లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !


లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !

లొంగిపోయి

ʹʹరామా, నన్ను లొంగిపొమ్మని పదే పదే ఉత్తరాలు రాయకు. నేను నీతీర్గ ప్రజా ద్రోహిని కాను, కాబోను. నేను విప్లవ కారిణిని, నా జీవితాంతం ప్రజల కోసమే పని చేస్తాను. నీ తీర్గ లొంగిపోయి ప్రజలను హత్యలు చేయను. ప్రజల విముక్తి కోసం పోరాటమే తప్ప లొంగుబాటు అనేది నా జీవితంలో ఉండదు. నువ్వు పోలీసులతో కలిసి అనేక మంది అమాయక ప్రజలను అరెస్టు చేయించావు. చిత్ర హింసలపాల్జేశావు. నువ్వు ప్రజల కోసం కాకుండా దోపిడి వర్గాల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నావు. ఇక నాగురించి ఆలోచించకు నీ గురించి ఆలోచించుకో నిన్ను నువ్వు ప్రజల నుండి ఎలా కాపాడుకుంటావో చూస్కోʹʹ
ఇది ఉద్యమంలో పని చేసి లొంగిపోయి పోలీసులతో కలిసి పని చేస్తున్న తన అన్నకు ఓ విప్లవకారిణి రాసిన లేఖ.
ఆమె పేరు ʹకన్నిʹ చత్తీస్ గడ్ కుంట ఏరియాలోని గగన్ పల్లి గ్రామం ఆమెది. 1990ల మొదట్లో ఆ గ్రామంలోని చాలా మంది యువతీ యువకులతోపాటు రామా, కన్నిలు ఇద్దరూ సీపీఐ మావోయిస్టు పార్టీలో పూర్తి సమయం కార్యకర్తలుగా చేరారు. చిన్న నాటి నుండే వాళ్ళిద్దరూ గ్రామంలో బాలల సంఘంలో పని చేశారు. కన్ని ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ మెంబర్.
రామ 2018 లో పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసులతో కలిసి అనేక గ్రామాల మీద దాడులు చేశాడు. అనేక మంది ఉద్యమ సానుబూతిపరులను అరెస్టు చేయించాడు.

ʹరామా లొంగి పోవడం మాకు చాలా ముఖ్యమైనది. అతని లొంగుబాటు తర్వాత అతని సహకారంతో చాలా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేయగలిగాంʹ అని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) చంద్రసింగ్ ఠాకూర్ హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ప్రతినిధికి తెలిపారు.

అసలు రామ ఎందుకు లొంగిపోయాడు..అతని మాటల్లోనే..ʹʹనేను ఎంతో కాలం పార్టీ కోసం పని చేశాను ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్న నన్ను డీ ప్రమోట్ చేశారు. వేరే డివిజన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. నా భార్యను కలుసుకోవడమే గగనమై పోయేదిʹʹ
రామాను డీ ప్రమోట్ చేయడానికి కారణాలేంటో మనకు తెలియదు. కానీ నువ్వు ద్రోహివి అని రామా చెల్లి కన్ని అనిందంటే ఏవో బలమైన కారాణాలు ఉండే ఉంటాయి.

కన్ని కుంట ఏరియాలో చాలా బలమైన నాయకురాలు. ప్రజల్లో చాలా విశ్వాసమున్న నాయకురాలు. ఆమెకు ఆ ఏరియా మీద కూడా చాలా పట్టుంది. అందుకే ఆమె లొంగిపోతే బాగుంటుందని పోలీసుల కోరిక. దానికోసం ఆమె తమ్ముడు రామ మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి పెడుతుంటారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షలభ్ సిన్హా హిందుస్తాన్ టైమ్స్ తో మాట్లాడుతూ ʹʹనేను రామ ను కలిసినప్పుడల్లా అడుగుతుంటాను మీ అక్క‌ లొంగుబాటు ఎంత దాకా వచ్చిందని. అతను నిరాశ నిండిన మొహంతో తాను సక్సెస్ కాలేకపోయానని చెబుతాడు. ఎప్పుడో ఒకప్పుడు రామ మాట విని అతని చెల్లి కన్ని మాకు లొంగిపోతుందని నా విశ్వాసంʹʹ అన్నాడు.
ʹʹనేను రెవల్యూషనరీని లొంగుబాటు అనే ఆలోచన నా దరిదాపుల్లోకి కూడా రాదు. జీవించినంత కాలం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానుʹʹ కన్ని రామాకు రాసిన ఉత్తరంలోని మాటలివి

Keywords : chattis garh, maoists, rama, kanni, POLICE,
(2019-08-22 08:01:37)No. of visitors : 1879

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
కాశ్మీర్ ప్రజల హక్కులపై సాగిస్తున్న దాడిని ఖండించండి - పౌరహక్కుల సంఘం
more..


లొంగిపోయి