కాశ్మీర్ ప్రజల హక్కులపై సాగిస్తున్న దాడిని ఖండించండి - పౌరహక్కుల సంఘం


కాశ్మీర్ ప్రజల హక్కులపై సాగిస్తున్న దాడిని ఖండించండి - పౌరహక్కుల సంఘం

కాశ్మీర్

జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 35ఎ ని రద్దుచేసి కాశ్మీర్ ని రెండుగా విభజించడంపై తెలంగాణ పౌరహక్కుల సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం....

విలీన సమయంలో భారత ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కే ఆర్టికల్ 370 స్వయం ప్రతి పత్తి హక్కు రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్దరించాలి.

భారతదేశంలో అధికార మార్పిడి జరగక ముందు బ్రిటీష్ ఇండియాతోపాటు అనేక స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. అందులో కాశ్మీర్ కూడా ఒకటి. లార్డ్ మౌంట్ బాటెన్ ప్రణాళిక ప్రకారం ఈ సంస్థానాలు తమకు తాము స్వతంత్రంగా ఉండొచ్చు లేదా ఏర్పడబోయే ఇండియా, పాకిస్థాన్లలో ఎందులోనైనా చేరవచ్చు. అంటే నాటికి కాశ్మీర్ ఒక స్వతంత్ర సంస్థానంగా ఉన్నది అనే విషయాన్ని పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెడుతున్నారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్ పౌర సమాజం ప్రధానంగా పాకిస్థాన్ దౌర్జన్యంగా తమ భూభాగాలను ఆక్రమించడాన్ని ప్రతిఘటిస్తూ భారతదేశంతో రాజా హరిసింగ్ ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. అందులో భాగమే ఆర్టికల్ 370 అనే వాస్తవాన్ని భారత పాలకవర్గాలు కప్పిపుచ్చుతూ వచ్చాయి. ఆ ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశీ, సమాచార వ్యవస్థలకు సంబంధించిన విషయాలు మాత్రమే భారత ప్రభుత్వంకి అధికారం ఇచ్చింది. మిగిలిన అన్ని విషయాల్లో అధికారాలు కాశ్మీర్ ప్రభుత్వానికే ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 35ఎ కూడా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అమలులో ఉన్న 1/70 చట్టం లాంటిదే. ఈ విషయాలను భారత పాలకవర్గాలు భారత ప్రజలకు తెలియకుండా కాశ్మీర్ భారత్లో ఒక రాష్ట్రంగానే ప్రచారం చేస్తూ వచ్చి ఆచరణలో దాని సర్వ హక్కులు హరించివేసారు. ఒప్పందం ప్రకారం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) నిర్వహించకుండా కాశ్మీర్ ప్రజల ప్రియతమ నాయకుడైన షేక్ అబ్దుల్లా జైల్లో 20 సంవత్సరాలకి పైగా నిర్భందించారు.
కాశ్మీర్ కి ఇవ్వబడిన ఆర్టికల్ 370, 35 లాగానే ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్ లో ఎస్సీ, ఎస్టీలకు కల్పించబడిన ప్రత్యేక హక్కులు కూడా ఈ కోవకే వస్తాయి. కానీ నాటి కాంగ్రెస్ నుండి నేటి మోడీ ప్రభుత్వం వరకు ఈ వాస్తవాలను కప్పిపెట్టి ఒక్క కాశ్మీర్ మీదే దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. ఎ జాతీయోద్యమ కాలంలో దేశంలో, వివిధ సంస్థానాలలో కూడా దళిత, బహుజన, మైనారిటీ జాతుల ప్రజలు స్వాతంత్రోద్యమంలో భాగంగా తమ హక్కుల రక్షణ కోసం అనేక వీరోచిత పోరాటాలు చేసారు. కాశ్మీర్ లో కూడా అక్కడి ప్రజలు (ముస్లింలు, హిందువులు కలిసి) షేక్ అబ్దుల్లా నాయకత్వంలో రాచరికానికి, భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పాలన కోసం స్వాతంత్రోద్యమం సాగించారు. దున్నే వానికే భూమి నినాదంతో ప్యూడల్ వ్యతిరేక పోరాటాలు సాగించి పేదలు భూములు సాధించుకున్నారు. ఈ చారిత్రకాంశాలను మన పాలకులు కుట్రపూరితంగా దాచిపెడుతున్నారు. రాజ్యాంగ బద్ధంగా కాశ్మీరీ ప్రజలకు ఇచ్చిన హక్కులన్నింటినీ రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా ప్రచారం చేస్తూ దేశ ప్రజలలో కాశ్మీరీ ప్రజల పట్ల ఉగ్రవాద భావాన్ని కలిగిస్తున్నారు. ఎ ధనిక వర్గాల నుండి, అగ్రకుల భూస్వాముల నుండి, కార్పొరేట్ శక్తుల నుండి తమ హక్కుల రక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సాధించుకున్న అధికరణాలనన్నింటిపై కేంద్రంలోని బిజెపి-ఆరెస్సెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది. కాశ్మీర్ లోని భూములను (ఏపిల్, కుంకుమ తోటలు వగైరా) కబ్జా చేసుకోవడానికి, పర్యాటక రంగాన్ని హస్తగతం చేసుకోవడానికి దేశంలోని బడా కార్పొరేట్ శక్తుల కోసం కాశ్మీర్ ని నేడు యుద్ధక్షేత్రంగా మార్చివేసింది. కాశ్మీర్ ముస్లింలకు వ్యతిరేకంగా దేశ ప్రజలలో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. భారత దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలని కుట్రలు చేస్తున్నది. మరోప్రక్క దేశంలో దళిత, బహుజన, మైనారిటీలపై, మహిళల పై, ఆదివాసీలపై దాడుల సాగిస్తూ రాజ్యాంగం ప్రకారం వారికి రక్షణకు ఇవ్వబడిన హక్కులన్నిటి పైనా దాడి చేస్తున్నది. సారాంశంలో రాజ్యాంగం స్థానంలో మనువాద ధర్మాన్ని అమలుజరిపేందుకు పూనుకున్నది. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు నిరశన తెలపకుండా భారత రాష్ట్రపతి ఈ చర్యలని తక్షణమే ఆమోదించి గజెట్లో ప్రచురించడానికి సిద్ధంగా వుంటున్నాడు. బాలకోట్ దాడిని చూపించి దేశభక్తిని, జాతీయతను రెచ్చగొట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దేశంలో క్షీణిస్తున్న ఆర్థిక స్థితిని, పెరుతున్న నిరుద్యోగితను, పేదరికాన్ని ఆకలిని కప్పిపుచ్చడానికి ఈ విధానాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో పెరగబోయే ప్రజా ఉద్యమాలను రక్తపుటేరుల్లో ముంచడానికి, అణచివేయడానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే లి ఉపా, ఎన్ఐఏ, ఆర్టీఐ చట్టాలను మరింత కఠినంగా రాజ్యాంగ విరుద్దంగా సవరించింది. తద్వారా దేశంలో హిందూ ఫాసిస్టు నియంతృత్వాన్ని నెలకొల్పడానికి ఆరెస్సెస్, బిజెపిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.. కేంద్ర ప్రభుత్వం చేసిన 370, 35ఎ అధికరణాల రద్దుని రాజ్యాంగ విరుద్దమైన చర్యలుగా ప్రకటిస్తున్నాం. కాశ్మీర్ రెండు ముక్కలుగా చేయడం కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు కోసం సాగిస్తున్న పోరాటాన్ని దెబ్బతీయడానికే అని భావిస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకి విశేషమైన అధికారాలు లేవని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుకి ఇది వ్యతిరేకమైన చర్య. ఆర్టికల్ 370ని రద్దుచేయాలంటే జమ్మూ -కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం ఉండాలనే రాజ్యాంగ నిబంధనకు విరుద్ధమైనది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులందరూ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలనన్నింటినీ నిరశించాలని కోరుతున్నాం. కాశ్మీరీ ప్రజలు స్వయం నిర్ణయాధికార హక్కు కోసం సాగిస్తున్న న్యాయమైన పోరాటాన్ని బలపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
డిమాండ్స్:
1. రద్దు చేసిన ఆర్టికల్ 370 ని మళ్ళీ పునరుద్దరించి వారి స్వయం ప్రతిపత్తి హక్కు కల్పించాలి.
2. కాశ్మీర్ పై ఆధికారం కాశ్మీర్ ప్రజలదే. కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించి కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛా హక్కు కాపాడాలి.
3. కాశ్మీర్ లో అమలు చేస్తున్నా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ప్రత్యేక సైనికాధికారాల చట్టాలను వెంటనే తొలగించాలి.

