చారు మజుందారికి 50 ఏండ్లు...చారు మజుందార్ కు 100 ఏండ్లు


చారు మజుందారికి 50 ఏండ్లు...చారు మజుందార్ కు 100 ఏండ్లు

చారు

మోహన సుందరం అనే రచయిత తన ఫేస్ బుక్ టైంలైన్ పెట్టిన పోస్ట్

ఓ చిన్న చెకుముకి రాపిడి చెదలుబారిన చట్టాల పాలిట చితిమంట కావడాన్ని ఎవరైనా ఊహించగలరా...?

ఉందో లేదో తెలియని ఊపిరి ప్రతీ ఒక్కరి నరాల్లో నిప్పుల ఉప్పెనై ఊరుకులెత్తించడాన్ని ఎవరైనా విశ్వసించగలరా...?

ఉన్నత విద్య అనేదే ఎరుగని ఆ మేధస్సు ప్రతీ విశ్వవిద్యాలయం ఉగ్రరూపమెత్తి పరవళ్లు తొక్కేలా చేయడాన్ని ఎవరైనా చూడగలరా...?

ఎముకలు,చర్మం తప్ప మరేమీ లేని 43 కిలోల ఆ బక్కపల్చని ఆకారం ఎందరి గుండెల్లో పచ్చబొట్టయి నిలిచిపోయిందో ఎవరైనా ఆలోచించగలరా...?

కేవలం 53 ఏళ్ళు బతికిన మనిషి, కేవలం ఆరంటే ఆరేళ్ళు నాయకత్వం వహించిన ఉద్యమం 50 ఏళ్ళు దాటి వేలాదిమంది నెత్తుటి తర్పరణలతో అప్రతిహతంగా విజయం దిశగా ముందుకు సాగుతూ... పోరాటం అనే పదానికి, ఉత్తేజం అనే విశేషానికి , విప్లవం అనే అక్షరాలకి పర్యాయ పదం అవుతాడని ఎవరైనా నమ్మగలరా...?

ఆవును... ఆయన కామ్రేడ్ చారూ మజుందార్
అది........ ఆయన చరిత్రగ మలిచిన నక్సల్బరీ
ఆయన... అప్పటికీ.ఎప్పటికీ విప్లవానికి పర్యాయ
పదం.
ఆయన... విముక్తికి ఏకైక నిర్వచనం.

ఎవరైనా ఒకటో రెండో విప్లవ కార్యమాల్లో పాల్గొని , దాన్నో పచ్చబొట్టుగా చూపించుకొని మురిసిపోతారు. కానీ అజన్మాంత విప్లవకారుడు గా జీవించడం,మరణించడం మహత్తరమైన విషయం. అది పలప్రదమైన ప్రజాజీవితం. 1967 లో జరిగిన నక్సల్బరీ రైతాంగ సాయుధ తిరుగుబాటుకు ముందు ఎప్పుడూ వినిపించని చారూ మజుందార్ పేరు, ఇప్పుడు ప్రపంచంలోనే విప్లవం అనే పదానికి పర్యాయం.

1919 లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా సిలిగురిలో ఓ జమీందార్ కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ చారూ మజుందార్ సిలిగురిలో మెట్రిక్ వరకు చదివారు.తూర్పు బెంగాల్ ఆర్ట్ కాలేజీలో చేరినప్పటికీ తనలోని పోరాట స్వభావం చదువునో కొనసాగానీయలేదు.పీడితప్రజాఉద్యమాల్లో చేరి రైతు పోరాటాల్లో మమేకమయ్యారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై "తెభాగా" పోరాట నాయకుల్లో ఒకరయ్యారు. ట్రేడ్ యూనియన్ నాయకులు గా దొమోహానియా లోని బెంగాల్ దువార్ కార్మికులను ఆర్గనైజ్ చేసారు. సహజంగానే మిలిటెంట్ కావడంతో, ఎంతో మిలిటెంట్ గా జరిగిన ఆ పోరాటంలో పోలీసుల కాల్పుల్లో12మంది స్త్రీపురుషులు చనిపోయారు. దానికి భాద్యుడ్ని చేస్తూ పార్టీ ఆయన్ని తీవ్రంగా మందలించింది.

