నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?


నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?

"కశ్మీర్‌లో అంతా ప్రశాంతంగా ఉంది.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అత్యధిక మంది కశ్మీరీలు ఆనందోత్సాహాలతో ఉన్నారు.. నిరసన తెలిపిన వాళ్లు కూడా 100 మంది కంటే ఎక్కువ లేరు"- ఇదీ బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు గత కొన్ని రోజులుగా మీడియాకు చెప్పుకుంటూ వస్తోంది. నిజంగా కశ్మీరీలు సంతోషంగా ఉన్నారా..? 370 ఆర్టికల్ రద్దు తర్వాత 10 వేల మందికి పైగా శ్రీనగర్‌లో నిరసన తెలియజేయలేదా అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి సిద్దంగా లేదు. అంతా అబద్దమే అని కొట్టిపారేస్తోంది.

కాని అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి కొంత మంది మేధావులు, హక్కుల కార్యకర్తలు జమ్ము, కశ్మీర్‌లో పర్యటించారు. దానికి సంబంధించిన వాస్తవాలను చెప్పడానికి ఇవాళ ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రిపోర్టు తయారు చేసిన వాళ్లో ప్రముఖ ఆర్థివేత్త జీన్ డ్రీజ్, రాజకీయ కార్యకర్త కవితా క్రిష్ణన్ వంటి వాళ్లు ఉన్నారు. ఐదు రోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో పర్యటించి ఈ రిపోర్టును తయారు చేశారు. అక్కడి వాస్తవ సంఘటనలను చిత్రీకరించిన వీడియోలతో ఒక 10 నిమిషాల డాక్యుమెంటరీ కూడా రూపొందించారు.

కాగా, తీరా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు సదరు డాక్యుమెంటరీ వీడియోను ప్రదర్శించవద్దని ప్రెస్ క్లబ్ అధికారులు తెలిపారు. ప్రెస్ క్లబ్‌లో ఉన్న ప్రొజెక్టర్‌ను కూడా ఉపయోగించవద్దని వాళ్లు హుకుం జారీ చేశారు. ఇది కూడా రాతపూర్వకంగా కాకుండా అనధికారికంగా మాటల్లో చెప్పారు. తమపై చాలా ఒత్తిడి ఉందని, ఇక్కడ నిఘా కూడా కొనసాగుతోందని అన్నారు. మీడియా సమావేశం నిర్వహించుకోండి కాని వీడియోలను ప్రదర్శించవద్దని వాళ్లు చెప్పారు. అవసరమైతే ఆ వీడియోలను సీడీల రూపంలో విలేకరులకు ఇవ్వమని ఒక సలహా ఇచ్చారు. దీంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పూర్తి విషయాలు చెప్పలేకపోయామని కశ్మీర్‌లో పర్యటించిన బృందం చెప్పింది.

ఈ ఒక్క ఘటన చాలు ప్రభుత్వం కశ్మీర్‌లో జరుగుతున్న అణచివేత బయటకు పొక్కకుండా ఎంత జాగ్రత్త పడుతోందో.. ! కశ్మీర్‌లో ప్రజలు పూర్తి అణచివేతకు గురవుతున్నారని.. అక్కడ కనీసం ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదని బీబీసీ రిపోర్టు చేసినా ప్రభుత్వం మాత్రం తమ పని తాను చేసుకొని పోతోంది.

Keywords : Kashmir, Article 370, Press Club of India, Delhi
(2019-08-22 06:58:03)No. of visitors : 454

Suggested Posts


0 results

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
కాశ్మీర్ ప్రజల హక్కులపై సాగిస్తున్న దాడిని ఖండించండి - పౌరహక్కుల సంఘం
more..


నిజాలు