ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌


ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌

ʹఆర్టికల్


ఆర్టికల్ 370 రద్దు పై సభ‌
తేది : 18-08-2019 ఆదివారం మధ్యాహ్నం 3 గం||లకు
వేదిక : కిరాణా మర్చంట్ హాల్, డీలక్స్ థియేటర్ ఎదురు వీధి, అమలాపురం
వక్తలు : వేడంగి చిట్టిబాబు, సి. ఎల్.సి, రాష్ట్ర అధ్యక్షులు
వి.ఎస్. కృష్ణ, హెచ్. ఆర్. ఎఫ్, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు

కశ్మీర్ సమస్య అనేది పాకిస్తాన్ తోనూ, ఇస్లాంతోనూ హింసావాదంతోనూ ముడిపడి ఉందనీ సగటు భారతీయుల భావన. తరతరాలుగా భరతభూమిలో భాగమైన సుందర కశ్మీరాన్ని పాకిస్తాన్ కబళించాలని చూస్తుండగా, అత్యధిక శాతం ముస్లింలయిన కశ్మీరీలు పాకిస్తాన్ కు బాసటగా పనిచేస్తున్నారనీ, ఇదే ʹకశ్మీర్ సమస్య" అని బహుశా అత్యధికులు అనుకుంటుండవచ్చు. పాకిస్తాన్ కు కశ్మీర్ కావాలని ఉంది, ఇండియాకు ఉన్నట్టే. కానీ ʹకశ్మీర్ సమస్యʹ అది కాదు. కశ్మీరీలకు తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఉంది. వారి భూభాగాన్ని కోరుకునే భారత్ కు ఇది సమస్యే కాబట్టి వారి కోరిక భారత్కు ʹకశ్మీర్ సమస్యʹ అయింది. నిజానికి సమస్య ఉన్నది కశ్మీరీలకు. వారి భవితవ్యాన్ని నిర్ణయించుకొనే స్వేచ్ఛను వారు కోరుకోవడం భారతికూ, పాకిస్తాన్ కూ ఇష్టం లేకపోవడం వారి సమస్య. దానికి భారత పాకిస్తాన్లు పరస్పర చర్చలలో పరిష్కరించు కుంటామనడం వారికి సహజంగానే విస్మయం కలిగిస్తుంది. వ్యతిరేకతా కలిగిస్తుంది.. కశ్మీరీల ఈ కోరిక వెనక ఉన్న చరిత్ర ఏమిటి? దాని సామాజిక, రాజకీయ స్వరూపం ఏమిటి? దానితో భారత్ ఏ విధంగా వ్యవహరించింది? ఏ విధంగా వ్యవహరిస్తున్నది? ఇందులో ఇస్లాం స్థానం ఏమిటి? పాకిస్తాన్ పాత్ర ఏమిటి? హింసా వాదానికున్న ప్రాముఖ్యం ఏమిటి? హిందూ జాతీయవాద భావన ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు అనేక కోణాల నుంచి చెప్పుకోవచ్చు. హక్కుల కోణం నుండి జవాబు చెప్పే ప్రయత్నం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హక్కులనేవి మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరికీ సహజంగా ఉంటాయని, సమానంగా ఉంటాయని హక్కుల దృక్పథం నమ్ముతుంది. మామూలు రాజకీయ పరిభాషలకు తరచుగా వినిపించే ఇతర భావనలు - దేశం, జాతి, అభివృద్ది, ప్రగతి వగైరాలు - మనుషుల హక్కుల కంటే గొప్పవి కాదని నమ్ముతుంది.
ఇటీవల ఆర్టికల్స్ 370, 35ఎ లను అప్రజాస్వామికంగా రద్దుచేస్తూ మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంతేకాక కశ్మీర్ ను భౌగోళికంగా రెండు ముక్కలుగాకూడా చేశారు. కొన్ని లక్షల మంది సైనికులను మోహరించి, కమ్యూనికేషన్ వ్యవస్థను | స్తంభింపజేసి, స్థానిక నాయకులను నిర్బంధించి, సామాన్య ప్రజానీకాన్ని బయటకు రానీయకుండా చేసి, శత్రు సైన్యం భూభాగాన్ని ఆక్రమించిన వాతావరణం కల్పించి కశ్మీర్ కు సంబంధించిన ఈ కీలక నిర్ణయాలు చేశారు. ఈ ప్రక్రియలో కశ్మీరీల భావాలను పరిగణన లోనికి తీసుకున్నదెక్కడ? నెహ్రూ బ్రాండు లౌకిక వాదులకు కశ్మీర్ ఆధునిక భారత లౌకికతకు ప్రతీక. ఆర్. ఎస్. ఎస్. బ్రాండు దేశభక్తులకు కశ్మీర్ అఖండ భారత్ కు ప్రతీక. పాకిస్తానీ పాలకులకు అనంతమైన జీహాద్ కు ప్రతీక. కశ్మీర్ గురించి ఆలోచించడమంటే కశ్మీరీల కోసం ఆలోచించడమని మనమెప్పుడు అర్థం చేసుకొంటాం!
రాజ్యాంగ విరుద్దంగా తీసుకొన్న ఈ దుర్మార్గమైన నిర్ణయానికి దేశంలోని సామాన్య ప్రజానీకం హర్షాతిరేకాలు వ్యక్తం చేసి తమ దేశభక్తిని చాటుకొన్నారు. అప్పుడే కశ్మీర్ ప్రాంత ఆర్థికాభివృద్ధి గురించి పలు కార్పొరేట్ సంస్థలు ప్రణాళికలు ప్రకటించేస్తున్నాయి. ఇదంతా అన్యాయం అని ప్రశ్నిస్తున్న వాళ్ళను దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు, అరెస్టులు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. కొంచెం ఆలోచిస్తే నిజంగా దేశభక్తి అంటే ఇదేనా,లేదంటే మనలో అణిగి ఉన్న విద్వేష భావనలను నిస్సిగ్గుగా, బాహాటంగా ప్రకటించడానికి తగిన వాతావరణం ప్రస్తుతం దేశంలో ఉండబట్టి ఇలా ప్రవర్తిస్తున్నామా అనిపిస్తుంది. చరిత్రలో ఉన్న అన్ని ఫాసిస్టు నియంతృత్వ పాలనలలోనూ సాధారణంగా ఉన్న లక్షణాలే ఇప్పుడు మన సమాజంలో కనిపిస్తున్నాయి. ఈ విద్వేష భావనల మూలాలు అర్థం చేసుకోవడానికి కొంచెం సంయమనం పాటించి కశ్మీర్ సమస్య పూర్వాపరాలను తెలుసుకోవడం చాలా అవసరం. ఈ ఫాసిస్టు పోకడలను ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికే కాదు మాననీయ భావనలకే ప్రమాదం.
(పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ, మానవహక్కుల వేదిక ప్రచురించిన కరపత్రం )