పార్టీ నిషేధకాలంలో పలుమార్లు అరెస్ట్ అయ్యారు. లెక్కలేనన్ని చిత్రహింసలు చవిచూశారు. తెలంగాణా సాయుధ పోరాటానికి తిలోదకాలు వదిలి పార్టీ పార్లమెంటరీ రాజకీయాల్లోకి దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ 7 వ మహాసభలో విభేదాలు బయటపడి 1964 లో సి పి ఎం ఏర్పడింది. దానిలో కొనసాగిన ఆయన రివిజనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.చైనా పంథాకు అనుకూలంగా, మిలిటెంట్ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ఆయన రాసిన డాక్యుమెంట్లని, ఇచ్చిన పిలుపును వ్యతిరేకించిన పార్టీ ఆయనను పార్టీనుంచి బహిష్కరించింది. అదే సమయంలో నక్సల్బరీ లో జోతేదారులకు వ్యతిరేకంగా రైతాంగపోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. ఆయన తన సహచరులైన జంగల్ సంతాల్, కానుసన్యాల్ ల లతో కలిసి ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించారు. నక్సల్బరీ లో రైతాంగం ఎత్తిన తుపాకీ, చిందించిన నెత్తురు దేశవ్యాప్తంగా నిప్పురవ్వను రగిలించింది. పెనుమంటై విస్తరించింది. సాయుధ పోరాటమే కార్మిక, కర్షకల్ని తరాల దోపిడీ నుంచి విముక్తి చేస్తుందని, పార్లమెంటరీ రాజకీయాలు మోసపూరితమైనవని నక్సల్బరీ ఎలుగెత్తి చెప్పింది. భారతదేశంలో "వసంత మేఘ గర్జన " అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ తిరుగుబాటుని కొనియాడింది.దేశవ్యాప్తంగా యువత కదిలింది. పోరాఠాల్లోకి దూకింది.1968 లో దేశవ్యాప్త విప్లవకారులు అంతా కలిసి సమన్వయ కమిటీ ని ఏర్పాటుచేశారు కానీ అప్పటికే పార్లమెంటరీ రాజకీయాల్లో తలమునకలై ఉన్న నేతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకులు కామ్రేడ్ చారూ మజుందార్ నాయకత్వాన్ని, ఇచ్చిన పిలుపుని అంగీకరించలేక పురిటిలోనే కమిటీని చీల్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రగిలిన శ్రీకాకుళం, దేబ్రా గోపీ వల్లవపూర్,ముషాహారీ,ముజఫర్ పూర్ గెరిల్లా పోరాటాలు పార్టీ ఏర్పాటు దిశగా ఐక్యమయి రివిజనిజాన్ని తుత్తునియులు చేశాయి. కామ్రేడ్ లెనిన్ జయంతి రోజున 1969 ఏప్రిల్22 వ తేదీన భారతకమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు - లెనినిస్ట్ ) ఆవిర్భవించింది. అదే ఏడాది మే1 వతేదీన కలకత్తా లో భారీ ఊరేగింపు జరిపి, షాహీద్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కామ్రేడ్ చారూ మజుందార్ కార్యదర్శిగా పార్టీ ఏర్పడినట్టు ప్రకటించారు.

భారత రైతాంగ సాయుధ విప్లవానికి కామ్రేడ్ చారూ మజుందార్ సమకూర్చిన సైద్ధాంతిక సంపద, ఆచరణలో తలెత్తిన సమస్యలకు ఆయన చూపిన పరిష్కారాలు అమూల్యమైనవి. గొప్ప మార్క్సిస్టు - లెనినిస్ట్ తాత్వికుడైన ఆయన మావో ఆలోచనా విధానాన్ని సృజనాత్మకంగా మనదేశ ప్రత్యేక పరిస్థితులకనుగుణంగా అన్వయించాడు. గతతార్కిక పరిశీలకుల అధ్యయనం ప్రకారం భారత విప్లవ తాత్విక చరిత్రకు కామ్రేడ్ చారుబాబు అసమాన్యమైన, అమూల్యమైన రెండు కానుకలను అందించారు. మొదటిది వర్గశత్రు నిర్మూలన, రెండవది నూతన మానవుని భావన. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే అన్ని రకాల రివిజనిజాల్ని ఎదిరించి, రాజీలేని పోరాటాన్ని జీవితాంతం సాగించిన మేటి విప్లవకారుడిగా కామ్రేడ్ చారూ మజుందార్ చిరస్థాయిగా నిలుస్తారు.

అతివాద దుస్సాహాసిగా, అర్ధం లేని హింసాకారుడిగా ఎన్ని విమర్శల్ని, దుమారాల్నీ ఎదుర్కొన్నప్పటికీ "ఎన్నికలని, పార్లమెంటరీ పదవులనీ బహిష్కరించండి " అనే నినాదమిచ్చి, వర్గశత్రు నిర్మూలన విధానాన్ని అమలుపరిచి, రివిజనిజానికి ʹ ఆర్థిక సూటిదారైన ʹ విధానాన్ని వమ్ము చేశారు. వర్గశత్రు నిర్మూలన గెరిల్లా పోరాటానికి నాంది, వర్గపోరాటం యొక్క అత్యున్నత రూపమని సూత్రీకరించారు. ఒకమనిషిని మరోమనిషి, ఒక వర్గాన్ని మరో వర్గం దోపిడీ చేసే వీలులేని సమసమాజ నిర్మాణం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించి, సర్వస్వం త్యాగం చేసే కొత్త మనుష్యులు కావాలి. ఆ కొత్త మనుష్యులు ద్వారానే కొత్త సమాజం సృష్టించబడుతుందనేది కామ్రేడ్ చారుబాబు మహోజ్వల భావన.

