సోన్‌భద్ర ఘటన : రాజ్యం ఎవరి కోసం సమర్థవంతంగా పని చేస్తోందో తెలుసా..?


సోన్‌భద్ర ఘటన : రాజ్యం ఎవరి కోసం సమర్థవంతంగా పని చేస్తోందో తెలుసా..?

సోన్‌భద్ర

ఎన్నో దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూమి అది.. పంట పండించడం తప్ప.. ఆ భూమిని సొంతం చేసుకోవాలనే తపన, ఆరాటం లేని భూమి పుత్రులు వాళ్లు. కాని, ఈ భూమి మాదేనంటూ.. అక్కడి నుండి వెళ్లిపొమ్మంటూ కొందరు అగ్రకులస్థుల, రాజకీయ నాయకుల, బ్యూరోక్రాట్ల హుకుం. అయినా ఎదిరించారు. పది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయినా ఈ రాజ్యం ఎవరి వైపు ఉంటుందో తెలుసు కదా.. ఇంతకూ ఆ భూమి ఎవరిదో పూర్తిగా ఒక విశ్లేషణ అందించారు జర్నలిస్టు అరుణ. తన ఫేస్‌బుక్ పేజీలో రాసిన విశ్లేషణ యధాతథంగా..

----------------------------------------------

ఉత్తరప్రదేశ్ లో భు వివాదంలో 10 మంది మృతి చెందారు.

ఘటన స్థలం ఉమ్భా గ్రామ పర్యటనకి వెళ్లిన ప్రియాంక గాంధి అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంతో కాంగ్రెస్లో జీవం తీసుకురానున్నారు ప్రియాంక గాంధీ అన్న హెడ్ లైన్స్ తో జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు

నిజానికి ఉమ్భా సంఘటన ఓ చిన్న కేస్ స్టడీ. మన దేశ ప్రజాస్వామ్యం ఎవరికోసం సమర్థవంతంగా పని చేస్తూన్నది అనేది తెలిపే ఘటన.

ఉత్తరప్రదేశ్ లోని ఉమ్భా ఒకప్పుడు మిర్జాపూర్ జిల్లాలో వుండేది. ముప్ఫై ఏళ్ల క్రితం మిర్జాపూర్ నుంచి కొంతభాగాన్ని విడదీసి
సొన్ భద్ర జిల్లా ఏర్పాటు చేసారు. ప్రస్తుతం మనం చర్చిస్తున్న ఉమ్భా ఈ జిల్లాలో ఉంది.

స్వాతంత్రానికి పూర్వం "రాజా సాహిబ్ ఆనంద్ బ్రహమ్"కి ఉమ్భా గ్రామం భూమిపై అధికారం ఉండేది. అయితే ఈ భూమిపైన సాగు చేసేది మాత్రం ఆదివాసులు.

స్వాతంత్రం అనంతరం జమీందారీ వ్యవస్థ రద్దు తర్వాత ఉమ్భా భూములు బంజరు భూములుగా.. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులకు కెక్కాయి. ఈ భూములను గ్రామ సభకు అప్పగించారు. భూమికి యజమాని గ్రామ సభ. అయితే సాగు చేసేది మాత్రం ఉమ్భా ఆదివాసులే.

ఈ భూమిలో కొంత భాగం
639 బిఘా (అంటే సుమారు 100 ఎకరాలకు పైచిలుకు) స్వాతంత్రం వచ్చిన కొద్ది కాలానికి, అంటే 17 డిసెంబరు 1955 నాడు, అప్పటి మోతుబరి కాంగ్రెస్ కి దగ్గరగా ఉండే మహేశ్ ప్రసాద్ సిన్హా నడిపే ఓ కోపరేటివ్ సొసైటీకి భూమిని బదలాయించారు.అయినా ఆదివాసులే దానిపైన సాగు చేస్తున్నారు.

మహేశ్ ప్రసాద్ సిన్హా డబ్బున్న వాడు మోతుబరి కావడం వలన, తన పిల్లలను ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేసి మంచి పొజిషన్లో నిలబెట్టుకో గలిగాడు.

ఆయన తన కూతురు ఆశాని ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాత్ కుమార్ మిశ్రాకి ఇచ్చి పెళ్ళి చేసారు.1989లో ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాత్ కుమార్ మిశ్రా తన భార్య ఆశా మిశ్రాకి ఆమె తండ్రి కో-ఆపరేటివ్ సొసైటీ భూమిలో 148 బిఘా (అంటే సుమారు 30 ఎకరాలు) బదలాయించారు.

ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాత్ కుమార్ మిశ్రా కూడా మంచి బాగా స్థిరపడ్డాడు. తన కూతురు వనితా మిశ్రాని మరో యోగ్యుడైన ఐఏఎస్ ఆఫీసర్ బీహార్ క్యాడర్ (1981 బ్యాచ్) భాను ప్రతాప్ శర్మకి ఇచ్చి పెళ్ళి చేసాడు. ప్రస్తుతం ఈయన ప్రధానమంత్రి నియమించిన బ్యాంక్ బోర్డు బ్యూరో చైర్మన్.(బ్యాంక్ బోర్డు బ్యూరో చేసే పని ఏమనగా జాతీయ బ్యాంకులకు నిధులు ఎలా సమకూర్చాలి అన్న విషయంపై పనిచేస్తుంది.ఇలా ఖాతాదారుల నుంచి అత్యధికంగా సేవింగ్స్ రూపంలో నిధులు జాతీయ బ్యాంకులకు వచ్చేలా చేయడం.
అలా వచ్చిన నిధులు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వంటి వారు ఏ తీరున ఎగరేసుకుపోతారు అనేది మనకు తెలిసిందే)గతంలో ఈయన కాగ్ వినోద్ రాయిని రీప్లేస్ చేస్తూ ఆ పదవిపై కూర్చున్నారు.

సరే విషయానికి వస్తే భాను ప్రతాప్ శర్మ, భార్య వనిత శర్మ (అలియాస్ కిరణ్)కి ఆమె తల్లి ఆశా మిశ్రా, మోతుబరి తండ్రీ మహేష్ ప్రసాద్ సిన్హా కో-ఆపరేటివ్ సొసైటీ పేరున కొట్టేసిన భూమిలో తనకి వచ్చిన వాటాని కూతురికి బహుమతిగా ఇచ్చింది.

ఉమ్భా గ్రామ సభ భూమి యాజమాన్యం బహుమతి రూపంలో తరతరాలుగా మారిపోతున్నది. అయినా కూడా ఆ భూమిపై ఆదివాసులే సాగు చేస్తున్నారు. కారణం వారికి సంబంధించినంతవరకు ఆ భూమి గ్రామసభ భూమి. దాని యజమాని గ్రామ సభే అనుకుంటున్నారు.

అయితే 2017లో ఉమ్భా గ్రామానికి పోలీసులు వచ్చి, ఈ భూములను ఖాళీ చేయండి. లేకపోతే చాలా కష్టమైన పరిస్థితుల్లో మీరు ఎదుర్కోవలసి ఉంటుంది అని చెప్పారు.దానితో ఇక్కడ కొద్దిగా భూమి పట్టాలు కావాలని చిన్న చిన్న పాటి పోరాటాలు ఉద్యమాలు వంటివి కనిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వనిత మిశ్రా 2017లో తాత రాజకీయంగా తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా కొట్టేసిన గ్రామ సభ భూమిని ఐఏఎస్ ఆఫీసర్ బార్య హోదాలో నేటి క్రొత్త తరం మోతుబరి సమాజ్ వాది పార్టీకి దగ్గర అయినా yagya దత్ కి 2 కోట్లకి అమ్మేసారు.

ఈయన జూలై 17న తన భూమిని సొంతం చేసుకునేందుకు నలభై యాభై ట్రక్కులలో ఆయుధాలు చేతపట్టిన మనుషులతో పాటు ఉమ్భా గ్రామానికి తరలివచ్చారు

వర్షాలు పడి పొలాల నిండుగా నీరు ఉన్న నేపథ్యంలో ఉనుపులు మొదలు పెట్టారు.

దీనితో గ్రామంలో ఉన్న ఆదివాసీలంతా తరాలుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్న మా గ్రామ సభ భూమి. దీనిలో మీరు వచ్చి వ్యవసాయం చేస్తే మేం ఎక్కడికి పోయేది అని ఎదిరించారు.

మీరు ఇక్కడ పంట పొలాల్లో పంటలు పండిస్తుంటారు.కానీ మేము సర్కారీ ఆఫీసులో కాగితాలు పండించాము.

ఈ భూములపై చట్టబద్ధమైన అధికారం నాకుంది. ఈ భూమిని నేను కొనుక్కున్నాను అని yagya dutt బెదిరించారు.