Keywords : kashmir, clc, hrf, bjp, article 370
(2019-10-12 22:36:18)No. of visitors : 222

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

Search Engine

ఈ కుట్ర కేసు వెనుక ఉన్న కుట్రలో అసలు కథ‌ ఇంకోటి ఉంది
నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలు
RTC కార్మికులారా ఆత్మహత్యలు వ‌ద్దు.. తెలంగాణ సమాజం మీ వెంట‌ ఉంది.. పోరాడి హక్కులు సాదించుకుందాం !
దేశానికి రానున్నవి చీకటిరోజులు
మావి నిషేధిత సంఘాలు కావు
పోలీస్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌పై కేసీఆర్ స్పందించాలి : ప‌్ర‌జా సంఘాలు
కేసీఆర్ ఓ నియంత : విరసం కార్య‌ద‌ర్శి పాణి
Condemn arrest and onslaught on TVV and others activists - SFS
ʹనల్లమల గురించి మాట్లాడినందుకే నాభర్తను అరెస్ట్ చేశారు..ఆయనెక్కడున్నడో నాకు చూపించాలిʹ
స్టూడెంట్ మార్చ్ పత్రిక ఎడిటర్, విరసం కార్యవర్గ సభ్యుడు డా. జగన్ ను విడుదల చేయాలి
దేశవ్యాప్త నిరసనలతో వెనక్కి తగ్గిన పోలీసులు...49 మంది ప్రముఖలపై కేసు విత్ డ్రా
Over 140Telugu Literary Persons Endorse Letter to PM by 49 Celebrities, Condemn FIR
ʹఇది ఆర్టీసీ ఉద్యోగుల పోరాట‌మే కాదు - కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక ప్ర‌జాస్వామిక పోరాటంʹ
49 మంది ప్రముఖలపై కేసు ఎత్తివేయాలి ‍-140 మంది తెలుగు రచయితల బ‌హిరంగ‌లేఖ‌ !
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి టీఆరెస్ ప్రభుత్వం కుట్ర... సమ్మెకు ప్రజలందరూ మద్దతు తెలపాలి ...మావోయిస్టు పార్టీ
చెట్లు నరకొద్దన్నందుకు పోలీసుల దాడి...38 మందిపై కేసు
ఆ 49 మంది కోసం ...ఇక మనమూ తేల్చుకోవాల్సిందే - పాణి
ఆర్టీసీ నష్టాలకు కారణమెవరు ? సమ్మె ఎవరి కోసం ?
జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
జగన్ ది నరహంతక పాలన.. ఏవోబీ ఎన్ కౌంటర్ కు నిరసనగా అక్టోబర్ 3న బంద్ - మావోయిస్టు నేత గణేష్
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం
అమేజాన్‌ కార్చిచ్చుకు అసలు కారణం - పి.వరలక్ష్మి
మహాజనాద్భుత సాగరహారానికి ఏడేండ్లు -ఎన్ వేణుగోపాల్
ʹహైకోర్టు తీర్పు ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను ABMS కు అప్పజెప్పాలిʹ
మావోయిస్టు అరుణ ఎక్కడ ?
more..


ʹఆర్టికల్