ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఈశాన్య రాష్ట్రాలేనా ?

ఇక

రాజ్యాంగంలో 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్ము కశ్మీర్ ప్రత్యేక పరతిపత్తిని ఒక్క దెబ్బతో కాలిరాసేసిన నేపథ్యంలో తమ పరిస్థితి కూడా అలాగే అవ్వొచ్చనే భయాందోళ‌నలు ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో బయలుదేరాయి. తమకు ప్రత్యేక హక్కులు కల్పించిన 371 ఆర్టికల్ ను కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందనే భయం వాళ్ళను వెంటాడుతోంది. ఏ రెడ్‌ అలర్ట్‌ టు ది పీపుల్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్ట్‌ʹ అంటూ మిజోరం మాజీ ముఖ్యమంత్రి లాల్‌ తన్హావులా చేసిన ట్వీట్ ప్రజల భయానికి తగ్గట్టుగానే ఉన్నది.

నాగాలాండ్‌లో ఈ ఆందోళన ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడంతో ʹఅలాంటి ఆందోళన ఏమీ అవసరం లేదు. 371 ఏ ఆర్టికల్‌ కింద మీకు కల్పిస్తున్న హక్కులు పవిత్రమైనవిʹ అంటూ నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్ రవి ఓ ప్రకట్న చేశారు. అయితే ఆ ప్రకటనను విశ్వసించడం లేదు. జమ్ము కశ్మీర్ లో మహ్బూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ ను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పింది. అలా చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ ఆర్టికల్ ను రద్దు చేసిందినే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు.

ప్రత్యేక నాగాలాండ్‌ దేశం కోసం నాగాలు కొన్ని దశాబ్దాలపాటు సాయుధ పోరాటం జరిపారు. ఆ తర్వాత వారు కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ రాష్ట్రానికి మరింత స్వయం ప్రతిపత్తి కావాలంటూ పలు నాగా గ్రూపులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. వారితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు మధ్యవర్తి రవినే రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ʹమాకున్న హక్కులను రద్దు చేస్తారనే భయం ఇప్పుడు ప్రతి నాగాను వెంటాడుతోంది. మా ప్రత్యేక రాజకీయ చరిత్ర, సామాజిక సంస్కృతిని పరిరక్షించుకునేందుకు 371 ఏ కన్నా మంచి చట్టాలు కావాలంటూ మేము చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో 371ఏను కేంద్రం రద్దు చేయాలనుకోవడం అంతకన్నా హస్వ దృష్టి మరోటి ఉండదుʹ అని నాగా విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు నైనతో అవోమి వ్యాఖ్యానించారు. దేశంలోని మైనారిటీల పట్ల బీజేపీకి ప్రత్యేక అభిమానం లేకపోవడం, పార్లమెంట్‌లో వారికి ఎదురులేకపోవడం వల్ల ఇలాంటి భయాలు నాగాలకు కలుగుతున్నాయని మెజారిటీ నాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ʹనాగా హొహోʹ అధ్యక్షుడు పీ చుబా ఓజికుమ్‌ అన్నారు.

జమ్మూకశ్మీర్ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని క్రిషక్ ముక్తీ సంగ్రామ్ సమితి(కెయంఎస్‌ఎస్) సలహాదారుడు, ఆర్టీఐ ఉద్యమకారుడు అఖిల్ గోగోయ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ వ్యవహారం లాంటి రాజకీయపరమైన చర్యలు తీసుకునేముందు ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానాలను, సంస్కృతులను గౌరవించాల్సిన అవసరం ఉందని మణిపూర్ గిరిజన ఫోరానికి చెందిన ఒనిల్ క్షేత్రియుం అన్నారు.

మిజోరాం రాష్ట్రంలోనూ బయటి వ్యక్తులు స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు వీళ్లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు లాల్ థన్వాలా కూడా మిజోరాం భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

"ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇదొక రెడ్ అలర్ట్. రాజ్యాంగపరమైన రక్షణ కలిగిన మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇది ముప్పుగా మారింది. ఆర్టికల్ 35ఎ, ఆర్టికల్ 370లను రద్దు చేస్తే, మిజోరాం గిరిజనులకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 371జీ ప్రమాదంలో పడినట్లే" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Keywords : jammu kashmir, assom, manipur, nagaland, mizoram, bjp, article 370, article371
(2024-04-05 21:26:33)



No. of visitors : 965

Suggested Posts


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇక