు పైగా తెలుగు సాహిత్య విద్యార్థిగా, అధ్యాపకుడిగా, కవిగా, రచయితగా ఉన్న
వరవరరావు గారిని ఎనిమిది నెలలుగా అక్షరం చూడకుండా ఆంక్షలు విధించారు. ఇప్పటికైనా
చదువుకోవడానికి తెలుగు పత్రికలు, పుస్తకాలు అనుమతించాలి.
3. జైలులో చదువుకోవడానికి, రాసుకోవడానికి తగిన వసతులు కల్పించాలి.
4. ప్రస్తుతం కేవలం భార్యాబిడ్డలకు మాత్రమే ఇస్తున్న ములాఖాత్ అనుమతిని కుటుంబ సభ్యులకు,
మిత్రులకు కూడ విస్తరించాలి.
5. కేసును త్వరితగతిని విచారించమని, లేదా బెయిల్ ఆమోదించమని తత్సంబంధిత అధికారులను
ఆదేశించాలి.

-పి. హేమలత

(మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు వరవర రావు సహచరి పి. హేమలత రాసిన ఈ లేఖను సంఘీభావం ప్రకటించినవారు)
1. చుక్కా రామయ్య, విద్యావేత్త
2. పొత్తూరి వెంకటేశ్వర రావు, పత్రికా సంపాదకులు
3. వసంత్ కన్నబిరాన్, రచయిత
4. నిఖిలే శ్వర్, కవి
5. దేవిప్రియ, కవి
6. కె. శివారెడ్డి, కవి
7. ఓల్గా, రచయిత
8. ప్రొ. జి హరగోపాల్. సామాజిక శాస్త్రవేత్త
9. ప్రొ. వకుళాభరణం రామకృష్ణ, సామాజిక శాస్త్రవేత్త
10. ప్రొ. డి నరసింహారెడ్డి. సామాజిక శాస్త్రవేత్త
11. ప్రొ. వి ఎస్ ప్రసాద్, సామాజిక శాస్త్రవేత్త
12. ప్రొ. కె చక్రధర రావు, సామాజిక శాస్త్రవేత్త
13. ప్రొ. సుజీ ధారు, ఇంగ్లిష్ అధ్యాపకులు
14. ప్రొ. రమా మేల్కోటే, సామాజిక శాస్త్రవేత్త
15. ప్రొ. కాత్యాయనీ విద్మహే, తెలుగు అధ్యాపకులు
16. ప్రొ. పి ఎల్ విశ్వశ్వర రావు, జర్నలిజం అధ్యాపకులు
17. ప్రొ. పద్మజా షా, జర్నలిజం అధ్యాపకులు
18. ప్రొ. ఎండ్లూరి సుధాకర్, తెలుగు అధ్యాపకులు
19. ప్రొ. అల్లాడి ఉమ, ఇంగ్లిష్ అధ్యాపకులు
20. ప్రొ. ఎం శ్రీధర్, ఇంగ్లిష్ అధ్యాపకులు
21. ప్రొ. కె. లక్ష్మీనారాయణ, సామాజిక శాస్త్రవేత్త
22. కె. లలిత, రచయిత
23. కల్పనా కన్నబిరాన్, సామాజిక శాస్త్రవేత్త
24. కె. రామచంద్ర మూర్తి, పత్రికా సంపాదకులు
25. కె శ్రీనివాస్, పత్రికా సంపాదకులు
26, జహీర్ అలీ ఖాన్, పత్రికా సంపాదకులు
27. దేవులపల్లి అమర్, జర్నలిస్టు ఉద్యమ నాయకులు
28. కె. శ్రీనివాస రెడ్డి, జర్నలిస్టు ఉద్యమ నాయకులు
29.మాడ‌బూషి శ్రీధర్
30.పరవస్తు లోకేశ్వర్
31.ప్రొఫెసర్ ఎన్.గోపి
32.పాశం యాదగిరి

Keywords : varavararao, wife, maharashtra, pine, governor, ch.vidyasagar rao, bhima koregav case
(2019-12-14 08:42:11)No. of visitors : 619

Suggested Posts


ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

కామ్రేడ్ రామన్న మరణంపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
అలుపెర‌గ‌ని విప్ల‌వ బాట‌సారి చంద్రన్న
నేను చనిపోయినా వారికి శిక్షపడాలి....ఉన్నావ్ అత్యాచార బాధితురాలి చివరి కోరిక‌
మా పేరు మీద కస్టడీ హత్యలు వద్దు..!
కూలి డబ్బులు అడిగినందుకు దళితుడిని జేసీబీతో తొక్కించి చంపాడు..!
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం - ట్రీట్ మెంట్ కోసం పూణే ప్రభుత్వ‌ హాస్పటల్ కు...
రేప్ బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ దాడి చేసిన రేపిస్టులు... సజీవదహనానికి యత్నం
అది ఎన్కౌంటర్ కాదు.. 17 మందిని ఏకపక్షంగా కాల్చి చంపారు : జుడీషియల్ కమీషన్ వెల్లడి
ఇండియాస్ డాటర్స్.. ఇంకెంత కాలం ఈ దారుణాలు..? ఈ డాక్యుమెంటరీ చూడండి..!
20 వసంతాల నెత్తుటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ప్రియాంక హత్య : ఢిల్లీలో పగిలిన చిన్ని గుండె !
100 కి డయల్ చేసి ఉంటే...! విక్టిమ్ బ్లేమింగ్ - సీ.వనజ
దొరతనం గెలుసుడా ఓడుడా? - ఎన్.వేణుగోపాల్
ʹఆకలి, పేదరికంతో చచ్చిపోతున్నాʹ.. కంటతడి పెట్టిస్తున్న ఓ చిన్నారి సూసైడ్ లెటర్
ఈ తెలంగాణ మీదే.. మాది కాదు : కేసీఆర్‌కు ఒక ఆర్టీసీ కండక్టర్ బహిరంగ రాజీనామా లేఖ
మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
ఒక ప్రొఫెసర్ - ఏడు కుట్ర కేసులు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ఈ అక్రమ కేసులు : విరసం
Withdraw the False Case against Veekshanam Editor!
వీక్ష‌ణం సంపాద‌కుడిపై UAPA కేసు
భగత్ సింగ్ తుపాకీ - జార్జిరెడ్డి సినిమా...!!
Arrest of B Anuradha & N Ravi Sharma – Fact and Fiction
అనూరాధ, రవి శర్మల అరెస్టు – వాస్తవమూ కల్పనా..!
కేసీఆర్ అప్రజాస్వామిక పాలన‌: అనురాధ, రవిల అరెస్ట్ - రాజద్రోహం, యూఏపీఏ కేసులు బనాయింపు
more..


మహారాష్ట్ర