దానితో ఇరుపక్షాల మధ్య కర్రలతో పోట్లాడుకునే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

దీనితో కర్రల కన్నా సుపీరియర్ అయినా పిస్టల్ తీసి ఆదివాసీలపై కాల్పులు జరిపించారు. ఫలితంగా ఘటనా స్థలం వద్ద పది మంది చనిపోగా ఇరవై నుంచి ముప్పై మంది గాయాలపాలై ఆస్పత్రి పాలయ్యారు.

వీరంతా పంటలు పండించడం మాత్రమే తెలిసిన ఆదివాసీలు.

కాగితాలు పండించటం రాని వారు. కాగితాలు పండించాలి అంటే వీరికి రాజకీయ అధికారం ఉండాలి. వీరి పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లను పెళ్లి చేసుకోవాలి.

అప్పుడే వీరు కాగితాలు కూడా పండించ గలిగిన రైతులు కాగలిగేవారు.

కాగితాలు పండించే రైతుల కోసమే స్వాతంత్రానంతరం మనం సాధించిన ప్రజాస్వామ్యం పనిచేస్తున్నది.

ఇది కేవలం ఒక గ్రామం వ్యధ.ఓవరాల్ గా సోన్ భద్ర జిల్లా గురించి ఓసారి పరిశీలిద్దాం.

సొన్ భద్ర ఉత్తర ప్రదేశ్ లో రెండవ అతి పెద్ద జిల్లా. బీహార్ ,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘర్ జార్ఖండ్, యూపీ చుట్టు ఉన్న జిల్లా ఇది. ఇక్కడ సొన్ నది ప్రవహిస్తుంది.వింధ్య, కైముర్ పర్వత శ్రేణుల మధ్య అటవీ ప్రాంతంలో వుంది సొన్ భధ్ర. దేశ తొలి ప్రధాని దీన్ని భారతదేశ స్విట్జర్లాండ్ అని కొనియాడి మురిసిపోయారు.దీన్ని బారత దేశ ఎనర్జీ కాపిటల్ అంటారు. ఈ జిల్లా ఖనిజ సంపదతో నిండి సుసంపన్నమైనది. ఇక్కడ బాక్సైట్, లైమ్స్టోన్, కోల్,గోల్డ్ నిండిన భూమి వుంది. సొన్ నది వల్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇంత సంపద వున్నా జిల్లాలో ప్రజలు ఎలా ఉండాలి....?
కానీ ఎలా ఉన్నారు అన్నది చూద్దాం.

అత్యధిక బీపీల్ కార్డులు కలిగిన జిల్లాగా పేరు గడించింది. 2006లో పంచాయతీరాజ్ మంత్రాలయం సోన్ భద్ర జిల్లాను అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకటించింది. ప్రస్తుతం సొన్ భద్ర జిల్లాకు వెనుక బడిన జిల్లాలకు అందే గ్రాంటు అందుతున్నది.భు మఫీయకి అడ్డా అయిపోయింది. దాని పర్యవసానమే ఉమ్భా గ్రామంలో జులై 17 జరిగిన సంఘటన.

సొన్ భద్ర గ్రామస్తులకి ఇంత దరిద్రం మిగిల్చిన ప్రకృతి వనరు ఎవరిని ధనవంతులని చేసింది అన్న అర్బన్ నక్షల్ ప్రశ్న మీకు గనక వస్తే....

చదవండి జవాబు దొరుకుతుంది.....

1956 లో జవహర్ లాల్ నెహ్రు హయాంలో చుఱ్క్ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చారు.ఇది రోజుకు 800 టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేసేది.

1962లో హిండల్కోకు అనుమతులు దొరికాయి అల్యూమినియం ప్లాంట్ కోసం కాలక్రమంలో అక్కడ అ ధర్మల్ పవర్ ప్లాంట్ ని కూడా పెట్టింది

1965 ఆదిత్య బిర్లా కెమికల్ ఫ్యాక్టరీకి ప్రభుత్వ అనుమతి పొంది అటుపై 1967లో హైటెక్ కార్బన్ పేరుతో బిర్లా గ్రూపు సొంత కెమికల్ ఫ్యాక్టరీ తో పాటు పవర్ ప్లాంట్ కూడా పెట్టింది.

1971 లో డాలా సంస్థ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతి పొందింది.

1980 లో చునార్ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టారు.

1998లో Grasim ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో ఓ కెమికల్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది. ఆనక సొంతంగా పవర్ ప్లాంట్ కూడా పెట్టింది.

మన సర్వేల సారు లాంకో గారు కూడా సొన్ భద్ర లో పాగా వేశారు.