‍ - ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు, పౌరహక్కులసంఘం
- ఎన్. నారాయణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పౌరహక్కులసంఘం

Keywords : kashmir, bjp, clc, jammu, article 370
(2020-03-29 02:53:32)No. of visitors : 940

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

Search Engine

పోలీసులు ఎవ్వరినైనా కొట్టొచ్చు...అదే లాఠీ వాళ్ళ కుటుంబ‌ సభ్యులపై పడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడండి
లాక్‌డౌన్: నడిచీ...నడిచీ...ఊరికి చేరుకోకుండానే ప్రాణం పోయింది
లాక్ డౌన్: ʹఅమ్మా ఇక నడవలేనుʹ
ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ʹసుప్రీంʹ లో పిల్ దాఖలు చేసిన మోడీ మద్దతుదారు
కోవిడ్ కాదు కోవింద్.. గోగోయ్ రాజ్యసభ సీటుపై టెలీగ్రాఫ్ సంచలన కథనం .. పీసిఐ నోటీసులు
ఆవుమూత్రం తాగి ఆస్పత్రిపాలైన వ్యక్తి... మూత్రాన్ని పంచిన బీజేపీ నేతను అరెస్టు చేసిన పోలీసులు
రంజన్ గోగోయ్ తుచ్ఛుడే, మరి మీరేం చేస్తున్నారు మిలార్డ్ - మార్కండేయ కట్జూ
క్విడ్ ప్రో క్వో !
more..


కాశ్మీర్