మూకదాడులను ఖండిస్తూ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై కోర్టులో పిటిషన్


మూకదాడులను ఖండిస్తూ లేఖ రాసిన 49 మంది ప్రముఖులపై కోర్టులో పిటిషన్

మూకదాడులను

ఎన్డీయే ప్రభుత్వం హయాంలో దేశవ్యాప్తంగా పెరిగిపోయిన మూక దాడులు, విద్వేశపూరిత నేరాలు పెరిగి పోయాయని.. వెంటనే వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు రంగాలకు చెందిన ప్రముఖలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బీహార్ కోర్టులో ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్లను ఉటంకిస్తూ కేసు నమోదు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.

ఈ నెల 23న 49 మంది ప్రముఖులు ప్రధానికి లేఖ రాశారు. వీరిలో రేవతి, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, శ్యామ్ బెనగల్, అపర్ణా సేన్, గాయని శుభా ముగ్దల్, చరిత్రకారుడు రామచంద్రగుహ వంటి మేధావులు ఉన్నారు. వీరి లేఖ వల్ల దేశం పరువు పోయిందని.. వీరు దేశద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా కోర్టులో పిటిషన్ వేశారు.

వీళ్లు చేసిన పని దేశ సమగ్రతకు భగం కలిగించేదిగా ఉందని.. మతపరమైన మనోభావాలను గాయపరిచారని సదరు న్యాయవాది చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్డీకి విన్నవించారు. అంతే కాకుండా 49 మంది లేఖను వ్యతిరేకిస్తూ మోడీకి లేఖ రాసిన 61 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. సాక్షుల్లో కంగనా రనౌత్, మధుర్ భండార్కర్, వివేక అగ్నిహోత్రి వంటి వాళ్లు ఉన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై అగస్టు 3న విచారణ జరుగనుంది.

గత కొన్నాళ్లుగా దేశంలో మూకదాడులు పెరిగిపోయిన మాట వాస్తవమే. ఒక వర్గం ప్రజల చేత బలవంతంగా ʹజై శ్రీరాంʹ అనిపించడం.. లేకపోతే దాడులు చేసిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనల్లో పలువురు తీవ్ర గాయాలపాలవ్వడమో లేదా మరణించడమో జరిగింది. ఈ విషయాన్నే మోడీ దృష్టికి ఆ 49 మంది తీసుకొని వెళ్లారు. ʹజై శ్రీరాంʹ అనడం ఒక రెచ్చగొట్టే నినాదంగా మారింది.. అలా అనకపోవడం నేరమా అని వీరు ప్రశ్నించారు.

ఇప్పుడు వీళ్లు ఇలా అడగటం రాజద్రోహం అని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మరింత దారుణం. ఇటీవలే యూఏపీఏ చట్టానికి సవరణ తీసుకొని వచ్చి ఎవరినైనా టెర్రరిస్టుగా అరెస్టు చేసేలా మార్పులు చేశారు. ఏకంగా హోం మంత్రే అర్బన్ నక్సల్స్‌ను ఉపేక్షించేది లేదని లోక్‌సభలో ప్రకటించారు. ఇప్పుడు ప్రశ్నించడమే నేరమైపోయింది.

ప్రస్తుత ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాయడమే ఈ కోర్టు పిటిషన్ అని పలువురు భావిస్తున్నారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఒక వర్గం పని చేయడం గమనార్హం. అగస్టు 3న విచారణకు వచ్చే ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Keywords : Bihar Court, Eminent Citizens, Modi , Lynchings, Hate Crimes
(2019-08-21 19:20:57)No. of visitors : 214

Suggested Posts


0 results

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


మూకదాడులను