పల్లె పల్లెనా అమరుల వారోత్సవాలు జరపండి ... మావోయిస్టు పార్టీ పిలుపు


పల్లె పల్లెనా అమరుల వారోత్సవాలు జరపండి ... మావోయిస్టు పార్టీ పిలుపు

పల్లె

భారత దేశ విప్లవ వేగుచుక్కలైన‌ చారూ మజుందార్, కన్హాయ్ చటర్జీలు ఏర్పాటు చేసిన మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలు, ఇంకా అనేక విప్లవ గ్రూపులు, పార్టీలు సీపీఐ మావోయిస్టు పార్టీగా ఒక్కటయ్యాయి. ఆ అమరులు సృష్టించిన నిప్పు రవ్వ ఇవ్వాళ్ళ దేశ వ్యాప్తంగా దోపిడిదారుల గుండెల్లో డైనమెట్లయి పేలుతోంది. ఆనాటి నక్సల్బరీ మొదలుకొని శ్రీకాకుళం, తెలంగాణ, దండకారణ్యం, బీహార్, ఝార్ఖండ్, కేరళ, తమిళనాడు, కర్నాట ట్రై జంక్షన్ ,బెంగాల్ లలో ఎన్నో నిర్బంధాల నడుమ విప్లవ కారులు ప్రజా ఉద్యమాలు నిర్మించారు. చారూ మజుందార్ జులై 28న, కన్హాయ్ చటర్జీ జులై 18న అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ అమరులను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి అగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

మోడీ పాలనలో సంఘ పరివార్ శక్తులు పేట్రేగి పోయి మైనార్టీలు, దళితులు, ఆదివాసీలపై ఎన్నో దాడులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. గోరక్షణ పేరుతో మూకదాడులు పెరిగిపోయి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని.. కుల, మతాంతర వివాహాలపై కూడా కక్షబూని హత్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావులను అక్రమంగా నిర్బందించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. స్వచ్చ భారత్ పేరుతో దేశలోని సంపదనంతా సామ్రాజ్యవాదులు, కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇక తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఇవ్వాళ ప్రజాస్వామిక హక్కులే కాదు జీవించే హక్కు కూడా కరువయ్యిందని అన్నారు. యజ్ఞాలు యాగాలు చేస్తూ పండుగలు, పబ్బాలకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ తెలంగాణ ప్రజలను మతం మత్తులో ముంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ వ్యవస్తను బలోపేతం చేయడానికి 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించారని ఆయన దుయ్యబట్టారు.

రైతుల గురించి గొప్పగా చెబుతూ వారిని మాత్రం నిర్బంధిస్తున్నారని.. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర, రుణమాఫీ కూడా అందించకుండా నేను కూడా రైతునే అని మాయమాటలు చెబుతున్నారని ఆయన అన్నారు.

కాగా, ఎంతో మంది ఉద్యమకారులను, కార్యకర్తలను అకారణంగా పొట్టనబెట్టుకుంటున్నారని.. అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారని జగన్ అన్నారు. సమాధాన్ పేరుతో ఆదివాసీ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లు చిచ్చు పెడుతున్నాయని జగన్ చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల కోసం త్యాగాలు చేసిన అమరులను స్మరించుకుంటూ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పోస్టర్లు, వాల్ రైటింగ్స్, బ్యానర్లు, పత్రికా ప్రకటనలు, సభలు, సమావేశాల రూపంలో ప్రచారం చేయాలని ఆయన కోరారు. సమాధాన్ దాడిని ఓడించి మన ప్రజా పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.

అమరుల వారోత్సవాల నినాదాలు

-> జులై 28 నుంచి అగస్టు 3 వరకు అమరుల వారోత్సవాలు నిర్వహించాలి

-> అమరవీరుల అలుపెరగని పోరాట పటిమను, ఆదర్శాలను, సాహసాన్ని, నిబద్ధతను అలవర్చుకుందాం.. వెలుగెత్తి చాటుదాం.

-> అమరుల స్వప్నాలను, వారి ఆశయాలను చివరకు వరకు కొనసాగిద్దాం.

-> అమరుల నెత్తుటితో తడిచిన ఎర్రజెండాను ఎత్తుకొని ముందుకు సాగుదాం

-> శత్రువు యొక్క సాయుధ బలగాలు చేస్తున్న సమాధాన్ దాడిని ఓడిద్దాం

-> మార్క్సిజం - లెనినిజం - మావోయిజం వర్ధిల్లాలి

-> నూతన ప్రజాస్వామిక విప్లవం వర్థిల్లాలి

-> ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్థిల్లాలి

Keywords : Maoist party, jagan, telangana, press note
(2019-09-18 20:48:11)No. of visitors : 943

Suggested Posts


0 results

Search Engine

తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
యుద్ధం - శాంతి.
యురేనియం దెబ్బకు జీవాలు గడ్డి తినడంలే.. బురుగులు కక్కి సస్తున్నాయి..!
కశ్మీర్ లో 80 మందికి పెల్లెట్ గాయాలు, బాలుడు మృతి... జాతీయ వార్తాసంస్థల వెల్లడి
ఆమె పోరాటమే.. తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించింది..!
స్కూలు పిల్లలకు భోజనంలోకి కూరకు బదులు ఉప్పు...బైట పెట్టిన జర్నలిస్టుపై కేసు
more..


పల్లె