కశ్మీర్‌ ఓ కన్నీటి చుక్క!


కశ్మీర్‌ ఓ కన్నీటి చుక్క!

కశ్మీర్‌

రచయిత , జర్నలిస్టు ʹరమేశ్ బాబు వొమ్మిʹ తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన ఆర్టికల్ మీ కోసం...

తనని ఒంటరి చేసిన తర్వాత
తనువంతా తూట్లు పొడిచిన తర్వాత
ఉనికి ప్రశ్నని ఉరి తీసిన తర్వాత
ఉక్కుబూట్ల పదఘట్టనల తర్వాత
మనసు అద్దంపై తూటాలు కురిపించిన తర్వాత
గుండెని చీల్చి రక్తం పిండేసిన తర్వాత
నిర్బంధ చట్టాల ఉక్కిరిబిక్కిరి తర్వాత
ఒక ఆవరణని వ్రణంగా మార్చిన తర్వాత
నవనాడుల్లోకి కాలకూటం చిమ్మిన తర్వాత
సంకెళ్ల పీడకలల్ని కళ్లల్లోకి చొప్పించిన తర్వాత
నిలువునా కూల్చివేతకి పాల్పడ్డ తర్వాత
లోయనిండా శవాలను పాతిన తర్వాత
నమ్మకాన్ని వమ్ముచేసిన తర్వాత
అనుమానపు కత్తులతో వేటాడిన తర్వాత
సయోధ్య వారధుల్ని ధ్వంసం చేసిన తర్వాత
చంపుడు పందెం తర్వాత
వారి భాష వినగల చెవుల్ని పూడ్చేసుకున్న తర్వాత
కశ్మీర్‌ ఎప్పుడో జీవశ్చవంగా మారింది..
అయినా కసి తీరలేదు
కొన ఊపిరిని సైతం రాష్ట్ర విభజనతో
బలి తీసుకుంటున్నారు..