చైనా కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నట్టు " భారత పీడిత రైతాంగ సాయుధ పోరాటానికి కామ్రేడ్ చారూ మజుందార్ పర్యాయపదం. భారతదేశ విప్లవానికి వెలుగునిచ్చే జ్యోతి " .

పీడన ఉన్నంతవరకు
పోరాటం ఉన్నంతవరకు
ఆ మూర్తి - మరుపురాదు
ఆ స్ఫూర్తి - చెరిగిపోదు.

" కలలు కనలేని వాడు,
ఇతరులను కలల్లో ముంచెత్తలేని వాడు
విప్లవకారుడు కాలేడు. "
-------- కామ్రేడ్ చారూ మజుందార్.

( ఈనెల 30 వ తేదీ నుంచి కామ్రేడ్ చారూ మజుందార్ శతజయంతి సంవత్సరం.....)

-మోహన సుందరం

Keywords : charumajundar, naxalbari
(2020-08-12 20:32:51)No. of visitors : 854

Suggested Posts


Historic Eight Documents of Charu Majumdar (1st Document)

The Congress government has arrested one thousand communists during the last one month. Most of Central and Provincial leadership are in jail today. Gulzarilal Nanda has announced that he will not accept the verdict of the electorate

Historic Eight Documents of Charu Majumdar (8th Document)

In the post-election period our apprehensions are being proved correct by the actions of the party (CPI-M) leadership itself. The Polit Bureau has directed us to ʹcarry on the struggle to defend the non-Congress ministries against reactionʹ. This suggests that the main task of Marxists is not to intensify the class struggle,

భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు

ఆయన అద్భుతమైన సాహసి. ఏటికి ఎదురీదాడు. ఒక తరాన్ని విప్లవంలోకి నడిపించాడు. అనేక తరాలకు విప్లవోత్తేజాన్ని అందించాడు. ఆలోచనలను ఆచరణగా మార్చడంలో సాటిలేని నిపుణుడు. సాయుధ పోరాట రాజకీయాలకు తిరుగులేని ప్రతినిధి. కా. చారుమజుందార్‌ భారత విప్లవోద్యమ నాయకుడు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం.

Historic Eight Documents of Charu Majumdar (4thDocument)

We shall have to carry on daily the struggle against revisionism, adopting the tactics of area-wise seizure of power. Certain revisionist ideas are firmly rooted inside the party. We shall have to carry on the struggle against them. We are discussing some questions here.

Historic Eight Documents of Charu Majumdar (7th Document)

During the last two years, the spontaneous struggles of the petty-bourgeois youths and students have created a stir from one end of India to another. Although at the beginning the demand for food was the main demand, but gradually the demand for ousting the Congress government has become main.

Historic Eight Documents of Charu Majumdar(2nd Document)

As revisionist thinking nestled in the Indian party for a long time, we could not build up a correct revolutionary party. Our primary task today is to build up a correct revolutionary party fighting uncompromisingly against this revisionist thinking.

Historic Eight Documents of Charu Majumdar (5th Document)

There are some comrades who get scared at the mentioning of armed struggles, and go on seeing the spectre of adventurism. They think that the work of building a revolutionary party has ended with the very adoption of the programme in other

Historic Eight Documents of Charu Majumdar (6th Document)

The Party leaders after long imprisonment, after the Party Congress, for the first time had a session of the full Central Committee. The central leadership of the party which was formed through struggles against revisionism, adopted an ideological resolution and declared bluntly

Historic Eight Documents of Charu Majumdar (3rd Document)

Comrades, Two events occurred in the world in the era after the Second World War. As, on the one hand, the naked form of the defeat of the so called Fascist powers was exposed before the people, so also, on the other, the world socialist state system under the leadership of Comrade Stalin created confidence

Search Engine

రాముడిని విమర్షించాడనే కారణంతో కత్తి మహేష్ అరెస్ట్
ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు
ఏడు వందల ఇరవై గంటల ఆందోళన...కనుచూపు మేరలో లేని ఉపశమన ఆశారేఖ
మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు
ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్
అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు
వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు
విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...
ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
వారిపై దాడి చేసింది సిఆర్‌పిఎఫ్ బలగాలే... మావోయిస్టులు కాదు...నిజనిర్దారణ కమిటీ రిపోర్టు
ముగిసిన అమ్మ ఎదురు చూపులు
ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ‌
పోలీసు కూంబింగు‌ల మధ్య ఏవోబీలో భారీ ర్యాలీ ‍- అమరుల వారోత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు
ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC
అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLC
Condemn the impunity towards political prisoners
వరవరరావును విడుదల చేయాలి....765 మంది జర్నలిస్టుల లేఖ!
భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్
Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASR
కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
ఉద్యమాల ఉపాధ్యాయుడి జీవితమంతా ప్రజా ఉద్యమాలే
కుల నిర్మూలనవాది ఉసాకి జోహార్లు...పాపని నాగరాజు
more..


చారు