కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ

కస్టడీలో

పోలీసు కస్టడీలలో సంభవించే మరణాలు ఎక్కువగా పోలీసుల హింసల వల్ల జరిగేవే. కానీ బాధితులు పేదవాళ్ళు కావడంతో వాటిని హత్యలుగా నిరూపించడం కష్టమే. అయితే హత్య చేసిన పోలీసు అధికారి స్వయంగా తాను ఓ నిందితుడిని ఎలా కొట్టి చంపాడో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముంబై మాజీ డీసీపీ భీమ్రావ్‌ సోనావనేకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో భీమ్రావ్‌ 1990 కాలంలో వర్లీ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. రట్టు గోసావి అనే ముద్దాయిని ఎలా హింసించింది.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనావనే ఈ వీడియోలో చెప్పాడు.

భీమ్రావ్‌ సోనావనే చెప్పిన మాటలు... ʹ1990 సంవత్సరం అప్పుడు నేను వర్లీ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాను. రట్టు గోసావి అనే నేరస్తుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. అతడి మీద అప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రట్టు పోలీసులకు చిక్కాడు. అప్పుడు స్టేషన్‌లో నేనే ఉన్నాను.

మా కస్టడీలో ఉన్న రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్‌ స్టేషన్‌ బయట గందరగోళం ప్రారంభమయ్యిందిʹ

ʹదాదాపు 400 మంది పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వారి ఎదురుగా రట్టు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కష్టం. ఎలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఉపాయం తట్టింది. స్టేషన్‌ బయట ఓ వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాను. రట్టు చేతికి బేడీలు వేశాను. ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో రట్టును బయటకు నడిపించుకుంటూ తీసుకెళ్లాం. చూసే వారికి అతడు గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది.

రట్టు గురించి అడిగిన వారికి ʹతనను తాను గాయపర్చుకున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. గాయం కారణంగా నడవలేకపోతున్నాడుʹ అని చెప్పాం. చేతికి బేడీలు ఉండటంతో మేం చెప్పింది నిజమని నమ్మారు. ఆ తర్వాత అతడిని కేఈఎం ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వారు రట్టు మృత దేహాన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదుʹ

ʹతర్వాత రట్టు బాడీని జేజే ఆస్పత్రిలో చేర్చాం. అతడి చేతిలో తుపాకీ పెట్టాం. రట్టు పోలీసుల మీద కాల్పులుకు పాల్పడ్డాడని.. పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. మొదటి అంతస్తు నుంచి దుకాడని.. ఈ క్రమంలో అతడు చనిపోయాడని చెప్పాం. దాని ప్రకారం ఆ తర్వాత స్టేషన్‌ డైరీలో కూడా మార్పులు చేశాంʹ అంటూ సోనావనే చెప్పుకొచ్చాడు.

అయితే ఇదంతా సోనావనే బంధువు, వ్యాపారవేత్త రాజేంద్ర ఠక్కర్‌ ఆఫీస్‌లో చోటు చేసుకుంది. దాంతో సోనావనే చెప్పినవన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఈ వీడియో తీసుకెళ్లి ముంబై పోలీసులకు ఇచ్చి, సోనావనే మీద ఫిర్యాదు చేసింది రాజేంద్ర ఠక్కర్‌ కావడం ఇక్కడ అసలు ట్విస్ట్‌. డబ్బుల విషయంలో ఠక్కర్‌కు, సోనావనేకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. దాంతో ఇదే అదునుగా భావించిన ఠక్కర్‌ ఈ వీడియో ఫుటేజ్‌ను వర్లీ పోలీసులకు అందజేశాడు.

ఇక ఈ విషయం గురించి ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ʹఈ ఘటన జరిగినప్పుడే దీని గురించి విచారణ చేశాము. ప్రస్తుతం మళ్లీ కొత్తగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మరో సారి విచారణ చేస్తాం. అలా చేయాలంటే ఈ వీడియో మాత్రమే సరిపోదు.. మరికొన్ని బలమైన సాక్ష్యాలు కావాలిʹ అంటూ చెప్పుకొచ్చారు.

Keywords : custodial death, mumbai, dcp, police
(2024-04-24 18:00:33)



No. of visitors : 2442

Suggested Posts


హిప్నాటిజం చేసి డబ్బులు దోచుకున్నాడు !

మోసం చేయడానికి ఉన్న అనేక మార్గాల్లో ఇప్పుడు హిప్నటిజం కూడా చేరింది. ఓ బ్యాంకు మేనేజర్ ను హిపటైజ్ చేసిన ఓ అగంతకుడు 93 వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు....

LOOKING BACK AT 50 YEARS OF A PEOPLEʹS MOVEMENT

The Naxalbari movement began 50 years ago, and is still on. ʹNowhere else in the world will you find a continued class struggle that has lasted so many years,ʹ said Vara Vara Rao, the famous Telugu poet and writer, speaking on ʹ50 Years of Naxalbari, Looking Back, Looking Forwardʹ.....

హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె

పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా దభోల్కర్‌ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్‌) తెలిపింది.

చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు

ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో ప్రాజెక్టు పేరుతో చెట్లు కొట్టేయడానికి వ్యతిరేకంగా కొంత కాలంగా పర్యావరణ ప్రేమికులు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. నిన్న (10/05/2019) అర్దరాత్రి చెట్లు మెట్రో ప్రాజెక్టు అధికారులు వర్కర్స్ అక్కడికి చేరుకొని చెట్లు నరికివేయడం మొదలుపెట్టారు. దాంతో నిరసన తెలపడానికి పర్యావరణ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిపై దుర్మ

మోడీ విద్వేష ప్రసంగం పట్ల సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆగ్రహం

ఔరంగజేబ్‌, శివాజీ పేర్లను ఉపయోగించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ ఖండించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కస్టడీలో