*****

కశ్మీరీలపై కశ్మీరేతర ప్రాంత మత రాజకీయశక్తుల ఆధిపత్యం ఈరోజు మరింత కర్కశరూపు దాల్చింది. కశ్మీర్‌ నుంచి కశ్మీరీలను పరాయిని చేసే ఏ రాజకీయ నిర్ణయాన్ని అయినా సరే- లక్ష గొంతుల గళాన్నై నేను గట్టిగా వ్యతిరేకిస్తాను.
నేను కశ్మీరీల పక్షం. అక్కడి ప్రజల ఆకాంక్షల పక్షం. అక్కడి ప్రజల గుండెచప్పుళ్ల పక్షం. సగటు కశ్మీరీల ఆత్మగౌరవ పక్షం. కశ్మీర్‌ అంటే నా దృష్టిలో రెండు దేశాలమధ్య సమస్య కాదు. సరిహద్దు ప్రాంత యుద్ధవిన్యాసాల ప్రయోగశాల కాదు. సైనికులు, ఉగ్రశిబిరాల మధ్య సాగే మృత్యు సయ్యాట కాదు. సలపరించే గాయం కాదు. సలసల మరిగే అగ్నిగుండం కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆడే వికృతక్రీడ అసలే కాదు.
కశ్మీర్‌ అంటే నా దృష్టిలో మనలాగే రక్తమాంసాలున్న, నిండు మనసు ఉన్న, ఆశలూ- అభిప్రాయాలున్న ప్రజలు కలిగిన ప్రదేశం. ఆ ప్రదేశం కచ్చితంగా అక్కడి వారిదే. వారు ఏమి కోరుతున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, ఏ కలులు కంటున్నారో, తమ భవితవ్యంపై ఏమి ఆలోచిస్తున్నారో అనేదే ప్రధానం. వారి బతుకులపై సాగుతున్న రాజకీయ సవారీకి ఇంకొంచెం రక్తం దట్టించే ఏ చర్య చేపట్టినా.. ఇకపై వారిని మరింత హింసాత్మక పథంలోకి నెట్టేసినట్టే. నేడేం జరిగిందో ఈ దేశ ప్రజలంతా చూశారు. కాషాయ పాలకులు ఏంచేస్తారో అదే చేశారు. అందులో ఆశ్చర్యం ఏమీలేదు.
వ్యక్తులని మందిగా, మందిని సమూహంగా, సమూహాన్ని ఒక అస్తిత్వం కలిగిన సభ్యసమాజంగా కూర్పు కుదిర్చే క్రమంలో అంతర్లీనంగా ఒక అవగాహన ఉంటుంది. అందులో వ్యక్తిగత, సమాజహిత, రాజకీయ సమ్మత అంశాల విషయంలో భిన్నాభిప్రాయాలు కలగలిసే ఉంటాయి. అదే సమయంలో విశాల దృక్పథంతో కూడిన ఏకసూత్రతా ఉంటుంది. ఈ రెండింటి సమన్వయమే ఒక దేశం అనే ఏకత్వంతో కూడిన భావనకి పాదులు వేస్తుంది. ఈ నియమం అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో కాకుండా ఒక బలాత్కార చర్యగా ఉంటే మాత్రం అది ఎప్పటికీ విపరిణామానికే దారితీస్తుంది.
ఇప్పుడు మనం చేయాల్సిన పని కశ్మీరీల మనసు గెలుచుకుని వారిని దరిచేర్చుకోవడం. అంతేకానీ- వారి తలపై ఉక్కపాదం మోపి నిర్బంధ కౌగిలిలోకి లాక్కుంటే.. వారిని మరింత దూరంచేసుకోవడమే అవుతుంది కానీ.. ప్రేమపూర్వక సయోధ్య కానేకాదు. రాజకీయంగా ఆ రాష్ట్రాన్ని ఎన్ని విభజనలు చేసినా సరే... అది ఎప్పటికీ జమ్మూకశ్మీరమనే అస్తిత్వాన్ని కోల్పోదని గుర్తుంచుకోవాలి.
జమ్మూకశ్మీర్‌ విభజన అక్కడి ప్రజల ఇష్టప్రకారమే జరిగిందా? ఆ రాష్ట్రాన్ని విభజించమని ఎవరు కోరారు? ఎప్పుడు కోరారు? ఎవరిని కోరారు? కశ్మీర్‌ సమస్యకి ఇదే సరైన, ఏకైక, అంతిమ పరిష్కారమని ఎవరు తీర్మానించారు? ఎక్కడ చర్చ జరిగింది? కనీసం ఈ చర్యకి ముందు అక్కడి ప్రజల అభీష్టం గురించి ఎవరు తెలుసుకున్నారు? అక్కడి ప్రజల ఆమోదం, ఆకాంక్ష లేకుండా జమ్మూకశ్మీర్‌ని రెండు ముక్కలు చేయడాన్ని ఎలా సమర్థించుకోగలరు?
ప్రస్తుతం చట్టసభల్లో పైచేయిగా ఉన్నవారు తాము ఏమైనా చేస్తామని అనుకుంటే సరిపోతుందా? అధికారం అశాశ్వతం అన్న ఇంగితం తెలిసినవారు ఎవరైనా దుస్సాహస నిర్ణయాలు తీసుకుంటారా? ఇప్పుడు అంటించిన మంటలు ఎప్పటికి చల్లారుతాయి? ఆ మంటల్లో రాజకీయ నాయకులు చలికాచుకుంటారేమో కానీ... సమిధలయ్యేది మాత్రం ప్రజలు.. ఈ దేశ ప్రజలు.. సగటు కశ్మీరీలు..
అన్నిటికీ దండోపాయమే మేలు అనుకుంటే అది ప్రజారాజకీయంగా వర్ధిల్లబోదు. సైన్యంతో జమ్మూకశ్మీర్‌లో శాంతిని స్థాపించాలనుకంటే అది ఎప్పుడో సాధ్యపడి ఉండేది. ఎందుకంటే ఏళ్లతరబడి సిపాయి దండుల కనుసన్నల్లోనే కశ్మీరం బిక్కుబిక్కుమంటోంది. ఇప్పుడు చేయబోయే ప్రయోగం మాత్రం పరమ వికృతంగా ఉండబోతోందని నా అభిప్రాయం. కశ్మీర్‌ నుంచి కశ్మీరీలను వేరు చేసే దుర్మార్గానికి తెరతీయడం అనే బరితెగింపు నా కనులకు కడుతోంది.
కశ్మీర్‌ రాష్ట్ర విభజన అనే ఇవాళ్టి నిర్ణయం వల్ల నాలో నాతో ఇన్నాళ్లుగా కలిసి ఉన్న కశ్మీరీని దూరం చేసినంత బాధ కలుగుతోంది నాకు. నాకింత నొప్పిని కలిగిస్తే నేనెలా మాట్లాడకుండా ఉండగలనూ? ఈ క్షణాన కశ్మీరీ ప్రజల హృదయాల్లో ఏ భావాలు రగులుతున్నాయో నేను అర్థంచేసుకోగలను. మీకు వచ్చిన ఈ కష్టాన్ని భారత్‌లోని కశ్మీరేతర ప్రాంత వ్యక్తిగా పంచుకుంటున్నాను. సంఘీభావం తెలుపుకుంటున్నాను.
- రమేశ్ బాబు వొమ్మి

