హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం


హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం

హద్దుల్లేని

దేశంలో పిచ్చి పెరిగి పోతోంది. అది మామూలు పిచ్చి కాదు మత పిచ్చి. మూర్ఖత్వం వెర్రి తలలు వేస్తోంది. అందులోనూ ఇటువంటి వాళ్ళకు అధికారం అండగుందనే అహంకారం కూడా తలకెక్కుతోంది. దాంతో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే అర్దం కావడం లేదు.

మధ్యప్రదేస్ లోని జబల్ పూర్ కు చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్‌ దాన్ని తీసుకుని వచ్చాడు. వచ్చిన డెలివరీ బాయ్‌ హిందువు కాదంటూ ఫుడ్ తీసుకునేందుకు మత పిచ్చి అమిత్ శుక్లా అంగీకరించలేదు.

తనకు ఇతర మతస్తుల ద్వారా ఆహారం పంపించవద్దని జొమాటో అధికారులతో వాదన పెట్టుకున్నాడు.హిందూ మతం అతను వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తేనే తీసుకుంటానని మూర్ఖంగా వాదించాడు. అయితే అమిత్ శుక్లా డిమాండ్ ను జొమాటో తిరస్కరించింది. తాము వివక్షను ఆమోదించబోమని స్పష్టం చేసింది. మరో బాయ్‌ని పంపేందుకు నిరాకరించింది.

దాంతో అమిత్ శుక్లా ఫుడ్ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. పైగా తనేదో గొప్ప పని చేసినట్టు ఫీలయి పోయిన అమిత్ శుక్లాఈ తతంగాన్నంతా ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ ను రీట్వీత్ చేసిన జొమాటో ఆహారానికి మతం లేదు. ఆహారమే ఒక మతం అని కామెంట్ చేసింది.

అయితే ఇంతగా మతపిచ్చితో వ్యవహరించిన అమిత్ శుక్లాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమిత్ శుక్లా పట్ల జొమాటో వ్యవహరించిన తీరును నెటిజన్లు సమర్ధిస్తున్నారు. నడిరోడ్డులో ఏ లారీనో గుద్దేసి పడిపోయి ఉంటే అప్పుడు ఎవరైనా రక్షించేందుకు ముందుకు వస్తే అప్పుడు కూడా మీ మతం ఏమిటి అని అడుగుతావా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే దేశంలో మనుషుల మధ్య అంతరాలు పెరగడానికి ఇలాంటి మూర్ఖులే కారణమంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో నెటిజన్...ʹʹబ‌స్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుండా పాకిస్తాన్, అరేబియా, ఇరాన్, ఇరాక్ గగనతలాల మీద ఎగరడం మానెయ్యాలి.ʹʹ
అని అమిత్ శుక్లాను ఆడుకున్నాడు.
అయితే అమిత్ శుక్లా లాంటివాళ్ళకు కూడా సోషల్ మీడియాలో కొరతేం లేదు. అట్లాంటి వాళ్ళు అమిత్ శుక్లాకు మద్దతుగా జోమాటో పై విరుచుకపడుతున్నారు.

Keywords : zomato, amit shukla, delhi, netizans, twitter, facebook
(2019-08-21 19:06:29)



No. of visitors : 301

Suggested Posts


ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..

ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు...

దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రి

ఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య....

లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియా

ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya Pradesh

Extending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants....

ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు

ప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


హద్దుల్లేని