ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ


ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ

ఈ

రచయిత మోహన సుందరం తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన ఈ రచన మీ కోసం...

(కొలంబస్ అమెరికాకి మార్గం వేశాక యూరోప్ నుంచి శ్వేతజాతీయులు అమెరికాకి వలస వెళ్ళడం ప్రారంభించారు.ఉత్తరమెరికా సొంతదారులైన రెడ్ ఇండియన్లపై అమానుషమైన దాడులుచేసి వారి భూములను ఆక్రమించుకున్నారు. ఆ క్రూరమైన దాడులని ప్రతిఘటిస్తూ తమదైన నేలకోసం ఆ ఆదివాసులు పూర్తిగా తమ ఉనికిని కోల్పోయారు. చాలా జాతులు అంతరించిపోయాయి. కనీవినీ ఎరుగని ఈ మానవ హననానికి చలించిపోయిన ఓ ఆదివాసీ తెగ నాయకుడు సియాటిల్ శాంతి స్థాపనకు కృషి చేశాడు. ఇక ఇరువర్గాలు కలిసి జీవిస్తేనే మిగిలిన వారి మనుగడ ఉంటుంది అని భావించాడు. ఆదివాసుల నుంచి భూమిని కొంటానని శ్వేతజాతీయుల సైన్యాధిపతి కబురుచేసినప్పుడు అతడికి సియాటిల్ రాసిన సమాధానమే ఈ " ప్రముఖుడికి లేఖ ". ఈ లేఖని రెడ్ ఇండియన్ల సమావేశంలో సియాటిల్ చదివి వినిపించాడు. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన విషయాలకూ ఇప్పటికీ ప్రసంగీకత ఉంది. ఆ లేఖలో మన దేశంలోని ఆదివాసుల గుండెచప్పుడు ఉంది. తాజా పరిణామాల నేపధ్యంలో కాశ్మీరీల అంతులేని వ్యధ ఉంది... కె. సురేష్ గారు అనువాదం చేసిన ఈ లేఖని 1998 లో Hbt ప్రచురించింది.)

" శ్వేతజాతీయుల రాజ్య ప్రముఖుడు కబురు పంపించాడు మా భూమిని కొనాలనుకుంటున్నామని
స్నేహ సంబంధాలను కోరుతూ వారి సైన్యాధిపతి సందేశం కూడా పంపాడు !
అది వారి సహృదయతకు నిదర్శనం!
మాతో స్నేహం చేయవలసిన అవసరం వారికి ఏమాత్రం లేదని మాకు తెలుసు !
అయినా వారి ప్రతిపాదన గురించి ఆలోచిస్తాం.
బహుశా అప్పుడు - వారిచ్చిన భూమిలో
మా ఆఖరి క్షణాలు( మా ఇష్ట ప్రకారం) గడుపుతాం.

ఈ భూమిపై ఆదివాసులు అంతరించాక
ఈ సముద్ర తీరాలూ, ఈ ఎగువ దిగుడు వనాలూ
మా జాతీయుల ఆత్మని సంరక్షిస్తాయి.
అప్పుడే కళ్ళు విప్పిన పసికందు
తన ఉనికిని ఎంతగా ప్రేమిస్తుందో
అంతగా నా జాతీయులు ఈ ధరిత్రిని ప్రేమిస్తున్నారు
అందుకే ఈ భూమిని మేము మీకు కనుక అమ్మితే
మాలాగే మీరుకూడా ఈ నేలతల్లిని ప్రేమించండి!
దీనినెంతగా మేము సంరక్షించామో, మీరూ అంతగా సంరక్షించండి!
మీ సర్వశక్తులూ ధారపోసి మనసారా
ఈ భూమిని మీ పిల్లల కోసం సంరక్షించండి!
అందరికీ తండ్రి - ఆ దేవుడు మనని ప్రేమించినంతగా
ఈ పుడమితల్లిని ప్రేమించండి.
ఈ భూమిని వారికి అమ్మకపోతే తెల్లవాళ్ళు
తుపాకులతో సహా రాగలరు!
నింగికీ, నేలతల్లి ఆప్యాయతకూ వెలకట్టగలమా?