Keywords : jammu, kashmir, bjp, modi, amit shah, stand with kashmir
(2020-05-29 03:59:18)No. of visitors : 752

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

Search Engine

వీవీ,సాయిబాబాల‌ జీవించే హక్కును కాపాడండి...పౌరహక్కుల సంఘం
కేసీఆర్ కు తెలంగాణ, ఏపీకి చెందిన 27 మంది ప్రముఖ రచయితల విజ్ఞప్తి
వీవీ, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి -సామాజిక తెలంగాణ మహాసభ
వరవరరావును వెంటనే విడుదల చేయాలి - సీపీఐ (ఎంఎల్) జనశక్తి డిమాండ్
వరవరరావు ఆరోగ్యంపై ఆయన సహచరి హేమలత ప్రకటన‌
వీవీ, సాయిబాబాలతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ప్రదర్శనలు
సామాజిక కార్యకర్తల‌ జీవించే హక్కును కాలరాస్తున్న‌ పాలకుల విధానాలపై రేపు(మే29) నిరసన
మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు
దయనీయస్థితిలో జి.ఎన్.సాయిబాబా ఆరోగ్య పరిస్థితి- సహచరి వసంతకుమారి ఆందోళన
వరవరరావును విడుదల చేయాలి -జర్నలిస్టు,హక్కుల,ప్రజా సంఘాల డిమాండ్
వరవరరావు విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలి..వివిధ పార్టీల డిమాండ్
మా నాన్నను వెంటనే విడుదల చేయండి..వరవరరావు కూతుర్ల లేఖ‌
వీవీ, ఇతర సామాజిక‌ కార్యకర్తలున్న తలోజా జైలుతో సహా మూడు జైళ్ళలో కరోనాతో ముగ్గురు ఖైదీల మృతి !
తలోజా జైల్లో వ్యాపించిన కరోనా...అనారోగ్యంతో ఉన్నవీవీని తక్షణం విడుదల చేయాలని విరసం డిమాండ్
పింజ్రా తోడ్ కార్యకర్తలకు బెయిల్...కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ అరెస్టు
రాజ్యాంగాన్ని, ప్రజల స్వేచ్ఛ, హక్కులను కాపాడడాన్ని సుప్రీం కోర్టు మానుకుంది...మార్కండేయ్ ఖట్జు
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)
నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (1)
ఇది నక్సల్బరీ ప్రజ్వరిల్లినరోజు....అడవిలో ప్రవేశించాలనే ఆశయం నెరవేరిన రోజు...
హిందూత్వ లాఠీలు:న్యాయ‌వాదిపై పోలీసుల దాడి - ముస్లిం అనుకొని కొట్టామని సమర్ధన‌
Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఇద్దరు ʹపింజ్రా తోడ్ʹ కార్యకర్తల అరెస్టు
కరోనా వైరస్ విపత్తులో కూడా ప్రజల జీవించే హక్కుకు బాధ్యత ప్రభుత్వానిదే - CLC
చిరు వ్యాపారి వద్ద మామిడి పళ్ళు దోచుకున్న జనం....ఆయన దుంఖం చూసి 8లక్షల డొనేషన్ ఇచ్చిందీ జనమే
1800 కిలో మీటర్లు ప్రయాణించి ఇంటికొచ్చిన వలస కూలీకి తూఫాను దెబ్బకు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది.
more..


కశ్మీర్‌