45 మందిని చంపి నదిలో తోసేసిన పోలీసుల హత్యాకాండపై...ఓ ఐపీఎస్ అధికారి పుస్తకం... ʹహాషీంపురా 22, మేʹ
ఈ పుస్తకం తెలుగులో త్వరలో రానుంది
ʹహాషీంపురా 22, మేʹ
మరుగునపడ్డ పోలీసు హత్యాకాండ
రచన : విభుతి నారాయణ రాయ్
తెలుగు : వి.వి.జ్యోతి
ప్రచురణ : మలుపు బుక్స్
ఢిల్లీ హైకోర్టు 2018 అక్టోబర్ 31న ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పులో పదహారు మంది పోలీసు కానిస్టేబుళ్లకు హత్యానేరంపై యావజ్జీవ శిక్ష విధించింది. ప్రొవిన్షియల్ అర్మ్ డ్ కాన్ స్టేబులరీ (పిఎసి) కి చెందిన ఆ పోలీసులు 1987 మే 22న మీరట్ శివార్లలోని హాషింపురాలో ముస్లిం యువకులను నిర్బంధించి, అందులో నలబై రెండు మందిని కాల్చిచంపారనేది ఆరోపణ. ఆ నేరాన్ని విచారించిన ఢిల్లీలోని తీస్ హజారీ సెషన్స్ కోర్టు 2015 మార్చ్ 21న తగిన సాక్ష్యాధారాలు లేవంటూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తీర్పు హైకోర్టులో పునర్విచారణకు వచ్చింది.
హత్యలు జరిగినరోజున దినకూలీలు, నేతపనివాళ్లు అయిన దాదాపు నలబై ఐదు మంది ముస్లిం యువకులను పిఎసి పోలీసులు ట్రక్కు ఎక్కించి ఘజియాబాద్ జిల్లా మురాద్ నగర్ లో ఎగువ గంగ కాలువ దగ్గర కాల్చిచంపి మృతదేహాలను కాలువలోకి తోసేశారు. చనిపోయినట్టు నటించి కాలువలో ఈదుతూ బైటపడిన ప్రత్యక్షసాక్షి కథనం మేరకు, పౌరహక్కుల సంఘాల ఒత్తిడి మీద హత్యాకాండ కేసు నమోదయింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి పది సంవత్సరాలు, దాని మీద విచారణ కొనసాగించడానికి మరొక పది సంవత్సరాలు తాత్సారం చేసి, సుప్రీం కోర్టు జోక్యంతో విచారణ జరిపి, చివరికి హత్యాకాండ జరిగిన 28 ఏళ్లకు సెషన్స్ కోర్టు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కాని హత్యాకాండ జరిగినప్పుడు ఒక ఫొటో జర్నలిస్టు తీసిన ఫొటోలు హతుల నిర్బంధానికి, హత్యకు నిస్సందేహమైన ఆధారంగా ఉన్నాయని నిర్ధారించిన జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్ లు పదహారు మంది పోలీసులకు యావజ్జీవ శిక్ష విధించారు. మరొక ముగ్గురు నిందితులు విచారణ క్రమంలో సహజమరణంతో శిక్ష తప్పించుకున్నారు.
ఈ దారుణ మారణకాండను సన్నిహితంగా పరిశీలించిన అప్పటి ఘజియాబాద్ పోలీసు సూపరింటెండెంట్, రచయిత విభూతి నారాయణ్ రాయ్ నవలా రూపంలో వ్యక్తీకరించిన ఆగ్రహ ప్రకటన ఇది.
- ఎన్. వేణుగోపాల్








Keywords : hashimpura, police, murders, vibhuthi narayana roy, malupu, book
(2023-05-25 16:56:15)
No. of visitors : 1158
Suggested Posts
| కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణఏదో జరగబోతోందన్న సూచనలు కనిపించాయి. అదే జరగబోతోందన్న ఊహలు కూడా వినిపించాయి. అయినా, ఆగస్టు 5వ తేదీ ఉదయం ఖచ్చితంగా అదే జరిగేటప్పటికి దిగ్భ్రాంతి. ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. అనేక వాదనల, ఆలోచనల, ఊహల, పరిష్కారాల- ప్రాతిపదికలన్నిటికీ కాళ్లకింద నేల కదిలిపోయింది. మన హ దయాలు కోతపడి, మెదళ్లు స్తంభించిపోయిన ఆ సమయంలోనే, వెనువెంటనే, నూతన పరిస్థితుల నవీ |
| నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట గాథఈ దేశంలో బూటకపు కేసులు బనాయించి అనేక మంది ముస్లింలను, దళితులను, విప్లవ కారులను, ప్రజా పక్షం వహించే మేదావులను జైళ్ళలోకి నెడుతున్నారు పాలకులు. అలా జైళ్ళలో దశాబ్దాల తరబడి మగ్గి నిర్దోషులుగా బైటడినవాళ్ళే ఎక్కువ మంది. |
| నెత్తుటి త్యాగాలతో సాగిన సింగరేణి పోరాటాల చరిత్ర ʹసైరన్ʹ నవల
అల్లం రాజయ్య రాసిన ఈ సైరన్ నవలను చదివితే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గత నలభై, యాభై యేండ్ల కింద రైతాంగం, ఆదివాసులు, సింగరేణి కార్మిక వర్గపు స్థితిగతులు ఎలా ఉండేవో తెలిసి వస్తాయి. |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
more..