ఈ భావమే మాకు వింతగా ఉంది. గాలి ఘుమఘుమలు, నీటి తళతళలు మా సొమ్ము కానప్పుడు వాటిని ఎలా అమ్మగలం? ఈ భూమి పైన అణువణువూ నా ప్రజలకు ఎంతో పవిత్రమయినది.

మెరిసే ప్రతి ఆకూ, ఇసుక తీరం, సంధ్యవేళ పొగమంచు కమ్మిన అడవీ, మైదానం, ఝుమ్మని పాడే ప్రతీ పురుగూ నా ప్రజల అనుభవాల్లో, స్మృతుల్లో పవిత్రమయినవి. చెట్లలో ప్రవహించే జీవజలం రెడ్ ఇండియన్ల జ్ఞాపకాలను మోసుకెళుతుంటుంది.

తెల్లవాళ్ళు చచ్చిపోయి చుక్కల్లో కలిసినప్పుడు తాము పుట్టిన దేశాన్ని మరిచిపోతారు. అందమైన ఈ పుడమి రెడ్ ఇండియన్లకు తల్లివంటిది. అందుకే మావాళ్ళు చనిపోయినప్పటికీ ఈ మట్టిని మరిచిపోరు.

మేము మట్టిలోని వాళ్ళం,భూమి మాలో భాగం.

సువాసనలు వెదజల్లే పూలు మా చెల్లెళ్ళు. జింక,గుర్రం, డేగ మా తమ్ముళ్లు. రాళ్ళ శిఖరాలు, తోటల్లోని రసాలూ, గుర్రపుపిల్ల శరీర స్వేదం, మనిషీ ... అన్నీ ఒకే కుటుంబంలోనివి.

మా భూములను కొంటానని వాషింగ్టన్ నుంచి ప్రధాన సైనికాధికారి కబురుపంపినప్పుడు మాశక్తికి మించింది అడుగుతున్నాడు. మా సుఖ జీవనానికి తిరిగి కొంతభూమిని మాకు కేటాయిస్తానంటున్నాడు.

అతను మాకు తండ్రి గాను,మేము అతని పిల్లల గాను ఉంటాం. కాబట్టి మా భూమిని కొంటామన్న ప్రతిపాదనను పరిశీలిస్తాం.

అయితే ఇది అంత తేలిక కాదు. ఎందుకంటే ఈ భూమి మాకు ఎంతో పవిత్రమయినది.

ఏటిలోనూ,నదులలోనూ పారే నీరు ఉత్తి నీరు కాదు. మా పూర్వీకుల రక్తమది. మా భూమిని అమ్మితే ఇది ఎంతో పవిత్రమయినదని మీరు గుర్తుంచుకోవాలి. ఈ భూమి పవిత్రమయినదని, నిశ్చలమైన చెరువు నీటిలో కనిపించే ప్రతి ఒక్క ప్రతిబింబం నా ప్రజల జీవితాలలోని జ్ఞాపకాలను, ఘటనలను చెబుతున్నాయని మీ పిల్లలకు నేర్పించాలి.

నీటి గలలు మా తాతల గుసగుసలు.

నదులు మా తమ్ముళ్లు. మా దప్పికని తీరుస్తాయి. మా పడవలని మోసుకెళతాయి. మా పిల్లలకు ఆహారాన్నిస్తాయి. మేము మీకు భూమిని అమ్మితే నదులు మా తమ్ముళ్లని గుర్తుంచుకోవాలి. మీ పిల్లలకు నేర్పించాలి. వాటిని మీరుకూడా తమ్ముళ్లుగా భావించి, తమ్ముడిని చూసినట్లు దయతో చూడాలి.

తెల్లవాళ్ళకి మా పద్ధతులు అర్ధం కావని మాకు తెలుసు. రాత్రిపూట భూమినుంచి తమకు కావాల్సింది తస్కరించుకుపోయే ఆగంతకుడు అతడు. అందుకనే అతనికి ఒక మాది ఎటువంటిదో ఆ పక్క మడికూడా అటువంటిదే.

భూమి అతనికి సోదరుడు కాదు, శత్రువు. అందుకే దానిని జయించిన తర్వాతే ముందుకు సాగిపోతాడు.

తన తండ్రి సమాధి వెనుక ఉండిపోయినా అతనికి పట్టదు. తన పిల్లల భూమిని దొంగిలిస్తున్నా అతనికి పట్టదు.

