వాళ్లు తమ నేల మీద హక్కును కోరుకుంటున్నారు


వాళ్లు తమ నేల మీద హక్కును కోరుకుంటున్నారు

వాళ్లు


బిజెపి దాని మాతృసంస్థ, దాని పూర్వ సంస్థలు, అవి ఏ రూపంలో ఉండి ఉన్నా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదు. అందుకే వారిలో లౌకిక, ప్రజాస్వామిక విలువలు లేవు.
స్వాతంత్రోద్యమ ఏకైక ప్రాథమిక విలువ ʹలౌకికతత్వంʹ అనే విషయం ఈనాటికీ వారి మెదళ్లలోకి ఎక్కక పోవడానికి కారణం .. ప్రజాస్వామిక విలువల సమాజంలోకి వాళ్ల తాత్విక ప్రయాణం సాగక పోవడమే. అందుకే వాళ్లు ʹరాజభరణాలు రద్దు చేస్తున్న కాలంలో .. రాజులకు భరణాలు ఉండాలని డిమాండ్ చేయడం ద్వారా వాళ్లు ఫ్యూడల్ రాచరిక వైభవాన్ని పునః ప్రతిష్టించాలని కోరుకున్నారు.

అదెలా ఉన్నా.. స్వాతంత్యోద్యమ కాలంలో స్వాతంత్రోద్యమం వంటి ʹపాపపుʹ పనికి పాల్పడలేదని, బ్రిటిష్ ప్రభుత్వం ఏదో అనుమానం మీద అరెస్టు చేసిన సందర్భంలో వాజపాయి కోర్టులో వాగ్ఞ్మూలం ఇచ్చాడు. అదే ʹవీరʹసావర్కర్ అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగి ఉంటానని అండర్ టేకింగ్ రాసిచ్చి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అదే భగత్సింగ్ తన అమరత్వాన్ని భారతదేశం విప్లవాత్మకంగా గుర్తుంచుకుంటుందని ప్రకటిస్తూ.."నన్నెక్కనివ్వండి బోను" అంటూ ఉరికొయ్యలకు ఎదురేగిన సాహసాన్ని రికార్డు చేశాడు. అందుకే ఆయన్ను మనం ʹషహీద్ భగత్సింగ్ʹ అంటున్నాం. భగత్సింగ్ ను క్లెయిం చేసుకొనే ఎటువంటి నైతికత బిజెపికి లేదు. కానీ, సిగ్గూ, లజ్జా తరహా తమకు లేకపోయినా, వారు పోషించిన పాత్ర చరిత్రలో రికార్డు అవుతుందన్న ఇంగితం కూడా వారికి లేదు. ఇక ʹవీరʹసావర్కర్ లో వీరత్వం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ʹదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం పాపంʹ అని భావించిన బిజెపిలో దేశభక్తి కూడా ʹనేతిబీరʹ చందమేననేది విస్మరించలేని చారిత్రక వాస్తవం.