ఈ జిల్లాలో గోవింద్ బల్లబ్ పంత్ సాగర్ నీటి ప్రాజెక్ట్ వుంది. ఇది విద్యుత్ ఫ్యాక్టరీలకీ బాగా పనికి వచ్చింది. ఇది కాకుండా 1961 లో పెద్ద డ్యామ్, రిహ్యాండ్ డ్యామ్,చిన్న డ్యామ్, ఓబ్ర కట్టారు. ఇవన్ని విద్యుత్ కంపెనీలకు పనికొచ్చాయి. విద్యుత్ ప్రాజెక్టులకు ఈ జిల్లా నిలయమయింది. సింగర్ఔలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్, రిహ్యాండ్ థర్మల్ పవర్ స్టేషన్, రేణుసాగర్ hindalco వాళ్ల పవర్ ప్రాజెక్ట్, ఇవన్నీ ప్రైవేటు వారి వైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి , కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

వీరంతా ఏదో ఒక ఫ్యాక్టరీకి అనుమతి పొంది లాభాలు గడించిన తర్వాత అక్కడి బాక్సైట్ తవ్వకాల లోనూ, limestone ఫ్యాక్టరీలు పెట్టడంలోనూ, సిమెంటు ఫ్యాక్టరీలు పెట్టడంలోనూ, అక్కడినుంచి ఖనిజ సంపద తరలించడంలో బాగా సంపాదించారు. వీరందరికీ ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయి.

72 ఏళ్ళ స్వాతంత్రంలో ఇంతమంది కార్పొరేట్ మహామహులకు ఇన్ని రకాల అనుమతులు దొరికాయి. ఇలా అనుమతులు ఇచ్చిన ప్రతిసారి చెప్పే మాట ఒక్కటే పరిశ్రమలు పెడతారు ఉద్యోగాలు వస్తాయి అని కానీ జరిగేది మాత్రం వేరు పర్యావరణం దెబ్బతినడం అక్కడి ఖనిజ సంపద అంతా పట్టుకొని పోయి అక్కడి వారిని బిచ్చగాళ్ళుగా మార్చి వేయటం ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఆదివాసులు గుండెమీద చెయ్యేసకుని గ్రామ సభ భూమిని నిర్భయంగా దున్నుకొని నాలుగు గింజలు పండించుకుని గౌరవ ప్రదమైన జీవితం బ్రతకలేని దుస్థితిలో ఉన్నారు. ప్రతి వెనుకబడిన జిల్లాని గమనించినట్లయితే, సహజ వనరుల సంపదలున్న జిల్లాలుగా కనపడతాయి. అయినప్పటికి అక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ఉమ్భా లాంటి గ్రామాలలో ఆదివాసి రైతులను చంపేసే సంఘటనలు జరిగినప్పుడు అక్కడికి ఏ రాజకీయనాయకుడు లేదా నాయకురాలు వెళ్ళారు...? ఆ రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏమిటి అన్న అంశాలు మాత్రమే పత్రికలలో వస్తే సరిపోదు. ఉమ్భా గ్రామంలో ప్రియాంక గాంధీ అరెస్టు అయ్యిందా లేదా అన్నది చర్చనీయాంశం కానేకాదు. మన ప్రజాస్వామ్యం ఎవరి కోసం పనిచేస్తున్నది కీలకమైన ప్రశ్న. కానీ ప్రియాంక గాంధీ అరెస్టయితే కానీ ఉమ్భా వంటి గ్రామాల పరిస్థితి మన కళ్ళ ముందుకు వార్తలుగా రాలేని పరిస్థితి మనముందు ఉంది. జాతీయ మీడియాలో భూవివాదంలో చనిపోయిన కొంతమంది రైతులు అన్న చందాన వార్తలు ,ప్రియాంక గాంధీ అరెస్టు తర్వాత ఉమ్భా గ్రామంలో రాజకీయం పండిస్తున్న ప్రియాంక అన్న వార్తలు మన సిస్టంలో అట్టడుగున ఉన్న వారి పరిస్థితికి సంబంధించిన వార్తల ట్రీట్మెంట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో వుంది.

- అరుణ.

ఫేస్‌బుక్ పోస్టు లింక్ : https://www.facebook.com/aruna.aruna.77582359/posts/2311837442411037

Keywords : UP, Umba, Land, Rift, Adivasis, IAS, police
(2020-05-25 18:08:00)No. of visitors : 569

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !

రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర గోవింద్‌నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్‌పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

Search Engine

వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
more..


సోన్‌భద్ర