తన తండ్రి సమాధినీ, తన పిల్లల జన్మహక్కుని అతను మరిచిపోయాడు. తల్లినీ,భూమినీ, తమ్ముడినీ, ఆకాశాన్నీ కొనగల వస్తువులుగా, దోచుకోదగ్గ వస్తువులుగా చూస్తాడు. గొర్రెల్లానో, అందమైన పూలలాగానో వీటినీ అమ్మవచ్చని అనుకుంటాడు.

అతడి ఆశ భూమిని దిగమింగి ఏడారిని మాత్రం మిగులుస్తుంది.

మా పద్ధతులు మీ పద్ధతులకు భిన్నమైనవి.

మీ పట్టణాలు మా కళ్ళకు వికృతంగా కనపడతాయి. రెడ్ ఇండియన్లు అడవి మనుషులు కావడం వల్ల అర్ధం చేసుకోలేక పోతున్నారేమో.

తెల్లవాళ్ళ పట్టణాల్లో నిశ్శబ్ద ప్రదేశం ఒక్కటీ లేదు.వసంతంలో కొత్త చిగురులు విచ్చుకునే శబ్దం, పురుగుల రెపరెపలు మీ పట్టణంలో ఎక్కడా వినపడవు.

నేను ఆడవిమనిషిని కావడం వల్ల అర్ధం చేసుకోలేకపోతున్నానేమో.

పట్టణ రణగొణ ధ్వనులు కర్ణ కఠోరంగా తోస్తాయి. ఒంటరి పిట్టల కూతలనీ, రాత్రుళ్ళు కప్పుల సంవాదాన్ని వినలేనప్పుడు మనిషి జీవితంలో ఇంకా ఏమి మిగులుతుంది? నేను అడివి మనిషిని, నాకు ఇంతకు మించి అర్ధం కాదు.

చెరువు ముఖం మీద వీస్తూ గాలి చేసే శబ్దం, మధ్యాహ్నం వర్షం పడిన తర్వాత గాలితెచ్చే వాసన, పూల పరిమళాల్ని మోసుకొచ్చే గాలి మాకు ఎంతో ఇష్టమైనవి.

పశువు, చెట్టు,మనిషి ఒకే గాలిని పీల్చుకుంటాయి. మనిషి ఇతర జీవజాలంతో ఒకే గాలిని పంచుకుంటాడు. కాబట్టి గాలి మాకు ఎంతో పవిత్రమైనది.

తెల్లవాళ్ళకి తాము పీల్చే గాలి పట్టదు. చావడానికి సిద్ధంగా ఉన్న మనిషిలాగా దుర్వాసన అతనికి పట్టదు.

ఈ భూమిని మీకు అమ్మితే మాత్రం ఈ గాలి మాకు అమూల్యమైనదని, అది ఊపిరి పొసే సకల ప్రాణకోటి ఆత్మను కలిగివుంటుందని మీరు గుర్తుంచుకోవాలి. మా తాతకు మొదటి ఊపిరి పోసిన గాలే అతని చివరి శ్వాసనూ గ్రహించింది.

మేము మా భూమిని మీకు అమ్మితే దానిని ప్రత్యేకంగా, పవిత్రంగా ఉంచాలి. పూలవాసనలతో మత్తెక్కిన గాలిని, పీల్చుకోటానికి తెల్లవాళ్ళుకూడా అక్కడికి రావొచ్చు.

భూమిని కొంటామన్న మీ ప్రతిపాదనను పరిశీలిస్తాం. అమ్మడానికి నిర్ణయించుకుంటే ఒక షరతుని మాత్రం విధిస్తాం. ఈ భూమి పైని జంతువుల్ని తెల్లవాళ్ళు తమ తమ్ముళ్లుగా చూసుకోవాలి.

నేను అడవి మనిషిని, నాకు ఇంతకు మించి మరో పద్దతి తెలియదు.

రైల్లో పోతూ తెల్లవాళ్ళు కాల్చి చంపిన వందలాది గేదెల శవాలు మైదానంలో కుళ్ళిపోతుండటం నేను చూశాను. గేదెల కన్నా పొగలుకక్కే ఉక్కు గుర్రాలు ఎలా ముఖ్యమైనవో నాకు తెలియదు.