ఇప్పుడు చెప్పొచ్చేదేమిటంటే 1947 నాటికి స్వతంత్ర సంస్థానంగా ఉన్న కశ్మీర్, భారత దేశానికి బ్రిటిషోడు స్వాతంత్యం ఇస్తున్నపుడు తను కూడా స్వతంత్ర దేశంగా ఉండాలని కశ్మీరు ప్రజలు అనుకుంటే ఎవరికైనా అభ్యంతరం ఉండనక్కర లేదు, కదా?
అయితే, గాంధీ వలె, కశ్మీర్ ప్రజల ఆదరణ విశేషంగా పొందిన షేర్- ఎ- కశ్మీర్ షేక్ అబ్దుల్లాకు కశ్మీరు ʹప్రధానమంత్రిʹగా, కశ్మీరు భూభాగం అప్పటి టాటాల, బిర్లాల, అంబానీల లేదా దురాశ పరులైన ఆర్జనపరుల పాలుకాకుండా 370 ఆర్టకిల్ ను డిమాండ్ చేసి తీసుకున్నారు.ʹ370 ఆర్టికల్ కశ్మీరు ప్రజల హక్కుʹ అది నెహ్రూనో, ఇంకెవరో భిక్షగా ఇచ్చినది కాదు. నెహ్రూ, రాజా హరిసింగ్ ల చీకటి ఒప్పందం కూడా కాదు. సర్దార్ వల్లభ భాయ్ వ్యతిరేకించిందీ లేదు. ఇదంతా స్వాతంత్రోద్యమంలో ఏ పాత్రా లేని భారతీయ జనతాపార్టీ ఉబుసుపోకకు చేసే పద్ధతి ప్రకారపు గోబెల్స్ ప్రచారం. ఒకవేళ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ వ్యతిరేకించాడనే అనుకుందాం. ఆయన వ్యతిరేకించినా అది ఆగలేదంటే .. అది తప్ప ఇంకో మార్గం లేదనే కదా అర్థం! వాస్తవానికి అప్పుడు 370 ఆర్టికిల్ అనే బిస్కెట్ కు కశ్మీరు ఒప్పుకోవలసిన అవసరం లేదు. అది కశ్మీరు కంటే భారత్ కే ఎక్కువ అవసరం.

తమదైన స్వతంత్ర దేశమే తమకున్నప్పుడు భారత్ వేసే మస్కా బిస్కెట్ వారు తలొగ్గి, భారత్ కు వారు అధీనం కానక్కరలేదు. అందుకే ʹ370 ఆర్టికిల్ లో ఏంలేదుʹ అని బాలగోపాల్ ఊరికే అనలేదు.
ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది 370 ఆర్టికిల్ తో కశ్మీర్, భారతదేశంతో అంటుకట్టబడింది. ఇక ఆ అంటు తెగిన తర్వాత భారతదేశంలో అంతర్భాగంగా ఉండాల్సిన అవసరం కశ్మీరుకు లేదు.
భారతదేశ దేశభక్తి సెంటిమెంటుతో కశ్మీర్ ప్రజలకు సంబంధం లేదు.
వాళ్లు ఒక శ్రీలంక వలె, బర్మా వలె కనీసం పాకిస్థాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ వలె విడిపోతానంటె కాదనడానికి ప్రాంతేతర భారతీయులకు ఏదైనా అధికారం గానీ, హక్కు గానీ ఎందుకు ఉంటుంది?

విశాల కశ్మీర్ భూభాగాన్ని, లఢఖ్ భౌగోళిక వనరులను అప్పనంగా అంబానీలకు, ఆదానీలకు కట్టబెట్టే అధికారం, పీఠం మీద కూర్చున్న అమిత్షా, నరేంద్ర మోడి సర్కారుకు ఎందుకు ఉంటుంది?

ప్రజాస్వామికవాదులు, ఆధునిక, ప్రగతి శీల భావాలు ఉన్న వాళ్లెవరు బిజెపి మైండ్ సెట్లోకి వెళ్లి కశ్మీర్ ప్రజలకు ద్రోహం చేసేలా ఆలోచించవద్దు.

కశ్మీర్ ప్రజలు నమ్మి భారతదేశం తో 370 ఆర్టకిల్ ఒప్పందంతో అనుబంధంలోకి వచ్చారు. అదే లేకుంటే వాళ్లు స్వతంత్రులు.వాళ్లు భారతదేశ సాంప్రదాయక బానిసలుగా ఉండనక్కర లేదు. వారికి విశ్వాసఘాతుకం జరిగింది. ఇక వారికి వారిదైన పోరాట మార్గం ఉండడం తప్పు కాదు. భారతదేశం వలె వేరే భూభాగం మీద ఆధిపత్యం వహించాలని అనుకోవడం లేదు.

వాళ్లు తమ నేల మీద హక్కు ను కోరుకుంటున్నారు.

--బాసిత్,
కార్యవర్గ సభ్యుడు,
విప్లవ రచయితల సంఘం.

Keywords : kashmir, virasam, jammu, army,
(2019-08-21 20:28:31)No. of visitors : 166

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


వాళ్లు