జంతువులు లేకపోతే ఇక మనిషిలో మిగిలేది ఏమిటి? జంతువులన్నీ అంతరించిపోతే మనిషి ఆత్మ ఒంటరిదై అతనూ చచ్చిపోతాడు.

జంతువుకి పట్టిన గతే అనతికాలంలో మనిషికీ పడుతుంది. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

మీ పిల్లలు నించున్న భూమి మీ తాత ముత్తాతల అస్థికలతో ఏర్పడిందని నేర్పించాలి. మీ బంధువులతో పుడమి సంపన్నమైనదని చెబుతుంటే మీ పిల్లలు దాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. భూమి మన తల్లి అని మేము మా పిల్లలకు నేర్పినట్లు మీరూ మీ పిల్లలకు నేర్పించండి.

భూమికి పట్టిన గతే సంతతికీ పడుతుంది. జీవజాల వలయాన్ని మనిషి సృష్టించలేదు. దానిలో అతను ఒక పోగు మాత్రమే. జీవజాలాన్ని ప్రభావితం చేసే అతని చర్యలు.. చివరికి అతన్నీ ప్రభావితం చేస్తాయి.

తెల్లవాళ్ళ దేవుడు అతనితో స్నేహితుడిగా మెలుగుతాడు. అయితే అతను కూడా దీనికి మినహాయింపు కాడు.

అసలు మనందరం సహోదరులం అయి ఉంటాం.

అదీ చూద్దాం.

మా దేవుడూ, మీ దేవుడూ ఒకటేనని మాకు తెలుసు. దీనిని తెల్లవాడు ఏదో ఒకరోజు గుర్తిస్తాడు. మా భూమిని సొంతం చేసుకోవాలనుకున్నట్లు , దేవుడిని కూడా సొంతం చేసుకోవొచ్చు అనుకుంటున్నారేమో. కానీ అది సాధ్యం కాదు. మానవాళి కంతటికీ అతను దేవుడు. అందరినీ సమానంగా ప్రేమిస్తాడు.

ఈ భూమి దేవుడికి ఎంతో ఇష్టమైనది.భూమికి హాని చేయడమంటే సృష్టికర్తను అవమానించడమే.

బహుశా ఇతర జాతులకన్నా ముందే తెల్లవాళ్ళు అంతరించిపోవచ్చు. నీ పక్కని మలిన పర్చుకుంటే, ఒకరోజు నువ్వే ఆ దుర్గంధంలో ఊపిరాడక చచ్చిపోతావు.

దేవుడిచ్చిన శక్తితో మీరు ఇక్కడికి చేరుకోగలిగారు. ఏ ఉద్దేశంతోనో మీకు ఇక్కడి భూమి మీద, ప్రజల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు అంతరించిపోతూ కూడా గొప్పగా వెలిగిపోతారు.

బర్రెలను ఊచకోత కోసినప్పుడు, గుర్రాలను మచ్చిక చేసినప్పుడు, అడవి మారుమూలలు మనిషి వాసనతో గుప్పుమన్నప్పుడు, కొండలు మాట్లాడే తీగలతో అల్లుకుంటూ ఉన్నప్పుడు మాకు ఏమీ అర్ధం కాలేదు. ఏ గమ్య సిద్ధి కోసం ఇదంతా జరుగుతుందో మాకు తెలియడం లేదు.

చెట్ల గుబురులు ఏవీ ? పోయాయి.
డేగలు ఏవీ ? పోయాయి.
జీవితం ముగిసింది.
బతుకు పాకులాట మొదలైంది.
బతుకు పాకులాట ఒక్కటే మిగిలింది.!

( ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా....)

Keywords : adivasi, red indians, usa. america, europe
(2019-10-23 10:02:51)No. of visitors : 397

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.....

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

What happens when youʹre about to die? Chemists explain exactly how death feels

The American Chemical Society has explained exactly what goes on in your brain when (for instance) somebody plunges a woodmanʹs axe into your torso.....

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

తెలంగాణలో పాత రోజులు మళ్ళీ దాపురించాయి... అణిచివేతే పాలకుల విధానమయ్యింది
ఆర్టీసీ సమ్మె పై నిర్భందం...పౌరహక్కుల సంఘం ఆగ్రహం
భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు
నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టు
ʹఆవులగురించి కాదు ఆడపిల్లల గురించి శ్రద్ద పెట్టండిʹ
ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
more..


ఈ